HOME »NEWS »ANDHRA PRADESH »mp raghurama krishnam raju donates his 3 month salary for ram mandir construction su

Raghurama Krishnam Raju: అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ఎంపీ రఘురామ కృష్ణంరాజు విరాళం

Raghurama Krishnam Raju: అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ఎంపీ రఘురామ కృష్ణంరాజు విరాళం
రఘురామ కృష్ణంరాజు(ఫైల్ ఫొటో)

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి పలువురు ప్రముఖులు విరాళాలు అందజేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా నర్సాపురం ఎంపీ రఘరామ కృష్ణంరాజు కూడా అయోధ్య ట్రస్టుకు తనవంతు విరాళం అందజేశారు.

  • Share this:
    అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి పలువురు ప్రముఖులు విరాళాలు అందజేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా నర్సాపురం ఎంపీ రఘరామ కృష్ణంరాజు కూడా అయోధ్య ట్రస్టుకు తనవంతు విరాళం అందజేశారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం తన మూడు నెలల జీతం రూ. 3.9 లక్షలను విరాళంగా ఇచ్చినట్టు తెలిపారు. అలాగే శనివారం భక్తులతో కలిసి రూ. 1,11,111 అందజేసినట్టు చెప్పారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో ఓ పోస్ట్ చేశారు. వందల ఏళ్లనాటి ఈ కలను నేరవేర్చడానికి ప్రతి ఒక్కరు ఎంతో కొంత విరాళంగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. ''విరాళం ఇచ్చేంది 100 రూపాయలు కావాచ్చు లేక రూ. 10 లక్షలు కావచ్చు.. కానీ ఇక్కడ అమౌంట్ కన్నా ఈ కార్యక్రమంలో పాల్గొనడం, భక్తి అనేది ముఖ్యం"అని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు.

    అయోధ్యలో రామమందిర నిర్మాణానికి శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ దేశవ్యాప్తంగా ప్రజల నుంచి విరాళా సేకరణ ప్రారంభించింది. రామ మందిర నిర్మాణానికి అన్ని వర్గాల నుంచి విరాళాలను సేకరించనున్నారు. ఇందుకోసం పట్టణాలు, గ్రామాల్లోనూ కమిటీలను నియమించారు. నిధుల సేకరణలో భాగంగా దేశవ్యాప్తంగా 13 కోట్ల కుటుంబాలకు చెందిన 65 కోట్ల మందిని రామభక్తులు కలిసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విశ్వహిందూ పరిషత్ నేతృత్వంలో జరిగే ప్రచారంలో 40లక్షల మంది పాలు పంచుకోనున్నారు. నిధుల సేకరణ, ప్రచారం కోసం దేశవ్యాప్తంగా 5.25 లక్షల గ్రామాల్లో కమిటీలను ఏర్పాటు చేశారు. వచ్చే నెల 27వ తేదీ వరకు నిధుల సేకరణ సాగనుంది.







    ఇప్పటికే రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ ఇవాళ అయోధ్య ట్ర‌స్టుకు 5 ల‌క్ష‌లు విరాళం ఇచ్చారు. హిమచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ కూడా తన నెల వేతనాన్ని అయోధ్య ట్రస్టుకు విరాళంగా ప్రకటించారు. శనివారం తనను కలిసిన శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రతినిధులకు రూ. 1,83,750ల డీడీని అందజేశారు. ఇక, అయోధ్యలో రామాలయ నిర్మాణానికి మొత్తం 1,100 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ అంచనా వేసిన సంగతి తెలిసిందే.
    Published by:Sumanth Kanukula
    First published:January 17, 2021, 08:46 IST