Home /News /andhra-pradesh /

MORE GIRL NOT SHARE THESE SECRETES TO HER LIFE PARTNER THESE ARE THE TOP 5 SECRETES NGS

Girls Secrets: అబ్బాయిలూ ఈ విషయం తెలుసా..? అమ్మాయిలు ఈ సీక్రెట్స్ ఎవర్రితో షేర్ చేసుకోరంట..? అవేంటంటే?

అమ్మాయిలు ఈ సీక్రెట్స్ ఎవ్వరికీ షేర్ చేయరు..

అమ్మాయిలు ఈ సీక్రెట్స్ ఎవ్వరికీ షేర్ చేయరు..

Girls Secrates: సాధారణంగా అమ్మాయి నోట్లో ఆవగింజ కూడా దాగదు అనే సామెత ఉంది. ఏదైనా ఒక సీక్రెట్ ఒక మహిళకు తెలిసింది.. అంటే అది కొన్ని క్షాణాల్లో చుట్టు పక్కల వాళ్లకు తెలిసిపోతుందని అంటుంటారు.. కానీ అసలు నిజం ఏంటంటే.. అమ్మాయిలు సీక్రెట్ అనుకుంటే.. అది ఎవరితోనూ షేర్ చేసుకోరు.. ముఖ్యంగా ఈ ఐదు సీక్రెట్ ను ఎవరి దగ్గర రివీల్ చేయరంట.

ఇంకా చదవండి ...
  Girls Secrets: రహస్యం ఒక మహిళకు తెలిస్తే అస్సలు దాగదని అంతా అంటూ ఉంటారు. అంతేకాదు అమ్మాయి నోట్లో ఆవగింజ కూడా నిలవదు లాంటి సామెతలు కూడా ఉన్నాయి. అయితే ఇతరుల సీక్రెట్ సంగతులు ఎలా ఉన్నా.. అమ్మాయిలకు పర్సనల్ గా సీక్రెట్ ఉంటే మాత్రం.. అవి ఎప్పిటికీ ఎవరికీ రివీల్ చేయరంట.. అయితే అమ్మాయిలు తమతో ప్రతీది పంచుకుంటారని అబ్బాయిలు అనుకుంటుంటారు. కానీ వాళ్లు కూడా కొన్ని సీక్రెట్స్ తమలోనే దాచుకుంటారంట. అయితే ఆ విషయంలో వారు అబద్ధం చెబుతారని కాదు.. వారికి సంబంధించిన కొన్ని అతి ముఖ్యమైన విషయాలు సీక్రెట్ గానే ఉంచుతారు.. అలా ఉంచితేనే.. అబ్బాయికి.. అమ్మాయికీ మంచిదని వారు భావిస్తారు. అది ప్రేమికులు కావొచ్చు.. సహజీవనం కావొచ్చు.. బార్యా భర్తల బంధం కావొచ్చు.. ఏదైనా ఆ సీక్రెట్లు మాత్రం తన భాగస్వామితో పంచుకోకపోవడమే మంచిందని అమ్మాయిలు భావిస్తారు. అందుకే అలాంటి విషయాలను తమలోనే ఉంచుకుంటారు. ఈ అంశంపై ప్రపంచవ్యాప్తంగా పలు సర్వేలు నిర్వహించారు. ఇందులో మహిళలు తమ భాగస్వాములు, బాయ్ ఫ్రెండ్స్ నుంచి ఏవి దాచాలనుకుంటున్నారో అడిగి తెలుసుకున్నారు. వారు ఏం చెప్పారో తెలుసా..?

  సాధారణంగా మహిళలు ఒక గ్రూపుగా ఏర్పడి.. చాటింగ్ లేదా సమాచారాన్ని పంచుకుంటారు. కలిస్తే చాలా కబుర్లే చెప్పుకుంటారు. అయితే వారి మధ్య ఏఏ సంభాషణలు జరిగియో మాత్రం వాటిని ఏ అమ్మాయి కూడా తమ భాగస్వామి లేదా బాయ్ ఫ్రెండ్‌తో పంచుకోదు. ఆ చాట్ కేవలం అమ్మాయిలకు మాత్రం పరిమతం అయ్యేలా చూసుకుంటారంట.. కావాలంటే మీ భార్య లేదా గర్ల్ ఫ్రెండ్ తన స్నేహితులతో కలిసి బయటికి వెళ్తే.. తిరిగి వచ్చాక మీరు రోజంతా ఏం చేశారని అడిగితే ఆ టాపిక్ ను డైవర్ట్ చేసేందుకు ప్రయత్నిస్తారని అధ్యయనం చేసినవారు చెబుతున్నారు.

  ఇది చదవండి: తెలంగాణ సీఎంను చూసి నేర్చుకోండి.. వారి చదువులు ఆపడం మంచిది కాదంటూ జగన్ కు లోకేష్ లేఖ

  అలాగే అమ్మాయిలు తాము ప్రేమించిన వ్యక్తి ఎవరైనా నిజాయితీగా ఉండాలని అనుకుంటుంది. కానీ వారు వేరొకరిపై క్రష్ ఉంటే.. అది మిమ్మల్ని మోసం చేయడం ఏమాత్రం కాదు. అబ్బాయికి ఎలా హీరోయిన్‌పై క్రష్ ఉంటుందో.. ఓ అమ్మాయికి హీరోపై క్రష్ ఉండటం కూడా కామన్. ఈ విషయాన్ని చాలామంది అమ్మాయిలు తమ భాగస్వాములకు చెప్పకుండా ఉండేందుకే ఇష్ట పడతారంట.

  ఇది చదవండి: బ్రదర్ రాజకీయ అవతారం ఎప్పుడు..? స్వీట్ వార్నింగ్ ఇస్తున్న క్రిస్టియన్ జేఏసీ

  ఇక అమ్మాయిలు ఎవ్వరైనా కూడా తమ ఫ్రెండ్స్ లిస్టును భాగస్వాములకు బహిర్గతం చెయ్యరు. ఒకవేళ తను అబ్బాయితో మాట్లాడుతోందని చెబితే.. ఆమె బాయ్ ఫ్రెండ్ లేదా భర్త తన ఫిమేల్ ఫ్రెండ్‌తో మాట్లాడటం మొదలు పెడతాడు. అప్పుడు ఇద్దరి మధ్య ఇన్‌ సెక్యూరిటీ మొదలవుతుంది. అందుకే ఆ సీక్రెట్ ను కూడా రివీల్ చేయరంట.

  ఇది చదవండి: వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే జరిగేది అదే.. జేఎస్టీ కట్టాల్సి వస్తోంది అంటూ చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

  కొన్నిసార్లు ఏ అమ్మాయిలకు కూడా కొన్ని సందర్భాల్లో తన మాజీ ప్రేమికుడు గుర్తొస్తాడు. ఇలా జరగకూడదని వాళ్లకు తెలుసు. కానీ గతాన్ని మర్చిపోవడం అంత ఈజీ కాదు. కానీ అమ్మాయిలు తన మాజీ ప్రేమికుడిని గుర్తు చేసుకున్నట్లయితే.. ఈ విషయాన్ని తమ భాగస్వామికి అస్సలు చెప్పరంట.. చెబితే కాపురం కూలుతుందని భయపడతారు. ఎక్కువమంది సర్వేలో ఇదే విషయాన్ని చెప్పారు. అలాగే లైంగిక సంబంధ అంశాలు కూడా భాగస్వామితో షేర్ చేసుకోవడానికి చాలామంది అమ్మాయిలు ఇష్టపడరని అధ్యయనంలో తేలింది.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Health Tips, Life Style

  తదుపరి వార్తలు