హఠాత్తుగా కొండంత అండను ప్రమాదంలో కోల్పోయింది.. అయినా ఆ గుండె నిబ్బరం సడలలేదు.. చేతికందిన కొడుకు.. రాజకీయ ఎత్తుగడలకు బలయ్యి.. జైలు పాలయ్యాడు. అయినా ఆమె నమ్మకంలో అణువంతైనా తగ్గలేదు. తొలిసారి రాజకీయ నేతగా అవతారమెత్తి అసెంబ్లీలో తాను ఇచ్చిన ప్రసంగాన్ని ప్రత్యార్ధులు ఎగతాళి చేసిన వెనుకడుగు వేయలేదు. ఇలా చెప్పుకుంటే పోతే చాలా ఒడిదుడుకులను కన్నీళ్లు.. మనో ధైర్యంతో ఎదురించి నేడు ఒక సక్సెస్ ఫుల్ కొడుకును ఆంధ్రరాష్ట్రానికి పరియం చేసింది. ఆమె వైఎస్ విజయమ్మ. ఆమె గురించి ప్రత్యేకంగా పరిచయ వ్యాఖ్యలు రాయనవసరం లేదు. అమ్మ ఓర్పునకు కన్నపేగు పట్ల నిబద్దతకు సరైన ఉదాహారణ విజయమ్మ. మథర్స్ డే సందర్భంగా వైఎస్ విజయమ్మపై ప్రత్యేక కథనం.
సరిగ్గా ఏడాదికి ఆ తల్లి తన కొడుకును ఏ స్థానంలో చూడాలనుకుందో అదే స్థానంలో చూసిన రోజు. అదే వైఎస్ జగన్ మెహాన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా తనివితీరా చూసుకున్న క్షణాలు. ఒక పెద్ద రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన తన కొడుకు ఎక్కడ ప్రత్యర్ధుల రాజకీయాలకు బలైపోతాడనని అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుకుంది. భర్త వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తరువాత అప్పటి వరకు తన చుట్టూ తన కుటుంబం చుట్టూ చెతులు కట్టుకుని తిరిగిన నేతలందరీ స్వార్ధ రాజకీయ గుణాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. దాంతో కొడుకు రాజకీయ భవిష్యత్‌పై నీలి నీడలు కమ్మకున్నాయి.
అయినా అప్పటి వరకు వంటి గది తప్ప మరో ప్రపంచ తెలియని ఆ తల్లి తొలిసారిగా రాజకీయనేతగా రూపాంతరం చెందాల్సి వచ్చింది. ప్రత్యర్ధుల ఎత్తుగడలకు కొడుకు జైలు పాలైనప్పుడు అన్ని తానే పార్టీని నడిపి తన సామర్ధాన్ని నిరూపించుకుంది. దాదాపు తొమ్మిదేళ్ల పాటు జగన్ బలమైన ప్రత్యర్ధి అయిన చంద్రబాబుతో అడుగడుగునా పోటీ పడుతున్న నేపథ్యంలో కొడుకుకు అన్నీ తానై నిలించింది. ముఖ్యంగా జగన్‌లో మానసిక ధైర్యన్ని నింపండంలో విజయమ్మ కీలక పాత్ర పోషించారాని చెబుతారు సన్నిహితులు, పార్టీ నేతలు. జగన్ జైలుకి వెళ్లినప్పుడు పార్టీ బాధ్యతలు తీసుకొని పార్టీ గౌరవ అధ్యక్షురాలిగా వ్యవరించి ఎంతో రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబును ఎదుర్కొని ధీటైన మహిళగా నిలిచారు విజయమ్మ.
“జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు ఈ స్థాయికి వచ్చారంటే దానికి కారణం తప్పకుండా విజయమ్మ అనే చెప్పుకోవాలి. తండ్రి అకాల మరణం తరువాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన మాటను బాధ్యతగా తన కొడుకు తీసుకునేలా చేయడంలో ఆమె పాత్ర ఆకాశమంత. జగన్ లేని సందర్భల్లో పార్టీని కీలకంగా ముందుకు నడిపిండంలో విజయమ్మ చాలా కష్టపడ్డారు. తొమ్మిదేళ్లపాటు తన కోడుకును ఈ స్థానంలో కూర్చొపెట్టడానికి అనుక్షణం ఆవిడ తాపత్రయడ్డారు. తల్లి సహకారం లేనిదే ఈ రోజు జగన్ ఇంతటి విజయం సాధించేవారు కాదు. తల్లి కొడుకుల కష్టం ప్రజలు చూశారు.. అందులో నిజముందని భావించారు.. కాబట్టే ఇప్పటి వరకు రాష్ట్ర చరిత్రల్లో లేని విధంగా అత్యధిక మెజార్టిని కట్టబెట్టి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొబెట్టారు. ఒక్క మాటలో చెప్పాలంటే విజయమ్మ లేనిదే జగన్ లేరు అనేది అక్షర సత్యం.” అని వైసీపీ తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి న్యూస్ 18 కి తెలిపారు.
పార్టీ స్థాపించిన తొలినాళ్లల్లో అన్ని అడ్డకుంలే..
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నంత వరకు నోరు కూడా ఎత్తే ధైర్యం చేయని ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు.. రాష్ట్ర నేతలు తన భర్తపై కోడుకుపైన అవాక్కులు చవాక్కులు పెలుతున్నా ఎక్కడా ఆవేశపడలేదు. అన్నింటికి సమయమే సమాధానం చెబుతుందని మౌనంగా ఉన్నారు. తండ్రి ఉన్నత ఆశయాలను కోడుకులో నింపడంలో ప్రతి అవరోధాన్ని ఒక అవకాశంగా మార్చుకున్నారు విజయమ్మ.
“జగన్ అంటే అందరు వెంటనే మాట్లాడుకునే అంశం తాను నడిచిన వేల కీలోమీటర్లు. అయితే వేల కిలో మీటర్లల్లో ప్రతి అడుగు వెనుక ఉన్నది విజయమ్మ. ఓదార్పు యాత్ర దగ్గర నుంచి పాదయాత్ర వరకు ప్రతి ఆలోచన వెనుక సాహకారం అందించింది విజయమ్మే. ఆ విషయం మనకు జగన్ ప్రమాణ స్వీకారం వేడుక రోజు స్పష్టంగా అర్ధమైంది. ఆ రోజు జరిగిన సన్నివేశాన్ని రెండు తెలుగు రాష్ట్రాలు ఇప్పటి వరకు మర్చిపోలేదు. అది తల్లి కోడులకు మద్య ఉన్న అన్యోనత.” పార్టీ అధికార ప్రతినిధి గురుమూర్తి న్యూస్ 18 కి తెలిపారు.
పిల్లలను ఉన్నతికి చేర్చడంలో తల్లిదండ్రుల పాత్రను ఎలా ఉండాలో.. అది ఎంత ముఖ్యమో విజయమ్మ వ్యవరించిన తీరు పట్ల తెలుసుకోవచ్చు. ఎటువంటి కష్టాల్లో కూడా చెక్కుచెదరని మనో ధైర్యంతో కొడుకును ముందుకు నడిపారామె. ఇప్పటి పార్టీకి గౌరవ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తూ పార్టీకి అవసరమైన సమయంలో కీలకంగా వ్యవహరిస్తోన్నారు.