Home /News /andhra-pradesh /

MOVIE THEATRES MANAGEMENTS THINKING TO GO FOR PROTEST IN ANDHDRA PRADESH AFTER GOVERNMENT ISSUED ONLINE TICKETS GO FULL DETAILS HERE PRN

AP Movie Tickets Issue: ఏపీలో ఇక సినిమా చూడటం కష్టమేనా..? ఎంఓయూపై థియేటర్ల అభ్యంతరం..!

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

కరోనా (Corona) వల్ల ప్రపంచమంతా అతలాకుతలమయ్యింది. అందులో ముఖ్యంగా సినీపరిశ్రమ బాగా దెబ్బతినింది. కోవిడ్‌ ఎఫెక్ట్‌తో మొన్నటివరకు సినిమా ప్రదర్శనలు ఆగిపోయాయి. కాస్త పరిస్థితులు మారినా కొన్ని రోజులు పెద్ద సినిమాలు థియేటర్‌ మొఖం చూడలేదు.

ఇంకా చదవండి ...
    కరోనా (Corona) వల్ల ప్రపంచమంతా అతలాకుతలమయ్యింది. అందులో ముఖ్యంగా సినీపరిశ్రమ బాగా దెబ్బతినింది. కోవిడ్‌ ఎఫెక్ట్‌తో మొన్నటివరకు సినిమా ప్రదర్శనలు ఆగిపోయాయి. కాస్త పరిస్థితులు మారినా కొన్ని రోజులు పెద్ద సినిమాలు థియేటర్‌ మొఖం చూడలేదు. చిన్న సినిమాలు విడుదలైనా ప్రజలు థియేటర్‌ వైపు వెళ్లలేదు. దీంతో కాస్త సినిమాల విడుదలపై కూడా తర్జనభర్జన పడ్డారు. ఇక లాభం లేదని ఒక్కొక్కటిగా భారీ సినిమాలు థియేటర్లను పలకరించడం మొదలుపెట్టాయి. ఆ సమయంలో టికెట్ల ధరలపై వివదాలు చెలరేగాయి. ప్రభుత్వం తెచ్చిన టిక్కెట్‌ ధరల తగ్గింపు నిబంధనలతో థియేటర్ల యాజమాన్యాలు ఖంగుతిన్నాయి. ఇప్పుడు మూలిగే నక్కపై తాటిపళ్లు పడ్డ చందాన అసలే కుదేలైన థియేటర్‌ యాజమాన్యాలకు ప్రభుత్వం మరో షాకిచ్చింది. అదేంటంటే.., ప్రభుత్వం ఆన్‌లైన్‌లో ఏపీఎఫ్‌డీసీ(APFDC) ద్వారా టికెట్ల అమ్మకాలు చేయాలని ఒప్పందం కోసం ప్రయత్నిస్తోంది. ఈ విషయం తెలిసి థియేటర్ల యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు వాపోతున్నారు.

    థియేటర్‌ యజమానులను కలవరపెడుతున్న ప్రభుత్వ చర్యలు
    కరోనా కాలంలో లాక్‌డౌన్ అంటూ సినిమాలు విడుదల కాలేదు. సినిమాలు లేక థియేటర్లు మూతపడటంతో వేలాదిగా కార్మికులు రోడ్డున పడ్డారు. తర్వాత సినిమా థియేటర్లు తెరిచినా..కరోనా ఆంక్షలతో 50శాతం మాత్రమే ఆక్యుపెన్సీ ఉండాలన్నారు. అంతేనా ఆ తర్వాత టికెట్ల ధరలు తగ్గింపుతో యజమానులు థియేటర్లను తెరవలేకపోయారు. తర్వాత ప్రభుత్వంతో జరిపిన చర్చలు కొంతమేర ఊరట కల్పించినా.. మళ్లీ ఇప్పడు కొత్తగా ప్రభుత్వం తీసుకురావాలనుకుంటున్న జీవో థియేటర్ల యజమానులకు నిద్రలేకుండా చేస్తోంది.

    ఇది చదవండి: మరింత పటిష్టంగా ఆరోగ్యశ్రీ.. ఇకపై వైద్యం మరింత ఈజీ.. సీఎం జగన్ కీలక ఆదేశాలు..


    ప్రభుత్వ ఆధ్వర్యంలోనే టికెట్ల అమ్మకాలు..!
    తమ ఆధ్వర్యంలోనే టికెట్ల అమ్మకాలు జరగేలా కొత్త జీవో తీసుకురావాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ (APFDC) ఆధ్వర్యంలో సినిమా టికెట్లను ఆన్‌లైన్‌లో అమ్మడం సంగతి సరే.. అమ్మిన టికెట్ల డబ్బులు ఎప్పుడు తిరిగిస్తారోనని థియేటర్‌ యజమానులు కంగారుపడుతున్నారు. ఈ రోజు జరిగిన టిక్కెట్‌ అమ్మకాల తాలుకా డబ్బులను తర్వాత రోజు థియేటర్‌ యజమాని ఖాతాలో వేస్తామంటున్నా కూడా వాళ్లు భయపడుతున్నారు.

    ఇది చదవండి: ఏపీలో కొనసాగుతున్న సినిమా టికెట్ల రగడ.. థియేటర్ ఓనర్ల అభ్యంతరాలివే..!


    వ్యాపారం చేసేదెట్లా..!
    కోనసీమ జిల్లాలో 56 థియేటర్లు, కాకినాడ జిల్లాలో 45 థియేటర్లు, తూర్పుగోదావరి జిల్లాలో 33 థియేటర్లకు సంబంధించిన డబ్బులు రాష్ట్రప్రభుత్వం దగ్గర ఉండిపోతే.. తాము వ్యాపారం చేసేదెట్లా అని డిస్ట్రిబ్యూటర్లు కంగారుపడిపోతున్నారు. వాళ్లు ఆలోచనలో ఉండగా.. ఈ ఏపీఎఫ్‌డీసీ రూపొందించిన ఎంవోయూల (MoU)పై సంతకాలు చేయాలని థియేటర్లు, ఎగ్జిబిటర్ల ఓనర్లపై ఒత్తిడి పెరుగుతోంది.

    ఇది చదవండి: చంద్రబాబుకు పోటీగా విశాల్..? కుప్పంలో గెలుపునకు జగన్ స్కెచ్..?


    ఈ నెల రెండో తారీఖు ఇచ్చిన జీవో, దానికి అనుబంధంగా ఒప్పందం రూపొందించి సంతకాలు చేయాలని ఒత్తిడి తేవడంపై ఎగ్జిబిటర్లు ఆందోళన చెందుతున్నారు. థియేటర్‌ నిర్వహణకు రోజువారీ ఖర్చులుంటాయని, ఆన్‌లైన్‌లో పడ్డ డబ్బులు ఒకవేళ నిలిచిపోతే తమకు పెద్ద సమస్య అవుతుందని వాపోతున్నారు.

    ఇది చదవండి: కొత్త వ్యూహంతో పవన్ కల్యాణ్.. ఇకపై ప్రతి ఆదివారం జనంలోనే..!


    సినిమా టిక్కెట్‌లకు సంబంధించి ఆన్‌లైన్‌ వ్యవహారంపై ఉన్న నిబంధనలు, ఎంవోయూలపై వస్తున్న ఒత్తిడిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించిన ఉమ్మడి జిల్లాలోని డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యజమానులు నిర్ణయించారు. ఈ క్రమంలో భాగంగా రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను కలిసి వినతిపత్రం అందించారు.



    ఈ సందర్భంగా ఎంవోయూలపై అధికారులు తమపై ఒత్తిడి తీసుకువస్తున్నారని, నిబంధనలు పూర్తిగా ఎఫ్‌డీసీకి అనుకూలంగా ఉన్నాయని మంత్రికి వివరించారు. ఆన్‌లైన్‌లో టికెట్ల అమ్మకాలు చేస్తే..ఆ రోజు డబ్బును తర్వాత రోజు ఇస్తామనడంపై తమకు స్పష్టత రావడం లేదని.. దాన్ని మరోసారి పునఃపరిశీలించాలని మంత్రికి విన్నవించుకున్నారు. మరి చూడాలి.. ఇకనైనా థియేటర్‌ యజమానుల సమస్యలకు పరిష్కారం వస్తుందో రాదో.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Theaters

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు