Roja on Bheemla Nayak: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ప్రస్తుతం పరిస్థితి భీమ్లా నాయక్ (Bheemla Nayak) వర్సెస్ ఏపీ ప్రభుత్వం (AP Government) అన్నట్టు మారింది. పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పై కక్షతో ప్రభుత్వం భీమ్లా నాయక్ సినిమాను ఇబ్బంది పెడుతోందని.. ఇటు జనసేన (Janasena) నేతలు, కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. విపక్షాలు సైతం అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. అసలు భీమ్లా నాయక్, ఏపీ సర్కార్ మధ్య జరుగుతోన్న ఫైట్ కారణం ఏంటి.. ఎవరి వాదన ఎంత వరకు నిజం. ఈ వివాదానికి ప్రధాన కారణం ఏపీలో సినిమా టికెట్ల రేట్ల వివాదమే.. వకీల్ సాబ్ సినిమా రిలీజ్ సమయంలో ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచి టాలీవుడ్ వర్సెస్ ఏపీ ప్రభుత్వం అన్న మాదిరిగా వ్యవహారం మారింది. రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏపీ ప్రభుత్వం తీరుపై పవన్ కల్యాణ్ సంచలన ఆరోపణలు చేశారు. ఆయనకు తోడు.. శ్యామ్ సింగరాయి సినిమా రిలీజ్ సమయంలో నాని సైతం ఏపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దానికి కౌంటర్ గా మంత్రులు కామెంట్లు.. దానికి సినిమా ఇండస్ట్రీ నుంచి ప్రతి కౌంటర్లతో వివాదం ముదిరింది. సందట్లో సడేమియా అంటూ అదే సమయంలో రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వార్ ఆ వివాదాన్ని మరో లెవెల్ కు తీసుకెళ్లారు.
సినిమా పెద్దగా చిరంజీవి.. ఆ వివాదానికి పుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. ముందు ఒంటరిగా వెళ్లి సీఎం జగన్ ను కలిసిన ఆయన.. సమస్యలపై సీఎంకు వివరించే ప్రయత్నం చేశారు. తరువాత టాలీవుడ్ ప్రముఖులంతా కలిసి సీఎం జగన్ కలకడంతో.. వివాదానికి ఎండ్ కార్డ్ పడింది. ప్రభుత్వం ఫిబ్రవరి నెల ఆకరికి సినిమా రేట్లపై శుభవార్త చెబుతుందని టాలీవుడ్ ప్రముఖులు ఆనందం వ్యక్తం చేశారు. కానీ భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ తో వివాదం మళ్లీ మొదటికి వచ్చినట్టే అయ్యింది. సరిగ్గా సినిమా రిలీజ్ కు ఒక్కరోజు ముందు.. ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.. సినిమా టికెట్లు పెంచిన థియేటర్లపై చర్యలు తప్పవని.. ఇక ఐదో షో రిలీజ్ చేస్తే సీజ్ చేయాల్సి వస్తుందని వార్నింగ్ ఇఛ్చింది. అంతేకాదు ఆంక్షలు కఠినంగా అమలు అయ్యేలా థియేటర్ల దగ్గర నిఘా పెట్టడంతో వివాదం ముదిరింది.
ఇదీ చదవండి : అక్కడ శివునికి పాలాభిషేకం చేస్తే.. మజ్జిగ లభిస్తుందంట..? ఆ ప్రసాదం కోసం భక్తుల క్యూ
అప్పుడు వకీల్‌సాబ్-ఇప్పుడు భీమ్లా నాయక్. ఈ ఘటనలు చాలవా ప్రభుత్వం తీరు ఏంటో అర్థం చేసుకోవడానికి అని మెగా అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఏపీ ప్రభుత్వం టార్గెట్ పవనే అంటున్నారు ఆయన సోదరుడు నాగబాబు సైతం.. పవన్‌పై ప్రభుత్వం పగబట్టింది, కక్షగట్టింది, టార్గెట్ చేసింది అంటూ హాట్ కామెంట్స్ చేశారు. పవన్‌ను అణగదొక్కేందుకే మూవీ టికెట్స్ పెంపుపై కొత్త జీవో ఇవ్వలేదన్నారు నాగబాబు.
ఇదీ చదవండి : భీమ్లానాయక్ పై ఆగని పొలిటికల్ దుమారం.. కేసీఆర్, పవన్ ఫ్లెక్సీలు తొలగింపుపై వివాదం
నాగబాబు చేసిన ఆరోపణలకు వైసీపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. తాజా మెగా ఆరోపణలపై ఎమ్మెల్యే రోజా సెటైర్లు వేశారు. కొత్త జీవో ఇచ్చేవరకు మూవీ రిలీజ్‌ను వాయిదా వేసుకోవచ్చుగా అంటూ సెటైర్లు రోజా.. విపక్షాల ఆరోపణల్లో వాస్తవం లేదంటున్నారు రోజా.. అసలు టికెట్ల రేట్లు తక్కువ ఉంటే పవన్ కు వచ్చిన నష్టం ఏంటని ఆమె ప్రశ్నించారు. పవన్ ఏమైనా ప్రొడ్యూసరా? డిస్ట్రిబ్యూటరా?. పవన్‌ను తొక్కేయాల్సిన అవసరం తమకేంటి అని ప్రశ్నిస్తున్నారు. అల్లు అర్జున్ పుష్ప, బాలకృష్ణ అఖండ సినిమాలకు ఏ రేట్లయితే ఉన్నాయో, ఇప్పుడూ అవే రేట్స్ ఉన్నాయ్. ఇందులో అన్యాయం ఏముందని ప్రశ్నిస్తున్నారు రోజా. రేట్లు పెంచుకోవాలంటే జాయింట్ కలెక్టర్లకు అప్లై చేసుకోవచ్చుకదా? అంటున్నారు రోజా.
ఇదీ చదవండి : జ్యువెలరీ షాపులో భారీ చోరీలో ట్విస్ట్.. 24 గంటల్లోనే చేధించిన పోలీసులు..
అసలు పవన్ కళ్యాణ్ ను తొక్కేయాలని మేమెందుకు చూస్తామని ఆమె ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. టికెట్ ధరల నిర్ణయం ఒక కొలిక్కకి వస్తుందనుకునే సమయంలో మంత్రి గౌతమ్ రెడ్డి మరణించడంతో కాస్త ఆలస్యం అయ్యిందని గుర్తు చేశారు. ఈ లోగా సినిమా రిలీజ్ అయ్యిందని రోజా వివరణ ఇచ్చారు. అలాగే తన సినిమాను అడ్డుపెట్టుకొని తమ పార్టీని నిలబెట్టుకోవాలని పవర్ రాజకీయం చేస్తున్నారని రాజా ఫైర్ అయ్యారు. రోజా కౌంటర్లపై నాగబాబు, పవన్ ఎలా స్పందిస్తారో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.