Home /News /andhra-pradesh /

MOVIE THEATRES CONTROVERSY CONTINUING IN ANDHRA PRADESH AS BIG MOVIES MAY FACE LOSES FULL DETAILS HERE PRN

AP Theatres Closed: ఆ మూడు జిల్లాల్లోనే 100 సినిమా హాళ్లు క్లోజ్... ఆ సినిమాలకు ఇక కష్టమేనా..

ఏపీలో మూతబడుతున్న సినిమా థియేటర్లు

ఏపీలో మూతబడుతున్న సినిమా థియేటర్లు

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో సినిమా థియేటర్లలో (Movie Theatres) అధికారుల తనిఖీల వ్యవహారం మరింత సీరియస్ అవుతోంది. వరుస తనిఖీలు, జరిమానాలు విధించడం, థియేటర్లు సీజ్ చేస్తున్న నేపథ్యంలో నిర్వాహకులు చేతులెత్తేస్తున్నారు.

    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో సినిమా థియేటర్లలో (Movie Theatres) అధికారుల తనిఖీల వ్యవహారం మరింత సీరియస్ అవుతోంది. వరుస తనిఖీలు, జరిమానాలు విధించడం, థియేటర్లు సీజ్ చేస్తున్న నేపథ్యంలో నిర్వాహకులు చేతులెత్తేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 50కి పైగా థియేటర్లను అధికారులు సీజ్ చేయగా.. చాలా చోట్ల యజమానులే మూసేస్తున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెం.35 ప్రకారం టికెట్లు విక్రయించని థియేటర్లపై చర్యలు తీసుకుంటున్నారు. నాలుగు రోజులుగా థియేటర్లపై దాడులు చేస్తున్న రెవెన్యూ అధికారులు, పోలీసులు రూల్స్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. టికెట్లను అధిక ధరలకు విక్రయిస్తున్న థియేటర్లు, లైసెన్స్ గడవు ముగిసినా, ఫైర్ సెఫ్టీ సర్టిఫికెట్ లేకపోయినా సీజ్ చేస్తున్నారు. అలాగే థియేటర్లలో క్యాంటీన్ నిర్వహణ, తినుబండారాలు ధరలు, శుభ్రత, కొవిడ్ నిబంధనల వంటివాటిపై ప్రధానంగా దృష్టిపెడుతున్నారు.

    కృష్ణాజిల్లాలో నిబంధనలు పాటించడం లేదని 11 థియేటర్లను సీజ్ చేసి మరో థియేటర్ కు జరిమానా విధించారు. అలాగే గుంటూరు జిల్లాలోని 70 థియేటర్లలో తనిఖీలు చేసి అందులో 35 థియేటర్లకు నోటీసులిచ్చారు. నాలుగు థియేటర్లను సీజ్ చేశారు. చిత్తూరు జిల్లాలో 18 థియేటర్లను సీజ్ చేసిన అధికారులు మరికొన్నింటికి నోటీసులిచ్చారు. విజయగనగరం జిల్లాలో 6, పశ్చిమగోదావరి జిల్లాలో మూడు, మిగలిన జిల్లాలో ఒకటి లేదా రెండు చొప్పున థియేటర్లకు తాళాలుపడ్డాయి.

    ఇది చదవండి: శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఇకపై ఇవి లేకుంటే తిరుమల కొండపైకి నో ఎంట్రీ..!


    కొన్ని చోట్ల నిబంధనలు పాటించని కారణంగా థియేటర్లను అధికారులు సీజ్ చేస్తుంటే.. మరికొన్ని చోట్ల యజమానులే సినిమా హాళ్లను మూసేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలతో హాలు నిర్వహించడం తమ వల్ల కాదని బోర్డులు పెడుతూ తాళాల వేస్తున్నారు. మరికొన్ని చోట్ల హాల్ రిపేరులో ఉందని.. స్క్రీన్ సమస్య ఉందని చెబుతూ మూసేస్తున్నారు. కారణాలు ఏమైనా టికెట్ల ధరలు, తనిఖీల కారణంగానే థియేటర్లను మూసివేస్తున్నట్లు తెలుస్తోంది.

    ఇది చదవండి: ఒమిక్రాన్ కు ఆనందయ్య మందు వాడొచ్చా..? ఆయుష్ శాఖ ఏం చెప్పిందంటే..!


    తూర్పుగోదావరి జిల్లాలో అధికారులు సీజ్ చేసిన థియేటర్లతో పాటు యజమానులు ప్రదర్శనలు నిలిపేసిన థియేటర్లన్నీ కలిపి 45 ఉన్నాయి. కృష్ణాజిల్లాలో 12 థియేటర్లను అధికారులు సీజ్ చేస్తే మరో 18 థియేటర్లను యజమానులే మూసివేశారు. దీంతో జిల్లాలో 30 థియేటర్లు క్లోజ్ అయ్యాయి. అలాగే పశ్చిమగోదావరి జిల్లాలో 23 థియేటర్లు మూతబడ్డాయి. ఒకటి రెండు రోజుల్లో రాష్ట్రంలో చాలా థియేటర్లు ఇదే దారిలో వెళ్లే అవకాశాలున్నాయి.

    ఇది చదవండి: కొత్త దారిలో వైసీపీ నేతలు.. మేకప్ వేస్తే లక్ కలిసొస్తుందా..?


    న్యూ ఇయర్, సంక్రాంతి సీజన్ లో RRR, రాధేశ్యామ్ వంటి పెద్దసినిమాలు విడుదల కానున్నాయి. ఇదే సమయంలో థియేటర్లు మూతడబడుతుండటంతో వాటి కలెక్షన్లపై తీవ్రప్రభావం చూపే అవకాశమంది. ఇప్పటికే ఒకటి రెండు పెద్ద సినిమాలు థియేటర్లలో ఉన్నాయి. వాటి విషయంలోనూ కలెక్షన్ల పరంగా ప్రతికూల ఫలితాలే రానున్నాయి.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Theatres

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు