Home /News /andhra-pradesh /

MLA NANDAMURI BALAKRISHNA STARTS NTR AROGYA RATHAM IN HINDUPUR UMG

బాలయ్యా.. బావ బొమ్మేదయ్యా..! 'ఎన్టీఆర్ ఆరోగ్య రథం'పై కనిపించని చంద్రబాబు ఫొటో.. హిందూపూరంలో గుసగుసలు..!!

ఎన్టీఆర్ ఆరోగ్య రథంపై కనిపించని చంద్రబాబు బొమ్మ

ఎన్టీఆర్ ఆరోగ్య రథంపై కనిపించని చంద్రబాబు బొమ్మ

హిందూపురం (Hindupur) నియోజకవర్గ ప్రజల ఆరోగ్యం కోసం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (MLA Balakrishna) ప్రత్యేకంగా ఎన్టీఆర్ ఆరోగ్య రథం (NTR AROGYA RATHAM) పేరుతో వైద్య సేవలు ప్రారంభించారు. రూ.40 లక్షల సొంత నిధులతో ప్రత్యేక బస్సులో వైద్య పరికరాలు, టెస్టింగ్ ల్యాబ్, మందులు తదితర హంగులతో ఏర్పాటు చేశారు. ఈ ఎన్టీఆర్ ఆరోగ్య రథాన్ని ప్రత్యేకంగా హిందూపురం నియోజవకర్గ ప్రజల కోసమే ఏర్పాటు చేశారు. 

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Anantapur, India
    హిందూపురం (Hindupur) నియోజకవర్గ ప్రజల ఆరోగ్యం కోసం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (MLA Balakrishna) ప్రత్యేకంగా ఎన్టీఆర్ ఆరోగ్య రథం (NTR AROGYA RATHAM) పేరుతో వైద్య సేవలు ప్రారంభించారు. రూ.40 లక్షల సొంత నిధులతో ప్రత్యేక బస్సులో వైద్య పరికరాలు, టెస్టింగ్ ల్యాబ్, మందులు తదితర హంగులతో ఏర్పాటు చేశారు. ఈ ఎన్టీఆర్ ఆరోగ్య రథాన్ని ప్రత్యేకంగా హిందూపురం నియోజవకర్గ ప్రజల కోసమే ఏర్పాటు చేశారు.  అయితే, ఎన్టీఆర్ ఆరోగ్య రథంపై చంద్రబాబు నాయుడు బొమ్మ లేకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

    టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, బాలకృష్ణ అల్లుడు నారా లోకేశ్ నిన్న మంగళగిరిలో సంజీవని ఉచిత ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. నియోజకవర్గంలోని పేద ప్రజలకు ఉచిత వైద్య సౌకర్యం అందించడానికి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీని కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై టీడీపీ వ్యవస్థాపకుడు స్వర్గీయ ఎన్టీఆర్తో పాటు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఫొటో ఉంచారు. అయితే, హిందూపురంలో ఈరోజు బాలకృష్ణ ప్రారంభించిన ఎన్టీఆర్ ఆరోగ్య రథంపై కేవలం ఎన్టీఆర్ ఫొటోతో పాటు బాలకృష్ణ ఫొటో మాత్రమే ఉండటం విశేషం.

     ఇదీ చదవండి: అతి త్వరలోనే జగన్ పెద్ద కుంభకోణం వెలుగులోకి.. పొలిటికల్ బాంబ్ పేల్చిన లోకేశ్


    ఎన్టీఆర్ ఆరోగ్య రథం ప్రత్యేకతలు ఇవే..
    ఎన్టీఆర్ ఆరోగ్య రథం వాహనం ద్వారా 200కి పైగా వ్యాధి నిర్థారణ పరీక్షలు, వైద్యుల సంప్రదింపులు, మాతా శిశు సంరక్షణ, ఆరోగ్య అవగాహన సదస్సులు గ్రామాల్లో ఏర్పాటు చేయనున్నారు. ఈ వాహనంలో ఒక వైద్యుడు, ఒక నర్సు, ఫార్మాసిస్ట్, కంప్యూటర్ ఆపరేటర్, ఆరుగురు వైద్య సిబ్బంది, మందుల కౌంటర్ ఉంటాయి. సాధారణ వ్యాధులకు వాహనంలోనే వైద్యం అందించి ఉచితంగా మందులు కూడా పంపిణీ చేస్తారు. ఇతర వైద్య సేవలు అవసరమైతే వీళ్లే పెద్దాస్పత్రులకు సిఫారసు చేస్తారు. ఈ వాహనం హిందూపురం నియోజకవర్గంలో ప్రతిరోజు ఒక గ్రామానికి వెళ్లి సేవలు అందిస్తుంది.


    సంజీవని ఉచిత ఆరోగ్య కేంద్రంలో..



    మంగళగిరి పట్టణంలోని టిప్పర్ల బజార్‌లో సంజీవని ఉచిత ఆరోగ్య కేంద్రాన్ని నారా లోకేశ్ మంగళవారం ప్రారంభించారు. ఆరోగ్య కేంద్రంలో అత్యాధునిక చికిత్స ప‌రిక‌రాలు, ప‌రీక్ష యంత్రాలు, ఎమ‌ర్జెన్సీకి అవ‌స‌ర‌మైన సామగ్రిని తన సొంత ఖ‌ర్చుల‌తో లోకేశ్ సమకూర్చారు. ఒక జ‌న‌ర‌ల్ ఫిజిషియ‌న్ అయిన డాక్టర్‌, క్వాలిఫైడ్ ఫార్మసిస్ట్‌, ఫిమేల్ న‌ర్స్‌, కాంపౌండ‌ర్ ఈ వాహనంలో ఉంటారు. ఆరోగ్య కేంద్రంలోనే 200కి పైగా రోగ‌నిర్ధార‌ణ ప‌రీక్షలు కూడా పూర్తిగా చేయొచ్చు. అవ‌స‌ర‌మైన‌వారికి ఉచితంగా మందులు కూడా ఇందులోనే అందజేస్తారు. అంద‌రికీ ఆరోగ్యమ‌స్తు- ప్రతీ ఇంటికీ శుభ‌మ‌స్తు అనే నినాదంతో ఆరోగ్య కేంద్రం అందుబాటులోకి తెచ్చినట్లు లోకేశ్ తెలిపారు.
    Published by:Mahesh
    First published:

    Tags: Balayya, Nandamuri Balarkrishna, Nara Lokesh, TDP

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు