హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

MLAs Poaching Case: ఏపీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కూడా బీజేపీ కుట్ర.. కేసీఆర్‌ వ్యాఖ్యలపై జగన్ స్పందిస్తారా?

MLAs Poaching Case: ఏపీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కూడా బీజేపీ కుట్ర.. కేసీఆర్‌ వ్యాఖ్యలపై జగన్ స్పందిస్తారా?

వైఎస్ జగన్, కేసీఆర్

వైఎస్ జగన్, కేసీఆర్

CM KCR: సీఎం కేసీఆర్ వ్యాఖ్యలతో పాటు ఆయన విడుదల చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు స్పందిస్తారా? లేదంటే లైట్ తీసుకుంటారా? అన్న దానిపై ఆసక్తి  నెలకొంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

మునుగోడు(Munugode)లో పోలింగ్ ముగియగానే.. తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) నిర్వహించిన ప్రెస్ మీట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.  ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారాని (MLAs Poaching Case)కి సంబంధించి పలు వీడియోలను ఆయన మీడియా ముందు ప్రదర్శించారు. భారత ప్రజాస్వామ్యంపై బీజేపీ (BJP) హత్యాకాండ చేస్తోందని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి.. ప్రభుత్వాలను పడగొట్టేందుకు.. కుట్రలు చేస్తోందని విరుచుకుపడ్డారు. బీజేపీని ఇలాగే వదిలేస్తే.. భారత సమాజం ఉనికే ప్రశ్నార్థకమవుతుందని మండిపడ్డారు సీఎం కేసీఆర్. తెలంగాణతో పాటు ఏపీ, ఢిల్లీ, రాజస్థాన్ ప్రభుత్వాలను కూడా బీజేపీ టార్గెట్ చేసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్ తెలంగాణతో పాటు ఏపీలో కూడా చర్చనీయాంశంగా మారాయి.

'' ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి చేసిన కుట్ర వీడియోలో రికార్డయింది.ఈ కాపీలను దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సుప్రీంకోర్టుతో పాటు అన్ని రాష్ట్రాల సీఎంలు, హైకోర్టులు, పార్టీల అధ్యక్షులు, మీడియా సంస్థలకు పంపించాం. చేతులు జోడించి వేడుకుంటున్నా. ఎప్పుడు ప్రమాదంలో పడినా న్యాయవ్యవస్థ మాత్రమే ఈ దేశాన్ని కాపాడింది. దేశంలో ఇప్పటి వరకు 8 రాష్ట్రాల ప్రభుత్వాలను కూలగొట్టామని చెబుతున్నారు. కర్నాటక, మహారాష్ట్రలో ప్రభుత్వాలను కూలగొట్టింది తామేనని ఎలాంటి భయం లేకుండా వారు చెబుతున్నారు. ఆ తరువాత తెలంగాణ , ఆంధ్ర, దిల్లీ, రాజస్థాన్ ప్రభుత్వాలను కూలగొడతామని అంటున్నారు. ఈడీని చూపించి బెదిరిస్తున్నారు.'' అని కేసీఆర్ పేర్కొన్నారు.

CM KCR: దేశాన్ని న్యాయవ్యవస్థే కాపాడాలి.. చేతులు జోడించి కోరిన సీఎం కేసీఆర్

కేసీఆర్ విడుదల చేసిన వీడియోలో కూడా ఏపీ గురించి ప్రస్తావన వచ్చింది. ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, సింహయాజి, నందకుమార్ మధ్య దీని గురించి చర్చ జరిగింది.

గువ్వల బాలరాజు: ఏపీలో పరిస్థితి ఎలా ఉంది స్వామి? ఇదే అపరేషన్‌ను అక్కడ మొదలు పెడతారా?

సింహయాజి: ఇది అయిపోతే అక్కడ మొదలు పెడతాం.

నంద కుమార్: ఢిల్లీలో కూడా మొదలయింది. 35 మంది సిద్ధంగా ఉన్నారు.

సింహయాజి: అసలోడ్ని ఒకడ్ని ఈడీనీ పెట్టి ఎత్తేశారుగా. సిసోడియాతోనే ఎమ్మెల్యేలు వస్తున్నారు.

నంద కుమార్: రాజస్థాన్‌లో కూడా 30 మందిని రెడీ చేశారు. వీళ్ల ఆపరేషన్సే అవి.

ఇప్పుడీ సంభాషణ ఏపీలోనూ హాట్ టాపిక్‌గా మారింది. ఈ వీడియోతో పాటు తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన కామెంట్స్‌పై ఏపీ సీఎం జగన్ గానీ, వైసీపీ నేతలు గానీ స్పందిస్తారా? లేదంటే లైట్ తీసుకుంటారా? అన్న దానిపై ఆసక్తి  నెలకొంది. ఏపీ ప్రభుత్వం పలు అంశాల్లో కేంద్రానికి మద్దతు ఇస్తోంది. మోటర్లకు మీటర్ల వ్యవహారంలో కేంద్ర విధానాన్ని ఏపీలో అమలు చేస్తున్నారు. తెలంగాణ మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇదొక్కటే పలు అంశాల్లో ఎన్డీయే ప్రభుత్వానికి వైసీపీ బయటి నుంచి మద్దతు ఇస్తోంది. అలాంటి వైసీపీ.. తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందన్న ఆరోపణలపై ఎలా స్పందిస్తుందో చూడాలి.

First published:

Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Bjp, CM KCR, Telangana

ఉత్తమ కథలు