Home /News /andhra-pradesh /

MORE THAN TWO THOUSAND MEMBERS GOT ZERO MARKS IN AP VILLAGE SECRETARIAT EXAMS MS

గ్రామ సచివాలయ పరీక్షల ఫలితాలు.. 'సున్నా' ఎంతమందికి వచ్చాయో తెలుసా?

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

కేటగిరీ-1 లోని పంచాయితీ కార్యదర్శి,డిజిటల్ కార్యదర్శి వంటి పోస్టుల క్వశ్చన్ పేపర్స్ చాలా కఠినంగా వచ్చాయని కొంతమంది అభ్యర్థులు వాపోతున్నారు.

    ఏపీ ప్రభుత్వం నిర్వహించిన గ్రామ సచివాలయ పరీక్షల్లో 2478 మంది అభ్యర్థులకు సున్నా మార్కులు వచ్చాయి.మరికొందరికి సున్నా కంటే తక్కువగా మైనస్‌లలో మార్కులు వచ్చాయి. పరీక్షలో నెగటివ్ మార్క్స్ ఉండటం.. ప్రశ్నాపత్రం కఠినంగా ఉండటంతో ఇలా సున్నా,మైనస్ మార్కులు వచ్చినవారి సంఖ్య కూడా ఎక్కువగా ఉండటానికి కారణంగా తెలుస్తోంది.కేటగిరీ-1 లోని పంచాయితీ కార్యదర్శి,డిజిటల్ కార్యదర్శి వంటి పోస్టుల క్వశ్చన్ పేపర్స్ చాలా కఠినంగా వచ్చాయని కొంతమంది అభ్యర్థులు వాపోతున్నారు. గ్రూప్-1,2 స్థాయిలో ఆ ప్రశ్నలు ఉన్నాయని.. అందుకే 11.63లక్షల మంది పరీక్షలు రాయగా.. 1588 మందికి సున్నా అంతకన్నా తక్కువ మార్కులు వచ్చాయంటున్నారు.

    ఇదిలా ఉంటే,గ్రామ సచివాల నియామక పరీక్షల్లో అవకతవకలు జరిగాయని టీడీపీ ఆరోపిస్తోన్న సంగతి తెలిసిందే. క్వశ్చన్ పేపర్ ముందే
    లీక్ అయిందని ఓ ప్రముఖ దినపత్రిక దీనిపై సంచలన కథనం ప్రచురించింది. క్వశ్చన్ పేపర్ టైప్ చేసిన ఉద్యోగే పరీక్ష రాసిందని.. పరీక్షల్లో ఆమెనే టాపర్‌గా నిలిచిందని తెలిపింది. అంతేకాదు, ఎగ్జామ్ టాపర్స్‌లో ఏపీపీఎస్సీలో పని చేసే ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, వారి బంధువులు ఉన్నారని పేర్కొంది. మరోవైపు ఈ ఆరోపణలను వైసీపీ తీవ్రంగా ఖండించింది. పరీక్షలు పారదర్శకంగా నిర్వహించామని.. క్వశ్చన్ పేపర్ లీక్ అన్న ఆరోపణల్లో నిజం లేదని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.
    Published by:Srinivas Mittapalli
    First published:

    Tags: Andhra Pradesh, Village Secretariat Exams, Ysrcp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు