ఏపీకి వానొచ్చే.. నేటి నుంచి రాష్ట్రంలో వర్షాలు..

బంగాళాఖాతంలో ఉపరితల వాయువు ఏర్పడి బలపడే అవకాశాలున్నాయని.. దాని ప్రభావంతో ఉత్తరాంధ్రలో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయని వాతావరణ అధికారులు వెల్లడించారు.

news18-telugu
Updated: June 18, 2019, 7:02 AM IST
ఏపీకి వానొచ్చే.. నేటి నుంచి రాష్ట్రంలో వర్షాలు..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: June 18, 2019, 7:02 AM IST
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇదో చల్లని కబురు. నిన్న మొన్నటిదాకా ఎండల తీవ్రతకు బెంబేలెత్తిపోయిన జనాలకు కాస్త ఉపశమనం లభించనుంది. ఈ నెల 18 నుంచి రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. 18వ తేదీన రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని.. ఆపై రెండు మూడు రోజుల్లో రాష్ట్రమంతటా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నిజానికి ఈపాటికే వర్షాలు కురవాల్సి ఉన్నా.. కేరళ తీరాన్ని రుతుపవనాలు ఆలస్యంగా తాకడంతో రాష్ట్రానికి కూడా రుతుపవనాల రాక ఆలస్యమైంది.

బంగాళాఖాతంలో ఉపరితల వాయువు ఏర్పడి బలపడే అవకాశాలున్నాయని.. దాని ప్రభావంతో ఉత్తరాంధ్రలో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయని వాతావరణ అధికారులు వెల్లడించారు. వర్షాల రాక ఆలస్యం కావడంతో కాస్త ఢీలా పడ్డ రైతులు ఇప్పటికైనా వరుణుడు కరుణించాలని, విస్తారంగా వర్షాలు కురవాలని కోరుకుంటున్నారు.

First published: June 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...