Home /News /andhra-pradesh /

MOHAN BABU RAISE LOKESH DEFEAT IN MANGALAGIRI RAISED NEW DISCUSSION IN TDP AK

Mohan Babu: మోహన్ బాబు ఆ విషయం ఎందుకు లేవనెత్తారు ?.. టీడీపీ వర్గాల్లో మొదలైన చర్చ

మోహన్ బాబు (ఫైల్ ఫోటో)

మోహన్ బాబు (ఫైల్ ఫోటో)

Mohan Babu: చంద్రబాబు తనయుడు లోకేశ్‌ ఓటమికి మోహన్ బాబు ప్రధాన కారణం కాకపోయినా.. ఏపీలో ఎక్కడా పెద్దగా ప్రచారం చేయని మోహన్ బాబు.. మంగళగిరిలో మాత్రం ప్రచారం నిర్వహించి టీడీపీని, లోకేశ్‌ను టార్గెట్ చేశారు.

    మా ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపించాయి. ఎన్నికలు ముగిసినా.. అక్కడి గొడవలు మాత్రం ఇంకా సద్దుమణగలేదు. మా ఎన్నికల్లో గెలిచిన మంచు విష్ణు, తన తండ్రి మోహన్ బాబుతో కలిసి తనకు మద్దతు ఇచ్చిన సినీ ప్రముఖలను కలుస్తున్నారు. ఈ క్రమంలోనే తనకు సపోర్ట్ చేసిన నందమూరి బాలకృష్(Nandamuri Balakrishna)ను కలిశారు. తమకు సపోర్ట్ చేసిన వారిని ఆ తరువాత కలిసి కృతజ్ఞతలు తెలపడం కొత్తేమీ కాదు. అయితే బాలకృష్ణను కలిసిన తరువాత మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. తాను మంగళగిరి(Mangalagiri)లో బాలకృష్ణ అల్లుడు, చంద్రబాబు కుమారుడు లోకేశ్(Nara Lokesh) ఓటమి కోసం ప్రచారం చేశానని.. అయినా తన కుమారుడు మంచు విష్ణును బాలకృష్ణ గెలిపించారని మోహన్ బాబు వ్యాఖ్యానించారు. బాలకృష్ణ గొప్ప వ్యక్తి అని.. మనసులో ఏమీ పెట్టుకోరని చెప్పడానికే మోహన్ బాబు ఈ రకమైన వ్యాఖ్యలు చేసి ఉంటారని కొందరంటుంటే.. మోహన్ బాబు తన వ్యాఖ్యలతో లేని కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.

    చంద్రబాబు తనయుడు లోకేశ్‌ ఓటమికి మోహన్ బాబు ప్రధాన కారణం కాకపోయినా.. ఏపీలో ఎక్కడా పెద్దగా ప్రచారం చేయని మోహన్ బాబు.. మంగళగిరిలో మాత్రం ప్రచారం నిర్వహించి టీడీపీని, లోకేశ్‌ను టార్గెట్ చేశారు. ఆ విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. టీడీపీ శ్రేణులు కూడా ఈ విషయాన్ని మర్చిపోయారు. కానీ మోహన్ బాబు ఈ విషయాన్ని గుర్తు చేసి కొత్త చర్చకు తెరలేపారనే ఊహాగానాలు మొదలయ్యాయి. వైసీపీకి అనుకూలంగా.. అందులోనూ లోకేశ్ ఓటమి కోసం పని చేసిన వ్యక్తి కుమారుడి గెలుపు కోసం బాలకృష్ణ మద్దతు ఇవ్వడం ఏంటనే ప్రశ్నలు నేడు కాకపోయినా.. రేపైనా టీడీపీ శ్రేణుల నుంచి రాకుండా ఉంటాయా ? అనే చర్చ జరుగుతోంది.

    అసలు మోహన్ బాబు బాలకృష్ణకు కృతజ్ఞతలు తెలిపేందుకు వచ్చారా ? లేక టీడీపీలో కొత్త చర్చకు తెరలేపడానికి వచ్చారా ? అనే చర్చ కూడా మొదలైంది. నిజానికి వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌ సారథ్యంలోని జనసేన మద్దతు తీసుకుని.. తద్వారా కాపు సామాజికవర్గం మద్దతు పొందాలని టీడీపీ యోచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

    Maa Elections 2021: మా ఎన్నికల ఎఫెక్ట్.. ఆ నినాదం ప్రభావం తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై ఉంటుందా ?

    YS Jagan: జగన్‌ను టెన్షన్ పెడుతున్న వైఎస్ఆర్ సన్నిహితుడు.. వైసీపీలో టెన్షన్

    ఈ క్రమంలోనే మెగా ఫ్యామిలీ మద్దతు ఇచ్చిన ప్రకాశ్ రాజ్ ప్యానల్‌ను ఓడించేందుకు బరిలోకి దిగిన మంచు విష్ణుకు బాలకృష్ణ మద్దతు ఇవ్వడంపై కూడా చర్చ జరుగుతోంది. అయితే సినిమాలు వేరు, రాజకీయాలు వేరు అని చర్చకు కూడా ఇక్కడ వినిపిస్తోంది. ఏదేమైనా.. అంతా మర్చిపోయిన విషయాన్ని మళ్లీ గుర్తు చేయడం వెనుక మోహన్ బాబు ఆంతర్యం ఏమిటనే కొత్త చర్చ మాత్రం మొదలైంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Mohan Babu, Nandamuri balakrishna, Nara Lokesh

    తదుపరి వార్తలు