చిత్తూరులో దారుణం... అప్పు తీర్చలేదని అంత్యక్రియలు ఆపేశారు

Chittoor : టెక్నాలజీతో దూసుకుపోతున్నామని మనం అనుకుంటున్నాం గానీ... కొన్ని కొన్ని ఘటనలు మనల్ని మళ్లీ రాతియుగానికి తీసుకుపోతున్నాయి. చిత్తూరులో జరిగిన అలాంటి ఘటన అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.

Krishna Kumar N | news18-telugu
Updated: September 20, 2019, 10:08 AM IST
చిత్తూరులో దారుణం... అప్పు తీర్చలేదని అంత్యక్రియలు ఆపేశారు
Video : చిత్తూరులో దారుణం... అప్పు తీర్చలేదని అంత్యక్రియలు ఆపేశారు
  • Share this:
Andhra Pradesh : చిత్తూరు జిల్లాలో సాంఘిక దురాచారం వెలుగుచూసింది. పుంగనూరులో చనిపోయిన ఓ వ్యక్తి... "బాకీ తీర్చలేదు" అంటూ అతని మృతదేహానికి రెండు రోజులుగా అంత్యక్రియలు జరగకుండా అడ్డుకుంటున్నారు అప్పుల వాళ్ళు. మృతుని భార్య పిల్లలు ఎంత ప్రాధేయ పడ్డా కనికరం చూపట్లేదు. పైగా చనిపోయిన బాధితుణ్ని వెలివేస్తున్నట్టుగా చింతచెట్టుకి చెప్పును వేలాడదీసి దానిపైన మృతుని పేరు రాసి ఆటవిక న్యాయాన్ని అమలు చేశారు. ఈ రోజుల్లో ఆఫ్రికా దేశాల్లో కూడా ఇలాంటి దారుణాలు ఉండట్లేదు. మన తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటివి జరుగుతుండటం ఎంతో విచారకరమైన అంశం.
చంద్రమండలంపై కాలనీలు నిర్మించేందుకు సిద్ధమవుతున్న ఈ కాలంలోనూ... సాంఘిక దురాచారాలు మాత్రం వదలట్లేదు.

పుంగనూరులోని మోండోలు సామాజిక వర్గానికి చెందిన శివకుమార్... అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల దగ్గర అప్పుచేశాడు. దీనికి అతని భార్య తండ్రి వెంకటరమణ హామీ ఇచ్చాడని అప్పుల వాళ్లు చెబుతున్నారు. అయితే అనారోగ్యంతో వెంకటరమణ రెండురోజుల కిందట చనిపోయాడు. ఐతే అతని అల్లుడు శివకుమార్ తమ దగ్గర తీసుకున్న లక్షల రూపాయల అప్పు తీర్చకుండా శవానికి అంత్యక్రియలు జరిపితే కుదరదన్నారు అప్పులవాళ్ళు. తమ కుల సంప్రదాయం ప్రకారం ఒక చెప్పుకు మృతుని పేరు రాసి దాన్ని చింతచెట్టుకు వేలాడదీశారు. వెంకటరమణను కడసారి చూసేందుకు వెళ్ళే బంధువులను అడ్డుకునేందుకు యత్నించారు.


ఈ దారుణంపై బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం తెలిసిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అప్పులవాళ్ళకు, కులపెద్దలకు... సర్దిచెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదంతా చూస్తున్న స్థానికులు... ఆశ్చర్యపోతున్నారు.

First published: September 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>