Home /News /andhra-pradesh /

MOVIE TICKETS ISSUE CONTINUING IN ANDHRA PRADESH AS EXHIBITORS OPPOSING GOVERNMENT RULES FULL DETAILS HERE PRN GNT

AP Movie Tickets Issue: ఏపీలో కొనసాగుతున్న సినిమా టికెట్ల రగడ.. థియేటర్ ఓనర్ల అభ్యంతరాలివే..!

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో సినిమా టికెట్ల రగడ (Movie Tickets Issue) ఇంకా కొనసాగుతోంది. సినిమా టికెట్లను యువర్ ఛాయస్ ఆన్లైన్ ప్లాట్ ఫారం ద్వారా విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఐతే ప్రభుత్వ నిర్ణయాన్ని సినిమా థియేటర్ల యజమానులు, ఎగ్జిబిటర్స్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

ఇంకా చదవండి ...
    Anna Raghu, News18, Amaravati

    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో సినిమా టికెట్ల రగడ (Movie Tickets Issue) ఇంకా కొనసాగుతోంది. సినిమా టికెట్లను యువర్ ఛాయస్ ఆన్లైన్ ప్లాట్ ఫారం ద్వారా విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఐతే ప్రభుత్వ నిర్ణయాన్ని సినిమా థియేటర్ల యజమానులు, ఎగ్జిబిటర్స్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ఎంఓయూలు చేసుకోవాలని కోరుతున్నా.. థియేటర్ల ఓనర్లు మాత్రం ససేమిరా అంటున్నారు. ఐతే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించడానికి చాలా కారణాలు ఉన్నాయంటున్నారు థియేటర్ల యజమానులు. ఏపీలో ఇకపై ప్రభుత్వం నిర్ధేశించిన ధరలకే సినిమా టికెట్ లు ప్రేక్షకులకు అందుబాటులోకి రానున్నాయి. బ్లాక్ టికెటింగ్ విధానానికి స్వస్తిపలికి ప్రజలకు తక్కువ ధరకే వినోదం అందుబాటులోకి రావాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఏపీఎఫ్డీసీ పోర్టల్ ‘యువర్ స్క్రీన్స్’ అందుబాటులోకి తీసుకురానుంది.

    తాము రూపొందించిన పేమెంట్ గెట్‌వే నుంచి టికెట్ బుకింగ్ చేసుకుంటే ప్రేక్షకుడిపై ఎలాంటి అదనపు భారం పడదని ప్రభుత్వం చెబుతోంది. ఏదైనా కొత్త సినిమా విడుదలైందంటే యువర్ స్క్రీన్స్ అనే పోర్టల్ ద్వారా తక్కువ ధరకే సినిమా టికెట్ బుక్ చేసుకుని ఇంటిల్లిపాది సంతోషంగా వినోదం ఆస్వాదించవచ్చని ప్రభుత్వం తెలిపింది. ఇతర పోర్టల్లలో టికెట్ బుకింగ్ చేసుకుంటే టికెట్ పై అదనంగా రూ.20 నుండి రూ.25 వరకు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న నేపథ్యంలో ప్రేక్షకుడిపై భారం పడుతుందని గ్రహించిన ప్రభుత్వం వాటికి అడ్డుకట్ట వేసే దిశగా ఆలోచించి యువర్ స్క్రీన్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్లాట్ ఫామ్ ఛార్జీగా టికెట్ పై కేవలం 1.95 శాతం మాత్రమే అంటే సున్నా ఛార్జీ పడుతుందని ప్రభుత్వం పేర్కొంది.

    ఇది చదవండి: చంద్రబాబుకు పోటీగా విశాల్..? కుప్పంలో గెలుపునకు జగన్ స్కెచ్..?


    ప్రస్తుతం ఉన్న ఆన్ లైన్ పోర్టల్స్ తో థియేటర్ల వారికి కొన్ని ప్రత్యేక సదుపాయాలున్నాయి. అగ్రిమెంట్ ఎవరైతే చేసుకున్నారో అప్పటికి ప్రభుత్వ ఎగ్జిస్టింగ్ జీవో ప్రకారం కేవలం 50 శాతం సీట్లు మాత్రమే ఆన్ లైన్ లో బుకింగ్ చేసుకునే అవకాశం ప్రభుత్వం కలిగించిందని చెబుతున్నప్పటికీ సినిమాహాళ్ళ నిర్వహణకు వడ్డీ లేని రుణ సదుపాయాన్ని ప్రస్తుతం ఉన్న ఆన్ లైన్ పోర్టల్స్ కల్పిస్తున్నాయి. అంతేకాకుండా టికెట్ల డబ్బు ఎప్పుడు ఇస్తారో మొదట స్పష్టమైన ఆదేశాలు లేవు దీనిపై థియేటర్ల ఓనర్లు ప్రశ్నించగా.. తర్వాతి రోజే చెల్లిస్తామని అధికారులు స్పష్టం చేశారు.

    ఇది చదవండి: సీఎం జగన్ గోల్డెన్ ఛాన్స్ మిస్సయ్యారా..? ఆ విషయంలో ఆశలు వదులుకోవాల్సిందేనా..?


    ప్రధాన అభ్యంతరాలివే..!

    • సినిమా హాల్ వద్ద కౌంటర్లలో విక్రయించిన టికెట్లపైనా రూ.1.95 సర్వీస్ ట్యాక్స్ ప్రభుత్వానికి చెల్లించాలనడంతో ఓనర్లు ససేమిరా అంటున్నారు. తాము వసూలు చేయని ఛార్జీలను ప్రభుత్వానికి ఎలా చెల్లించాలని థియేటర్ల ఓనర్లు ప్రశ్నిస్తున్నారు.

    • అలాగే ఆన్ లైన్లో టికెట్లు కొనుగోలు చేసిన తర్వాత నాలుగు గంటల్లో రద్దు చేసుకునే అవకాశాన్ని ప్రేక్షకులకు ప్రభుత్వం కల్పించింది. ఇలా రద్దు చేసుకున్న టికెట్లు సినిమా హాళ్ల వద్ద కౌంటర్లలో అమ్ముడవకపోతే ఆ నష్టాన్ని ఎవరు భరిస్తారని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు రద్దు చేసుకున్న టికెట్ల ఛార్జీల విషయాన్ని  స్పష్టం చేయాలని ఎగ్జిబిటర్లు కోరుతున్నారు.

    • ఎగ్జిబిటర్స్ నుంచి ప్రభుత్వానికి వెళ్లాల్సిన కమిషన్ వెళ్లకపోతే రెవెన్యూ అధికారుల ద్వారా వసూలు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది.. మరి ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బు రాకపోతే ఎవర్ని అడగాలని నిలదీస్తున్నారు.


    వీటన్నింటికీ స్పష్టమైన సమాధానాలు చెప్పేవరకు ప్రభుత్వంతో ఎంఓయూలు చేసుకునేది లేదని థియేటర్ల యజమానులు స్పష్టం చేస్తున్నారు. అంతేకాదు అవసరమైన సినిమా థియేటర్లను మూసేస్తామని హెచ్చరిస్తున్నారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Ap government, Movie News

    తదుపరి వార్తలు