హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Andhra Prdesh: సిగ్నల్ పాయింట్ కోసం ఆదివాసుల అవస్థలు.. ప్రభుత్వ పథకాల కోసం తప్పని అగచాట్లు

Andhra Prdesh: సిగ్నల్ పాయింట్ కోసం ఆదివాసుల అవస్థలు.. ప్రభుత్వ పథకాల కోసం తప్పని అగచాట్లు

సెల్ సిగ్నల్ కోసం ఆదివాసీల అవస్థలు

సెల్ సిగ్నల్ కోసం ఆదివాసీల అవస్థలు

విశాఖ జిల్లాలో ఆదివాసీల కష్టాలు అన్నీ ఇన్నీ కావు.. ప్రభుత్వ పథకం అందుకోవాలి అంటే నరకం చూస్తున్నారు. పథకాలు అన్నీ ఆన్ లైన్ లో ఉంటున్నాయి. అన్నింటీకీ ఓటీపీలు, ఇంటర్నెట్ ల అవసరం తప్పని సరి అయ్యింది. కానీ ఏజెన్సీ ప్రాంతాల్లో సిగ్నల్ సమస్యలతో జడి వానలో కొన్ని కిలోమీటర్ల మేర నడవాల్సిన దుస్థితి నెలకొంది.

ఇంకా చదవండి ...

  ఆదివాసుల అవస్థలు అన్ని ఇన్నీ కావు. ఏపీలో ఏ పథకం అందాలన్నా ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాల్సిందే.. కానీ ఆదివాసులు సెల్ సిగ్నల్ లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా వైఎస్ఆర్ బీమా పథకం కోసం జోరు వానలో పది, పదిహేను కిలోమీటర్ల దూరం నడవాల్సిన పరిస్థితి నలకొంది. ఏ పథకం బీమా అయిన online ద్వారా దరఖాస్తు చేసుకోవాలంటే 5 నుంచి 10 కిలోమీటర్లు నడవాల్సి వస్తోంది. విశాఖ జిల్లాలోనిపెదబయలు మండలము కిముడుపల్లి పంచాయతి పరిధిలో గల 23 గ్రామాల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. ప్రభుత్వ పథకాలు పొందాలంటే సిగ్నల్స్ కోసం 5 కీలో మీటర్లు నడిచి కొండ మీద కు రావాల్సి వస్తోంది. ఈ పంచాయతీలో అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ కీ ఫోన్ చెయ్యాలన్న, వాలంటీర్లు ప్రభుత్వ పథకాల కు సంతకాలు తీసుకోవాలన్నా నిత్యం ఇలాంటి పరిస్థితులే ఎదురవుతున్నాయి. మరోవైపు నిత్య ఇక్కడ వానలు కురుస్తుండడంతో ఆ జోరు వానలోనే గిరిజనులు తడుస్తూ నిల్చొని పనిచేయాల్సి వస్తోంది. ఇప్పుడు పథకాల కోసం వానలో తడిసి నడవాల్సిన పరిస్థితి నెలకొంది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి i.t.d.a ఉన్నతాధికారులు స్పందించి గిరిజనుల అభివృద్ధి ,సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే ఈ ప్రాంతంలో సెల్ టవర్ ఏర్పాటు చెయ్యాలని, ఏబీవీపీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యుడు అంగనైని ఆనంద్, స్ధానిక సర్పంచ్, ఇతరులు కోరుతున్నారు.

  సెల్ సిగ్నల్ లేని ఆదివాసి గ్రామాలకు మాన్యువల్ పద్ధతిలో వైయస్సార్ బీమా అందేలా చేయాలి డిమాండ్ చేస్తున్నారు. అలాగే వైయస్సార్ బీమా ఆన్ లైన్ తేదీ గడువు పెంచాలని వారు కోరుతున్నారు. వర్షాలకు తోడు సెల్ సిగ్నల్ లేకపోవడంతో.. కాలి నడకన 10 ,15 కిలోమీటర్ల దూరం చంటి పిల్లలతో, పెద్దలు సహా నడవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీమాకు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాడానికి చివరి తేదీ కావడంతో ఈ అవస్థలు తప్పడం లేదు.

  మరోవైపు ఆధార్ నమోదు చేసుకోవాలి అంటే సుమారు 60 కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి నెలకొంది చాలా చోట్ల. చింతపల్లి మండలంలోని దుప్పిలవాడ పంచాయతీకి చెందిన గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గూడెం కొత్తవీధి మండలం దుప్పిలవాడ పంచాయతీ కొమ్ములవాడ గ్రామస్థులు తమ ఆధార్, ఫోన్ నంబర్ అనుసంధానం కోసం చింతపల్లి రావాల్సి వచ్చింది. 60 కిలోమీటర్ల దూరం వచ్చిన పని పూర్తవ్వకపోవడంతో రోజంతా తమ పనులు మానుకుని అక్కడే ఉండాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకు కర్ఫ్యూ అమల్లో ఉండడంతో ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డామంటున్నారు.

  దాదాపు ఏజెన్సీల్లో అన్ని ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. పథకాలు కావాలన్నా.. ఆధార్ కార్డును అనుసంధానం చేయాలన్న.. కొత్తగా ఆధార్ కార్డు తీసుకోవాలన్నా.. ఆఖరి రేషన్ పొందాలన్నా సిగ్నల్స్ లేక తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అన్నిటికన్నా ముఖ్యంగా సరైన రోడ్డు సౌకర్యాలు లేక.. వైద్య అవసరాల కోసం డోలీల్లో రోగులను తీసుకోవాల్సిన పరిస్థితులు తప్పడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనపై ఫోకస్ చేయాలని అంటున్నారు..

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Ap welfare schemes, Visakha, Visakhapatnam

  ఉత్తమ కథలు