P. Anand Mohan, Visakhapatnam, News18 Vizag numer -1: స్మార్ట్ సిటీ.. అద్బుత పర్యాటక ప్రాంతం.. కాబోయే ఐటీ హబ్.. ఇలా ఒకటా రెండా విశాఖపట్నం (Visakhapatnam)గురించి చెప్పాలి అంటే ఎన్నో ప్రత్యేకతలు.. సువిశాల సాగర తీరం నగరం సొంతం.. ఎటుచూసినా కనువిందు చేసే సోయగాలు మనసుకు హాయి గొలుపుతాయి. అడుగడుగునా ఆహ్లాదం పంచుతూనే ఉంటాయి. ఈ కారణాలతోనే విశాఖ ఎంతో అందమైన నగరం (Beatyfull city) అనే పేరు తెచ్చుకుంది. విదేశీయులు సైతం విశాఖను అంతలా ఇష్టపడతారు. ఇక్కడే జీవించాలని ఎంతో మంది ఆశపడతారు. ఇలా ఎన్నో ప్రత్యేకతలు సొంతం చేసుకున్న విశాఖ మరో ఘనత సాధించింది. హైదరాబాద్ (Hyderabad) మహా నగరాన్ని సైతం వెనక్కు నెట్టేసింది.
తాజాగా నీతి ఆయోగ్ (Neetayog) ప్రకటించిన పట్టణ సుస్థిరాభివృద్ధి సూచికలో రెండు తెలుగు రాష్ట్రాల్లో (Telugu states) మొదటి ర్యాంక్‌ను, జాతీయస్థాయిలో 18వ ర్యాంకును సాధించింది. మొత్తం 14 విభాగాల్లో పరిశీలించగా.. 12 విభాగాల్లో 60 శాతానికిపైగా మార్కులు సాధించింది. 10 లక్షలకుపైగా జనాభా ఉన్న నగరాలు కలిపి మొత్తం 56 నగరాలకు ర్యాంకులు ఇవ్వగా.. దేశంలో విశాఖ 18వ ర్యాంకు సొంతం చేసుకుంది.
ఇదీ చదవండి : దటీజ్ విశాఖపట్నం.. హైదరాబాద్ ను వెనక్కు నెట్టేసింది. అన్నింటిలో టాప్
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే, ఎన్సీఆర్బీ, జిల్లాస్థాయి విద్యా సమాచారం, వివిధ మంత్రిత్వశాఖలు, ప్రభుత్వాల నుంచి అందిన అధికారిక సమాచారం ఆధారంగా మొత్తం 14 విభాగాల్లో 77 కొలమానాల్ని ప్రాతిపదికగా తీసుకుని నీతిఆయోగ్ ఈ ర్యాంకులు ప్రకటించింది.
ఆయా నగరాలు సాధించిన పురోగతిని లెక్క కట్టి.. ఒక్కో నగరానికి 100 వరకు మార్కులు ఇచ్చారు. అంటే వంద మార్కులు సాధించిన ప్రాంతాలు ఇప్పటికే ఇప్పటికే లక్ష్యాలను చేరుకున్నట్లుగా నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. అందే 65–99 మార్కులు సాధించిన నగరాలు ఫ్రంట్ రన్నర్‌గా పేర్కొంది. ఇక 50–64 మార్కులు సాధించినవి పర్వాలేదు.. ముందుకు వెళ్తున్నాయనే కేటగిరిలోకి తెచ్చారు.
మిగిలినవి అంటే 0–49 మార్కులు సాధించిన వాటిని పూర్తిగా వెనుకబడిన వాటిగా పేర్కొంది. వీటిలో విశాఖ నగరం 68.14 మార్కులతో ఫ్రంట్ రన్నర్ జాబితాలో ఉంది. టైర్–1 సిటీల కంటే ద్వితీయ శ్రేణిలో ఉన్న వైజాగ్ అందర్నీ ఆకర్షిస్తుండడం విశేషం.
ఇదీ చదవండి : నాకు జరిగిన అవమానం మరెవరికీ జరగకూడదు.. అసెంబ్లీ ఘటనపై భువనేశ్వరి రియాక్షన్ ఇదే..
లెక్కల ప్రకారం చూస్తే విశాఖపట్నం ద్వితీయశ్రేణి నగరమే.. కానీ మహా నగరాలతో పోటీపడేలా దూసుకుపోతోంది. ముఖ్యంగా నౌకా వాణిజ్యానికి, పర్యాటకరంగానికి కేఆరాఫ్ గా నిలుస్తోంది. మరోవైపు విస్తరిస్తున్న రియల్ రంగం, ఐటీ కంపెనీలు, పర్యాటక ప్రాంతాలతో నగరం బ్రాండ్ విలువ రెట్టింపు అవుతూ వస్తోంది. ఇక పారిశ్రామిక రంగాల్లోను, అరకు వ్యాలీ, సింహాచలం, రుషికొండ, బీచ్ పార్కులు, భీమిలీ బీచ్‌లతో విశాఖ అందాలు, పర్యాటక, హోటల్ రంగాల్లో కొత్త కొలువులను సృష్టిస్తున్నాయి.
ఇదీ చదవండి : అమ్మా టీ చాలా బాగుంది.. ఓడిపోయిన చోటే నెగ్గాలి అంటున్న లోకేష్
తాజాగా నీతి ఆయోగ్ ప్రకటించిన ర్యాంకుల్లోని 14 విభాగాల్లో విశాఖ నగరం సత్తా చాటింది. కానీ రెండు విభాగాల్లో మాత్రం నెంబర్ కాలేకపోయింది. పారిశ్రామిక, మౌలిక సదుపాయాల కల్పనలో 46 మార్కులకే పరిమితమైంది. మెట్రో నగరమైన హైదరాబాద్‌తోపాటు విజయవాడ నగరంతో పోలిస్తే.. విశాఖ అన్ని విభాగాల్లోను పైచేయి సాధించింది. 100 మార్కులకుగాను వైజాగ్‌కు 68.14 మార్కులు లభించింది. 66.93 మార్కులతో హైదరాబాద్ 22వ ర్యాంకులో, 65.07 మార్కులతో విజయవాడ 30వ ర్యాంకులో ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Visakhapatnam, Vizag