హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Rare Mangoes: ఏపీలో జపాన్ మామిడి.. ఒక్కపండు ధర రూ.లక్ష.. సాగుచేస్తే కోటీశ్వరులే..!

Rare Mangoes: ఏపీలో జపాన్ మామిడి.. ఒక్కపండు ధర రూ.లక్ష.. సాగుచేస్తే కోటీశ్వరులే..!

మియాజాకీ మామిడి కాయతో రైతు నాగేశ్వరరావు

మియాజాకీ మామిడి కాయతో రైతు నాగేశ్వరరావు

Kakinada News: సాధారణంగా మామిడికాయలు డజను రూ.200 నుంచి సైజునను బట్టి రూ.వెయ్యి వరకు లభ్యమవుతాయి. కిలోల లెక్కన కూడా మామిడికాయలు అందుబాటులో ఉంటాయి. ఐతే మామిడి కాయ ధర లక్ష రూపాయలుంటుందా..? అది తినేమామిడి కాయానా.. లేక గోల్డెన్ మ్యాంగోనా అని అనుకుంటున్నారా..?

ఇంకా చదవండి ...

P Anand Mohan, News18, Visakhapatnam

వేసవి (Summer) వచ్చిందంటే మామిడి పండ్ల (Mangoes) కోసం జనం ఎగబడతారు. కొందరికి తోటలుంటాయి..చాలా మంది మార్కెట్లో కొనుగోలు చేసి తింటుంటారు. సాధారణంగా మామిడికాయలు డజను రూ.200 నుంచి సైజునను బట్టి రూ.వెయ్యి వరకు లభ్యమవుతాయి. కిలోల లెక్కన కూడా మామిడికాయలు అందుబాటులో ఉంటాయి. ఐతే మామిడి కాయ ధర లక్ష రూపాయలుంటుందా..? అది తినేమామిడి కాయానా.. లేక గోల్డెన్ మ్యాంగోనా అని అనుకుంటున్నారా..? వినడానికి ఆశ్చర్యంగానూ, విడ్డూరంగానూ ఉన్నా.., ఇది నిజం. జపాన్ దేశానికి చెందిన "మియాజాకీ" (Miyazaki Mangoes) అనే జాతికి చెందిన మామిడి పండ్లకు మన దేశంలో లక్షలరూపాయల్లో ధర పలుకుతోంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోనూ ఓ రైతు ఈ అరుదైన మామిడికాయలను పండిస్తున్నారు. ఆమామిడి ధర కిలో రూ.2.50 లక్షలు పైమాటే.

కాకినాడ జిల్లా (Kakinada District) పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామానికి చెందిన ఓదూరి నాగేశ్వరరావు అనే రైతు తన పొలంలో ఈ మియాజాకీ జాతికి చెందిన మామిడి పండ్లు పండిస్తున్నారు. కడియం నర్సరీల ద్వారా జపాన్ (Japan) నుంచి 20 మొక్కలను తెప్పించి తన పొలంలో నాటారు. ప్రస్తుతం ఆ మొక్కలు ఇప్పుడిప్పుడే కాయలనిస్తున్నాయి. ఈ పళ్లలో మంచి పోషక విలువలుండటంతో కిలో మామిడి లక్షల్లో పలుకుతుంది. ప్రస్తుతం నాగేశ్వరరావు తోటలో కాసిన 380 గ్రాముల మామిడి పండును ఆన్ లైన్లో పెట్టగా లక్ష రూపాయలు పలికింది.

ఇది చదవండి: ఏపీ ప్రజలకు వార్నింగ్.. ఈ రెండు రోజులు అస్సలు బయటకెళ్లొద్దు..


కేవలం మియాజాకీ మామిడి పండ్లనే కాకుండా వివిధ రకాల అరుదైన పండ్లను పండిస్తున్నారు. టెంకలేని సీడ్ లెస్ మామిడి పండ్లు, యాపిల్ మ్యాగోస్, తెల్ల నేరేడు, స్ట్రాబెర్రీ దానిమ్మ వంటి పండ్ల చెట్లను పెంచుతున్నారు. సాధారణంగా ఇలాంటి పండ్లు జపాన్, తైవాన్, వియత్నాం, మలేషియా, సింగపూర్ (Singapore) వంటి దేసాల్లో కనిపిస్తుంటాయి. తెల్లనేరేడు పండ్ల వల్ల షుగర్ పూర్తిగా అదుపులోకి వస్తుందని నాగేశ్వరరావు చెబుతున్నారు. తనకున్న భూమిలో అరుదైన మొక్కలు నాటి పెంచుతున్నామని ఆయన అన్నారు. తన కుమారుడు కిశోర్ సహకారంతోనే ఇది సాధ్యమైందంటున్నారు. మొక్కల పెంపకానికి కేవలం సేంద్రీయ ఎరువులను మాత్రమే వినియోగిస్తున్నామని.. ఎలాంటి రసాయనాలు వాడటం లేదని నాగేశ్వరరావు అన్నారు.


ఇది చదవండి: ఏపీలో సినిమా టికెట్లపై కీలక అప్ డేట్స్.. సర్కార్ కొత్త గైడ్ లైన్స్

ఐతే ఇలాంటి అరుదైన పండ్లకు మార్కెట్లో గిరాకీ ఉన్నా.. తాను మాత్రం లాభాపేక్షతో పెంచడం లేదని నాగేశ్వరరావు తెలిపారు. పండ్లను తనకు తెలిసిన ప్రముఖులు, బంధువులకు మాత్రమే ఇస్తానని చెప్తున్నారు. మియాజాకీ మామిడి పండ్లకు లక్షలిచ్చినా సరే విక్రయించే ప్రసక్తే లేదంటున్నారాయన.

First published:

Tags: Andhra Pradesh, Kakinada, Mango

ఉత్తమ కథలు