Home /News /andhra-pradesh /

MOTHER KILLED HER WEEKDAYS DAUGHTER IN GUNTUR CASE FILED VRY

Child death : పసిగుడ్డు నోటిలో వేళ్లు పెట్టి, చంపేసిన తల్లి... కారణం ఇదేనట...!

CHILD DEATH

CHILD DEATH

Child death : ఇద్దరు ఆడపిల్లల మీద ..ఇంకా వివక్ష కొనసాగుతూనే ఉంది.. కొడుకులు కావాలనే తల్లిదండ్రుల తల్లిదండ్రుల కోరిక పుట్టిన ఆడపిల్లలకు శాపంగా మారుతోంది. దీంతో పుట్టిన పసిబిడ్డలను నిర్ధాక్షిణ్యంగా చంపుతూనే ఉన్నారు..

    ఇలా.. తాజాగా ఓ తల్లి ఇదివరకే ఇద్దరు ఆడపిల్లలు ఉండగా మూడోసారి కొడుకు కోసం ఎదురు చూసింది. అయితే ఆమె కొరికకు వ్యతిరేకంగా మూడోసారి కూడా ఆడపిల్లకు జన్మనిచ్చింది. పండంటి ఆడపిల్లకు ప్రాణం పొసింది. కాని, ఆ తల్లికి నచ్చలేదు.. ఇదివరకే ఇద్దరు ఉండగా, మూడో కూతురు ఎందుకు దండగా అనుకుంది. దీంతో వారం రోజుల పసికూన నోట్లో వేళ్లు పెట్టి ఊపిరాడకుండా చేసి నిర్ధాక్షిణ్యంగా చంపివేసింది. ఆ తర్వాత ఏమి తెలియనట్టు మిన్నకుండిపోయింది.

    అయితే ఆ తల్లికి పుట్టిన బిడ్డకు ఉదయమే చికిత్స అందించిన స్థానిక ఏఎన్‌ఎం తిరిగి సాయంత్రం మరోసారి పరీక్షకోసం వచ్చేసరికి చనిపోయిందని తాపిగా చెప్పింది. ( Mother killed her weekdays daughter ) అప్పటికే ఇష్టం లేని ఆ పిసిబిడ్డను చంపిన తల్లి కొద్ది గంటల్లోనే ఖననం కూడా చేసిన పరిస్థితి కనిపించింది. దీంతో అనుమానం వచ్చిన ఏఎన్‌ఎం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

    V.C Sajjanar : సజ్జనార్ గిఫ్ట్ .. ఆ ఇద్దరు ఆడపిల్లలకు జీవితకాలం ఉచితం.


    సంఘటన వివరాల్లోకి వెళితే... గుంటూరు జిల్లా ( Guntur ) తాడికొండ మండలం రావెలకు చెందిన బొంతా లక్ష్మి ఈనెల 2న గుంటూరు జీజీహెచ్‌లో ( GGH ) ఆడపిల్లకు జన్మనిచ్చింది. కాగా నాలుగు రోజుల అనంతరం అనగా గడిచిన సోమవారం మరోసారి పరీక్షించిన వైద్యసిబ్బంది తల్లితోపాటు పాప ఆరోగ్యం కూడా బాగానే ఉండడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేశారు. ( Mother killed her weekdays daughter ) అయితే... మంగళవారం పాప నోటి నుంచి నురగ వస్తోందని తల్లి బొంతా లక్ష్మి స్థానిక ఏఎన్‌ఎంకు సమాచారమివ్వగా వాళ్లు ఇంటికి వెళ్లి పరీక్షించారు.. అనంతరం తిరిగి జీజీహెచ్‌కు రిఫర్‌ చేశారు. కాని ఆ తల్లి మాత్రం ఆసుపత్రికి వెళ్లలేదు.. అయితే ఈ విషయం తెలియని ఏఎన్‌ఎంలు పాప పరిస్థతిని తెలుసుకునేందుకు మరోసారి సాయంత్రం లక్ష్మి ఇంటికి చేరుకున్నారు.


    Jagityala : ధర్నాలో ఆశా వర్కర్లు... మధ్యలో పెళ్లికూతురు.. హైరానాలో పెళ్లికొడుకు.. ! ఇంతకి పెళ్లి కూతురు ఎలా వెళ్లిందో తెలుసా...?


    దీంతో పాప చనిపోయిందని, ఖననం కూడా చేశామని తల్లి సమాధానమిచ్చింది. షాక్‌కు గురైన వారికి పాప మృతిపై అనుమానం వచ్చింది. ( Mother killed her weekdays daughter ) ఆరోగ్యంగా ఉన్న పాప ఆకస్మాత్తుగా చనిపోయవడంపై ఏఎన్‌ఎం స్వప్న పాప తల్లి లక్ష్మిని నిలదీసింది. దీంతో అసలు విషయాన్ని చెప్పింది ఆ తల్లి.. తనకు ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు, ఒక బాబు ఉన్నారని, మళ్లీ ఆడపిల్ల పుట్టడంతో తానే పాప గొంతులో వేలుపెట్టి చంపేసినట్టు నేరం అంగీకరించింది. ( Mother killed her weekdays daughter ) ఇక ఇదే విషయాన్ని కాగితంపై రాసి సంతకం పెట్టిన లక్ష్మి, దీని గురించి ఎవరికైనా చెబితే తన చావుకు ఏఎన్‌ఎం కారణమని పేరు రాసి చస్తానని బెదిరించింది. దీంతో ఏఎన్‌ఎం స్వప్న ఆమె బెదిరింపులకు భయపడకుండా..  తల్లి ఇచ్చిన సాక్ష్యాధారంతో స్థానిక పోలీసుకు ఫిర్యాదు చేసింది.

    Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Crime news, Guntur

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు