MONSOON ALERT TO ANDHRA PRADESH AND TELANGANA NEXT THREE DAYS HEAVY RAINS NGS
Rain Alert: అండమాన్ ను తాకిన నైరుతి రుతుపవనాలు.. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు? ఎక్కడంటే?
ప్రతీకాత్మకచిత్రం
Rain Alert: తెలుగు రాష్ట్రాలను మరోసారి భారీ వర్షాలు ముంచెత్తనున్నాయా..? నైరుతి రుతుపవనాలు ఊహించిన దారినకంటే ముందుగానే తెలుగు రాష్ట్రాలను తాకుతున్నాయా..? తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ భారీ వర్షాలు పడతాయి..? ఏఏ జిల్లాలో అత్యంత ప్రభావం ఉంటుంది అంటే..?
Rain Alert: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) , తెలంగాణా (Telangana) లను వరుణుడు వదల బొమ్మాలి అంటున్నాడు.. మొన్నటి వరకు అసని తుఫాన్ (Asani Cyclone) ఎఫెక్ట్ ప్రభావం ఏపీపై భారీగానే పడింది. గత కొన్ని రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు భారీగా నష్టాన్ని మిగిల్చాయి. ముఖ్యంగా మామిడి పంటపై ఎఫెక్ట్ పడింది. అదే సమయంలో కూరగాయల ధరలు (Vegetables) కూడా భారీగా పెరిగాయి. ఇలాంటి సమయంలో మరోసారి భారీ వర్షాల హెచ్చరికలు భయపెడుతున్నాయి. తాజాగా వాతావరణ శాఖ మరో కీలక ప్రకటన చేసింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో మరో మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా వచ్చే 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు దక్షిణ బంగాళాఖాతం (Bay of Bengal), మొత్తం అండమాన్ సముద్రం, అండమాన్ దీవులకు, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరిస్తాయని హెచ్చరించింది. ఈ క్రమంలో చత్తీస్ గఢ్, విదర్భ మీదుగా బీహార్ నుంచి దక్షిణ తమిళనాడు (Tamilnadu) వరకు ఉన్న ఉత్తర, దక్షిణ ద్రోణి ఈరోజు ఈశాన్య మధ్యప్రదేశ్ నుంచి ఉత్తర తమిళనాడు వరకు విదర్భ మధ్య కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఉంది. తీరప్రాంతాల్లో ఉపరితల ద్రోణి సగటు సముద్ర మట్టానికి 1 .5కిలోమీటర్ల నుంచి 3.1 కిలోమీటర్లు ఎత్తులో విస్తరించి ఉంది. దీంతో రేపటి నుంచి మూడు రోజల పాటు ఏపీ వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి.
ఏపీలో ఉత్తర, దక్షిణ కోస్తాల్లో. రేపు ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. అలాగే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈ ప్రభావం ఇప్పటికే కోస్తా జిల్లాల్లో అక్కడక్కడా కనిపిస్తోంది. వేసవి వడగాల్పులు తగ్గి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడుతున్నాయి. అయితే రేపు, ఎల్లుండి మాత్రం ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
ఇక రాయలసీమ విషయానికి వస్తే.. రేపటి నుంచి మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. కొన్ని ప్రాంతాల్లోఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉందని.. అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు. అయితే ఇప్పటికే అసాని ఎఫెక్ట్ ఏపీపై పడింది. అసని తుఫాను రెండు రోజులుగా కల్లోలం సృష్టించింది. అసని అలజడితో తీర ప్రాంతాలు చిగురుటాకులా వణికిపోయాయి. కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలపై తుపాన్ పడగ విప్పి.. భారీ నష్టాన్ని మిగిల్చింది. పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలు, బలమైన గాలులకు భారీ వృక్షాలు నేలకూలాయి. వందలాది ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. తుపాన్ కారణంగా తీరప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. మరి ఇప్పుడు తాజా హెచ్చరికలు ఎలా ఉంటాయో చూడాలి..
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.