Home /News /andhra-pradesh /

MORE THAN 40 DEAD BODIES IN GUNTUR GOVERNMENT HOSPITAL MORTUARY DUE TO CORONA VIRUS FEAR AK

గుంటూరులో దారుణం.. మార్చురీలో 40 శవాలు.. కరోనా భయంతో..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

గుంటూరు నగరంలో అనేక స్మశాన వాటికలు ఉన్నప్పటికీ.. స్ధానికుల అభ్యంతరాలతో వాటిలో కరోనా మృతులను ఖననం చేసే వీలు లేకుండా పోయింది.

    గుంటూరు జనరల్ హస్పిటల్ లో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. కరోనాతో చనిపోతే దూరంగా ఉండే పరిస్ధితి నుంచి సోంతవారిమృతదేహలనే.. వదిలేసి వెళ్ళే దుస్ధితులు దాపరించాయి. దీనితో గుంటూరు మార్చురీ మృతదేహలతో నిండిపోయింది. నిత్యం గుంటూరు సమీపప్రాంతాల నుంచి రోజు పెద్ద సంఖ్య ప్రజలు వైద్యం కోసం జిజిహెచ్ వస్తుంటారు. ఇలా వచ్చిన వారిలో కొంతమంది చనిపోతున్నారు. వీరిలో కరోనా నిర్ధారణ తరువాత చనిపోయితే మరికోందరు మృతి చెందిన తరువాత కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవుతోంది. ఈ నేపథ్యంలో మృతదేహాలను మార్చురీలో భద్రపరుచుతున్నారు.

    భద్రపరిచిన తరువాత రోగి వెంట వచ్చిన కుటుంబీకుల బంధువులు మృతదేహలను వదిలేసి సోంత ఊర్లకు వెళ్ళిపోతున్నారు. ఈ క్రమంలో జిజిహెచ్‌ మార్చురీలో పెద్ద సంఖ్యలో మృతదేహాలు పెరుకుపోతున్నాయి. ఇప్పటికే 40 దాకా మృతదేహలు మార్చురీ గదిలో ఉన్నాయి.చనిపోయిన తర్వాత అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సహజ మరణాన్ని కూడా కరోనా పాజిటివ్ డెత్‌గా అనుమానిస్తున్నారు. ఇందులో 30 పైగా మృతదేహలు కరోనా పాజిటివ్‌తో చనిపోయినట్లు వైద్య సిబ్బంది భావిస్తున్నారు. ఇప్పుడు ఈ మృతదేహల అంత్యక్రియలు చేయాలంటే పిపి కిట్లు పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కార్పొరేషన్‌లో కరోనా పాజిటివ్‌తో మృతిచెందిన వారిలో రోజుకు నాలుగు మృతదేహాలకు అంత్యక్రియలు చేసేందుకు అవకాశం ఉంది.

    Corona virus, covid 19 dead bodies, Guntur government hospital, Guntur mortuary, ap news, కరోనా వైరస్, కోవిడ్ 19 మృతదేహాలు, గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి, గుంటూరు మార్చురీ, ఏపీ న్యూస్
    కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు (ప్రతీకాత్మక చిత్రం)


    నగరంలో అనేక స్మశాన వాటికలు ఉన్నప్పటికీ.. స్ధానికుల అభ్యంతరాలతో వాటిలో కరోనా మృతులను ఖననం చేసే వీలు లేకుండా పోయింది. దీనితో మృతదేహల అంత్యక్రియలు కార్పొరేషన్ అద్వర్యంలోనే జరగాల్సి ఉంది. రోజుకు నాలుగు మృతదేహలకే అంత్యక్రియలు అవకాశం ఉండటం మృతులను తీసుకెళ్ళెందుకు బంధువులు రాకపోవడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని ఆసుపత్రి వర్గాలు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి... ఏం చేయాలనే దానిపై సమాలోచనలు చేస్తున్నాయి.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Andhra Pradesh, Coronavirus, Guntur

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు