Weather News | ఏపీలో ఈదురు గాలులతో వర్షాలు..

ఆంధ్రప్రదేశ్‌లో ఈదురు గాలులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

news18-telugu
Updated: April 8, 2020, 10:58 AM IST
Weather News | ఏపీలో ఈదురు గాలులతో వర్షాలు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో ఈదురు గాలులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మధ్యప్రదేశ్ దక్షిణ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని.. విదర్భ వరకు 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని వెల్లడించింది. విదర్భ నుంచి తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి ఉందని, కర్ణాటక మీదుగా 1.5 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతోందని వివరించింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడా ఈదురు గాలులతో వర్షం పడే అవకాశం ఉందని పేర్కొంది. అటు.. ఉత్తర కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. చిత్తూరు, కడప జిల్లాల్లోనూ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

First published: April 8, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading