Home /News /andhra-pradesh /

MOST POPULAR CHIDI TALIMKHANA PART OF DUSSEHRA CELEBRATIONS IN AMALAPURAM EAST GODAVARI DISTRICT IN ANDHRA PRADESH NGS

Dussehra Celebration: దసరా ఉత్సవాలకు అమలాపురం ప్రత్యేకం.. చెడీ తాలింఖన గురించి విన్నారా..? రాజమౌళి మనసు గెలిచిన కళ

దసరా ఉత్సవాల్లో చెడీ తాలింఖానది ప్రత్యేక స్థానం

దసరా ఉత్సవాల్లో చెడీ తాలింఖానది ప్రత్యేక స్థానం

Dussehra Celebrations in Amalapuram: అమలాపురం (Amalapuram)లో దసరా ఉత్సవాలకు దశాబ్దాల చరిత్ర ఉంది. ఇప్పటికీ సినిమావాళ్లకి ప్రాచీన యుద్ధ విద్యలు కావాలంటే అందరి చూపూ వీరిపైనే ఉంటుంది. ముఖ్యంగా చెడీ తాలింఖనకు ఎంతో గుర్తింపు ఉంది.

  Dussehra Celebration 2021 In Amalapuram: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో తూర్పూగోదావరి జిల్లా (East Godavari District)లోని అమలాపురం (Amalapuram)లోని దసరా ఉత్సవాలు (Dussehra celebration) ఇప్పటికీ సినిమావాళ్ళకి ప్రాచీన యుద్ధవిద్యలుకావాలంటే వీరివైపే చూపు దేశంలోని మైసూర్ (Mysore), కోల్ కతా (kolkata) లాంటి ప్రాంతాల్లో జరిగే దసరా ఉత్సవాలకు ఎంత పేరు ప్రఖ్యాతలున్నాయో అంతే ప్రత్యేకత ఉన్నాయి ఇక్కడి వేడుకలకు ముఖ్యంగా.. చెడీ తాలింఖనను చూసేందుకు వేలాదిగా జనం వస్తారు. దీంతో పాటు వాహన ఊరేగింపు ప్రత్యేక స్థానం ఉంది. అందుకే దసరా పేరు చెప్పగానే అందరికి ముందుగా గుర్తు వచ్చేది తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురమే. అక్కడ నిర్వహించి చెడి తాలింఖానానే (Chide thalinkhana). ప్రపంచంలో అత్యధిక ప్రాచీన కళలు నానాటికి దిగజారిపోతున్నా ఇప్పటికీ వన్నే తరగని రీతిలో ఈ తాలింఖానా మాత్రం ఏడాది ఏడాదికి ప్రాధాన్యతను పెంచుకుంటుంది. ఈ ఉత్సవాల్లో జరిగే చెడీ తాలింఖానాలో వయసు బేధం లేకుండా 10 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వృద్ధుల వరకు తమ విద్యను ప్రదర్శిస్తుంటారు. రాచరిక కాలపు యుద్ధాన్ని తలపించే ఈ సాహసోపేత విన్యాసాలను తిలకించేందుకు జిల్లా నుంచే కాక రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి, తెలంగాణ (Telangana)నుంచీ పెద్ద ఎత్తున జనం వస్తారు.

  దసరాకు ప్రత్యేకంగా తమ కుటుంబాలతో సహా స్థానికులు తరలి వస్తుంటారు. దసరారోజున అమలాపురం వీధుల్లో జరిగే చెడీ తాలింఖానా ప్రదర్శనల సందడి అంతాఇంతా కాదు. వీధుల్లో ప్రాచీన యుద్ధవిన్యాసాలను తలపించేలా యువకులు వృద్ధులు ప్రదర్శించే చెడీతాలింఖానా ఆద్యంతం ఉద్విగ్నభరితంగా సాగుతుంది. ముఖ్యంగా కళ్ళకు గంత లు కట్టుకుని ఓ వ్యక్తి కత్తి చేతబట్టి.. మనిషి శరీరం, కంఠం, నుదురు, పొత్తికడుపుపై కొబ్బరికాయలు, కాయగూరలు పెట్టి నరకడం వంటి విన్యాసాల గురించి చెప్పడం కంటే చూడడం మంచి అనుభూతినిస్తుంది. అగ్గిబరాటాలు, కర్రసాములు, పట్టాకత్తులతో వేగంగా, ఒడుపుగా కదులుతూ యువకులు చేసే విన్యాసాల చూపరులకు ఉత్కంఠత కలిగిస్తాయి.

  ఇదీ చదవండి: దసరా ఉత్సవాల్లో ఒక్కసారి దర్శించుకుంటే చాలు.. కోరికలు తీరినట్టే.. సాగర దుర్గ ప్రత్యేకత ఏంటో తెలుసా..?

  సుమారు రెండు వందల ఏళ్ళ చరిత్ర కలిగిన ఈ ఉత్సవాలకు అప్పటి పాలకులు బ్రిటిష్ వారు సైతం అనుమతినిచ్చారు. ఇప్పటికీ ఈ ఉత్సవాలకు ఫోటోలు బ్రిటిష్ వారి దగ్గర ఉన్నట్లు పెద్దలు చెబుతుంటారు. మొదటిసారిగా తాలింఖానా ప్రదర్శన అమలాపురంలోని ఒక వీధి కొంకాపల్లిలో 1835లో ప్రారంభమైంది. అనంతరం తిలక్ స్ఫూర్తితో స్వాతంత్య్ర సమరయోధుడు అబ్బిరెడ్డి రామదాసు 1856లో ఈ విద్యకు అంకురార్పణ చేశారు. విజయదశమి ఉత్సవాల్లో భాగంగా 1856లో మహిపాలవీధిలో ఈ ప్రదర్శనలను ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ చెడీతాలింఖానా ప్రదర్శనలు కొనసాగుతూనే ఉన్నాయి. http://
  విజయదశమి రోజున కొంకాపల్లి ఏనుగు అంబారీ, లక్క హంస, రవణం వీధి మహిషాసుర మర్దని, గండువీధి శేషశయన, నల్లా వీధి శ్రీవిజయ దుర్గమ్మ వాహనం ఇలా మొత్తం 21 వాహనాల వరకు ప్రధాన వీధుల్లో ఊరేగుతూ సందడి చేస్తాయి. అక్కడి నుంచి ముమ్మిడివరం గేటు దగ్గరకు చేరుకుంటాయి. ఈ వాహన ఊరేగింపు సమయంలో ఉండే సందడి చూడడానికి రెండు కళ్లు సరిపోవు అన్నట్లు ఉంటాయి.

  ఇదీ చదవండి: ఆంధ్రప్రదేశ్ లో నైపుణ్య శిక్షణకు మైక్రోసాఫ్ట్.. 1.62 లక్షల విద్యార్ధులకు శిక్షణ..

  తీన్మార్ బ్యాండులు.. డప్పువాయిద్యాలు, శక్తివేషధారణలు, కోయడ్యాన్సులు, బుట్టబొమ్మలు, మ్యూజికల్, విద్యుత్‌దీపాలంకరణలతో ఊరేగిస్తారు. దశాబ్దాల చరిత్ర ఉన్న ఈ ఉత్సవాలు అలనాటి బ్రిటిష్ పాలకులే కాదు.. ఈనాటి సినీ దర్శకులను కూడా ఆకర్షించాయి. దర్శకుడు రాజమౌళి ఈ చెడీ తాలింఖానా గురించి తెలుసుకుని మగధీర సినిమాలో వారి ప్రదర్శనలను.. అక్కడ స్థానిక యువకులను మగధీర సినిమాలో ఉపయోగించుకున్నారు. అంతేకాదు కొంతమంది యువకులు బాలీవుడ్ లోని చరిత్ర నేపధ్య సినిమాల్లో కూడా నటించారంటే ఈ చెడీ తాలింఖానాకు ఉన్న గుర్తింపు ఖ్యాతి ఏంటో అర్థం చేసుకోవచ్చు.
  Published by:Nagesh Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Dussehra 2021, East Godavari Dist

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు