ఎన్నికల ఫలితాలు వచ్చే రోజున క్షణక్షణం టెన్షనే. ఓటర్లతోపాటూ.. పార్టీలు, నేతలు, అభ్యర్థులూ అందరూ టెన్షన్ పడుతూనే ఉంటారు. ఏ గంటో, రెండు గంటలో ఎదురుచూడటంలో ఓ రకమైన కిక్ ఉంటుంది కానీ... ఐదారు గంటలకు పైగా విషయం తేలకపోతే ఇబ్బందే. కానీ ఈసారి మే 23న అలాంటి పరిస్థితే ఉంటుందంటున్నారు ఎన్నికల అధికారులు. అందుకు కారణం సుప్రీంకోర్టు తాజా ఆదేశాలే. ప్రతి నియోజకవర్గానికీ ఐదు వీవీప్యాట్ యంత్రాల్లోని స్లిప్పులను లెక్కించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఐతే, ఒకేసారి అన్ని వీవీప్యాట్ యంత్రాల్నీ లెక్కిస్తారా, లేక విడివిడిగా లెక్కిస్తారా అంటే... అధికారులు... విడివిడిగా లెక్కిస్తామని అంటున్నారు. సాధారణంగా ఒక్క వీవీప్యాట్ యంత్రంలో స్లిప్పులు లెక్కించడానికి గంట నుంచీ గంటన్నర సమయం పడుతుంది. ఆ లెక్కన ఐదు యంత్రాల్లో స్లిప్పులు లెక్కించడానికి 5 గంటల కంటే ఎక్కువ సమయమే పడుతుంది అంటున్నారు ఎన్నికల అధికారులు.
లెక్క పక్కాగా ఉంటే సరేసరి... అదే తేడా వస్తే... మళ్లీ లెక్కిస్తారట. ఈవీఎంలో పోలైన ఓట్లు, వీవీప్యాట్‌లో ఉన్న స్లిప్పులతో సరిపోవాలి. ఈవీఎంలలో ఏ పార్టీ గుర్తుకి ఎన్ని ఓట్లు పడ్డాయో... వీవీప్యాట్ స్లిప్పులలో కూడా అదే పార్టీకి అన్నే ఓట్లు వచ్చి ఉండాలి. ఒక్క ఓటు తేడా వచ్చినా మళ్లీ లెక్కిస్తారు. రెండోసారి లెక్కించేటప్పుడు ప్రక్రియ అరగంటలోపే పూర్తవుతుందట. అంతా కరెక్టుగా ఉంటేనే ఫలితం వెల్లడిస్తారట. లేదంటే రెండూ (EVM, VVPAT) సరిపోయేవరకూ లెక్కిస్తూనే ఉంటారట. ఇలా ఎన్నిసార్లు లెక్కపెట్టినా లెక్క సరిపోలకపోతే... చివరకు వీవీప్యాట్‌లో వచ్చిన స్లిప్పుల ఆధారంగానే ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో ప్రకటిస్తామని చెబుతున్నారు అధికారులు. ఇదంతా తెలుసుకుంటుంటే మీకు ఏమనిపిస్తోంది. టైమ్ టేకింగ్ ప్రాసెస్ అనిపించట్లా. అందుకే ఫలితాల వెల్లడికి ఎక్కువ టైం పడుతుందన్నమాట.
ఇవి కూడా చదవండి :
చంద్రబాబులో పెరిగిన ధీమా... సమీక్షలకు సన్నద్ధం... ఆ జిల్లాపై ప్రత్యేక దృష్టి
తెలంగాణకు వస్తున్న నైరుతీ... జూన్ రెండో వారం నుంచీ వర్షాలు...
జగన్ అనే నేను... రెడీ అవుతున్న వైసీపీ... 19న నేతలతో జగన్ కీలక సమావేశం...
ఏపీలో వైసీపీకి క్లియర్ మెజారిటీ... టీడీపీ నేత చేయించిన సర్వేలో షాకింగ్ ఫలితాలు...
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, Evm tampering, Vvpat