Suman: ఏపీలో హిందూ ఆలయాలపై దాడులు.. నటుడు సుమన్ సంచలన వ్యాఖ్యలు

Suman: ఏపీలో హిందూ ఆలయాలపై దాడులు.. నటుడు సుమన్ సంచలన వ్యాఖ్యలు

సుమన్

చంద్రబాబు, లోకేష్‌, అశోక్ గజపతిరాజు కలిసి రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేయించారని కొడాలి నాని బాంబు పేల్చారు. ఈ ముగ్గురితో పాటు స్థానిక రాజకీయా నాయకులకు నార్కో టెస్ట్‌లు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.

  • Share this:
    ఏపీలో హిందూ దేవాలయాలపై వరుస దాడులు దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే రామతీర్థంలో రాముడి విగ్రహం ధ్వంసంపై రాజకీయ రచ్చ కొనసాగుతోంది. అన్ని పార్టీలు పోటాపోటీగా రామతీర్థం వెళ్తున్నాయి. ఈ గొడవ ముగియక ముందే మరో దారుణం జరిగింది. విజయవాడలో సీతమ్మ విగ్రహాన్ని కూడా గుర్తు తెలియని ధ్వంసం చేశారు. పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ సమీపంలో ఉన్న ఆలయంలో ఆ ఘటన జరిగింది. ఇలా వరుస ఘటనలపై హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి. దేవాలయాలు, దేవుడి విగ్రహాలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో ఆలయాల ధ్వంసంపై సినీ నటుడు సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

    ఆదివారం తిరుమలలో లగడపాటి రాజగోపాల్ కుమార్తె పెళ్లి సుమన్ హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు ప్రతి పక్షాలు కుట్రలు చేసి ఉండొచ్చని ఆయన అన్నారు. ఇతరులు కూడా ఈ ఘటనలకు పాల్పడి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. దేవుడి విషయంలో తప్పు చేసిన వారికి ఆ దేవుడే శిక్ష విధిస్తాడని తెలిపారు. ఆలయాలు, మసీదులు, చర్చిల భద్రతకు, పర్యవేక్షణకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సూచించారు సుమన్. దేవాలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసానికి పాల్పడిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.

    కాగా, ఏపీలో రామతీర్థం రణతీర్ధంగా మారిన విషయం తెలిసిందే. రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ ఘటనపై మంత్రి కొడాలి నాని తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, లోకేష్‌, అశోక్ గజపతిరాజు కలిసి రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేయించారని బాంబు పేల్చారు. ఈ ముగ్గురితో పాటు స్థానిక రాజకీయా నాయకులకు నార్కో టెస్ట్‌లు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇది ముమ్మాటికి చంద్రబాబే కుట్ర అని.. మత విద్వేషాలు సృష్టించి, రాజకీయంగా లబ్ధి పొందేందుకే ఇలాంటి పనులు చేస్తున్నారని కొడాలి నాని విమర్శించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    అగ్ర కథనాలు