ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై గ్రామ వాలంటీర్ల ఆగ్రహం...ధర్నా..

ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరుడు అయిన యతేంద్ర రామకృష్ణ అలియాస్ రాము గ్రామ వాలంటీర్లపై దౌర్జన్యం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. దీంతో గ్రామ సచివాలయం ముందే వాలంటీర్లు ధర్నాకు దిగారు.

news18-telugu
Updated: December 9, 2019, 11:02 PM IST
ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై గ్రామ వాలంటీర్ల ఆగ్రహం...ధర్నా..
వల్లభనేని వంశీ మోహన్(File)
  • Share this:
ఉంగుటూరు మండలం తేలప్రోలు గ్రామంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరుడు అయిన యతేంద్ర రామకృష్ణ ( అలియాస్ రాము ) గ్రామ వాలంటీర్లపై దౌర్జన్యం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. దీంతో గ్రామ సచివాలయం ముందే వాలంటీర్లు ధర్నాకు దిగారు. రాము అనే వ్యక్తి సచివాలయంకి వచ్చి ఉద్యోగులపై అసభ్యపదజాలం తో మీ అంతు చూస్తాను అంటూ దూషించాడని, దీంతో భయపడిన వాలంటీర్లు పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేశారు. కాగా వాలంటీర్ల ఫిర్యాదును పోలీసులు పట్టించుకోలేదని, రాము అనే వ్యక్తిని పట్టించుకోలేదని వాలంటీర్లు వాపోతున్నారు. అధికారులు పట్టించుకోక, పోలీసులు పట్టించుకోక, మాకు న్యాయం చేసేది ఎవరు అని వాలంటీర్లు వాపోతున్నారు.

First published: December 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>