మంత్రి పదవిపై ఓపెన్ అయిపోయిన రోజా...సీఎం జగన్‌కు మదిలో మాట చెప్పేసిందిగా...

మల్లెమాల ప్రొడక్షన్స్ న్యూ ఇయర్ కోసం ప్లాన్ చేస్తున్న ఆడవారి పార్టీలకు అర్థాలే వేరులే ప్రోగ్రాం వేదికగా రోజా ఈ వ్యాఖ్యలు చేసింది. పక్కనే ఉన్న హైపర్ ఆది అందుకొని వెంటనే ఎమ్మెల్యే రోజా ప్రభుత్వానికి తన డిమాండ్ ను చెప్పకనే చెప్పేసిందని, ఆమె మదిలో మాట బయటపెట్టేశాడు.

news18-telugu
Updated: December 14, 2019, 8:36 PM IST
మంత్రి పదవిపై ఓపెన్ అయిపోయిన రోజా...సీఎం జగన్‌కు మదిలో మాట చెప్పేసిందిగా...
ఏపీ సీఎం వైఎస్ జగన్, ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్‌పర్సన్ రోజా సెల్వమణి
  • Share this:
ఎమ్మెల్యే రోజా తన మనస్సులో మాట బయటపెట్టేసింది. కొత్త సంవత్సరం రిజల్యూషన్స్ లో భాగంగా తనకు ఇంకా ఏదో రావాలని...కేబినేట్ మంత్రి పదవి కోసం మదిలో ఉన్న కోరికను చెప్పకనే చెప్పేసింది. అయితే ఇది ఎక్కడో కాదు మల్లెమాల ప్రొడక్షన్స్ న్యూ ఇయర్ కోసం ప్లాన్ చేస్తున్న ఆడవారి పార్టీలకు అర్థాలే వేరులే ప్రోగ్రాం వేదికగా రోజా ఈ వ్యాఖ్యలు చేసింది. పక్కనే ఉన్న హైపర్ ఆది అందుకొని వెంటనే ఎమ్మెల్యే రోజా ప్రభుత్వానికి తన డిమాండ్ ను చెప్పకనే చెప్పేసిందని, ఆమె మదిలో మాట బయటపెట్టేశాడు. తాజాగా యూట్యూబ్‌లో విడుదలైన ప్రోమోలో హైపర్ ఆదితో పాటు యాంకర్ వర్షిణి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. మొత్తం ప్రోగ్రాంలో లేడీస్ మాత్రమే ఉండేలా ప్లాన్ చేశారు. ఇందులో అటు రోజాతో పాటు సీనియర్ ఆర్టిస్టులు అన్నపూర్ణమ్మ, వై.విజయ, యాంకర్లు విష్ణు ప్రియ, కరాటే కళ్యాణి ఇలా లేడీస్ అంతా కలిసి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఈ షోలో జర్నలిస్ట్ జాఫర్ కూడా ఎంట్రీ ఇవ్వడం కొసమెరుపు.

ఇదిలా ఉంటే రోజా గత రెండు దఫాలుగా వైసీపీ తరపున ఎమ్మెల్యేగా ఉన్నారు. అంతేకాదు ప్రతపక్షంలో ఉన్నప్పుడు పార్టీ తరపున ఆమె తన పోరాట పటిమతో చాలా కష్టపడి గుర్తింపు తెచ్చుకున్నారు. ఏపీలో జగన్ ప్రభుత్వం ఏర్పడగానే ఎమ్మల్యే రోజాకు మంత్రి పదవి వస్తుందని అంతా భావించారు. అయితే రోజాకు మొదటి కేబినేట్ జాబితాలో మొండి చేయే దక్కింది. అయితే ఏపీఐఐసీ చైర్మన్ పదవితోనే రోజా సంతృప్తి పడాల్సి వచ్చింది. అయితే పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న సీనియర్ నేతగా రోజాకు మంత్రి పదవి దక్కి ఉంటే బాగుండేదని ఆమె సన్నిహిత వర్గాల మాటగా వినిపిస్తోంది.

 

First published: December 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>