తొలకరి పలికింది.. భూతల్లి మురిసింది.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణను తొలకరి పలకరించింది. మృగశిర కార్తె ప్రారంభమై రెండు రోజులు కూడా కాకముందే వానల జల్లు కురిసింది. భూతల్లికి స్వాంతన చేకూరింది.

  • Share this:
    తెలంగాణను తొలకరి పలకరించింది. మృగశిర కార్తె ప్రారంభమై రెండు రోజులు కూడా కాకముందే వానల జల్లు కురిసింది. భూతల్లికి స్వాంతన చేకూరింది. తెలుగు రాష్ట్రాలు భారీ వర్షాలతో తడిసి ముద్దయ్యాయి. తెలంగాణ విషయానికి వస్తే.. హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. గాలి దుమారం, ఉరుములు, మెరుపులతో వానలు పడ్డాయి. హైదరాబాద్‌లో భారీ వర్షం కురవడంతో పలు చోట్ల రోడ్లపైకి నీరు చేరింది. అటు.. రైతన్నల మోములో ఆనందం వెల్లివిరిసింది. పలు ప్రాంతాల్లో దుక్కులు దున్నగా, మరికొన్న చోట్ల వితన్నాలు చల్లారు. ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి, నిర్మల్‌, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షం పడింది. వాగులు, చెరువులు, కుంటలు నిండుగా కనిపించాయి.

    ఏపీ విషయానికి వస్తే తూర్పు మధ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఇది పశ్చిమ వాయవ్యంగా పయనించి బలపడనున్నది. అల్పపీడనం, నైరుతి ప్రభావంతో ఏపీవ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో బుధవారం భారీ వర్షాలు కురిశాయి. గురు, శుక్రవారాల్లోనూ కోస్తాంధ్ర, రాయలసీమల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని విశాఖ తుఫాన్‌ హెచ్చరిక కేంద్రం తెలిపింది.
    Published by:Shravan Kumar Bommakanti
    First published: