Weather Update: ఏపీ, తెలంగాణకు వర్ష సూచన.. వచ్చే మూడు రోజుల్లో..

ప్రతీకాత్మక చిత్రం

Weather Update: ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు దాని పరిసర ప్రాంతాలలో 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీనపడింది.

  • Share this:
    రాబోయే మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో పలు చోట్లు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు దాని పరిసర ప్రాంతాలలో 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీనపడింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. నేడు మెదక్, సిద్దిపేట, రాజన్నసిరిసిల్ల, కామారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, జనగామ, యాదాద్రి భువనగిరి, వికారాబాద్ జిల్లాలలో ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇక ఏపీలోనూ అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది మరియు భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వివరించింది. ఎల్లుండి దక్షిణకోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాయలసీమలోనూ పటు చోట్ల ఓ మోస్తరు జల్లులు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.




    Published by:Kishore Akkaladevi
    First published: