తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో సోమ, మంగళవారాల్లో అక్కడక్కడ వడగండ్లతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇటు.. తెలంగాణలో, అటు.. రాయలసీమలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని వివరించింది. అయితే, కొన్ని చోట్ల గరిష్ఠ ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల నుంచి 43 డిగ్రీల మేర నమోదు కావొచ్చని తెలిపింది. అండమాన్ తీర ప్రాంతాల్లో ఈ నెల 13న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. కాగా, విదర్భ నుంచి మరట్వాడ, కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AP News, Rains, Telangana News, WEATHER