వైసీపీ ఎమ్మెల్యే రజనీ కారుపై దాడి... గుంటూరులో ఉద్రిక్త పరిస్థితులు...

YCP MLA Car Attack : గుంటూరు జిల్లాలో ఎమ్మెల్యే కారుపై దాడి జరగడంతో అక్కడి వాతావరణం ఉద్రిక్తంగా మారింది.

news18-telugu
Updated: February 21, 2020, 10:11 AM IST
వైసీపీ ఎమ్మెల్యే రజనీ కారుపై దాడి... గుంటూరులో ఉద్రిక్త పరిస్థితులు...
వైసీపీ ఎమ్మెల్యే రజనీ కారుపై దాడి... గుంటూరులో ఉద్రిక్త పరిస్థితులు... (File)
  • Share this:
YCP MLA Car Attack : గుంటూరు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే రజనీ కారుపై ప్రత్యర్థులు దాడి చేశారు. కోటప్పకొండ... కట్టుబడివారిపాలెంలో అర్థరాత్రి 1 గంట సమయంలో ఈ దాడి జరిగినట్లు తెలిసింది. ఎమ్మెల్యే రజనీ మరిది గోపీ... కోటప్పకొండకు వెళ్లి ప్రభలను ఇచ్చి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఐతే... కారులో ఎమ్మెల్యే రజనీ ఉన్నారన్న ఉద్దేశంతో దుండగులు... కారుపై రాళ్లు, కర్రలతో దాడి చేశారు. దాంతో కారు ధ్వంసమైంది. తీరా చూస్తే... అందులో రజనీ లేరనీ... ఆమె మరిది గోపీ మాత్రమే ఉన్నారని తెలియడంతో... ప్రత్యర్థులు ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్న సమయంలో... వైసీపీ కార్యకర్తలు అక్కడకు రావడంతో... ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ప్రత్యర్థులు, వైసీపీ కార్యకర్తలూ కొట్టుకున్నట్లు తెలిసింది. చివరకు రెండు వర్గాల వారికీ స్వల్ప గాయాలైనట్లు సమాచారం. ఐతే... కారుపై టీడీపీ కార్యకర్తలే దాడికి దిగారని వైసీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం గుంటూరులో రాజకీయ వేడి రగులుతోంది.

ప్రత్యర్థుల దాడిలో ధ్వంసమైన కారు


ప్రత్యర్థుల దాడిలో ధ్వంసమైన కారు


ఈమధ్య గుంటూరు... చిలకలూరిపేటలో రాజకీయాలు భగ్గుమంటున్నాయి. తాజా ఘటనలో గోపి గాయాలతో తప్పించుకోవడంతో... ప్రాణాపాయం తప్పిందంటున్నారు. గురువారం ఎంపీ లావు కృష్ణదేవరాయలు కారును పురుషోత్తపట్నంలో రజనీ వర్గీయులు అడ్డుకున్నారు. ఎంపీ సామాజికవర్గానికి చెందిన కొందరు, గురువారం ఘటనకు ప్రతీకారం తీర్చుకునేందుకు నేడు (శుక్రవారం) ఈ కారుపై దాడికి దిగినట్లు తెలుస్తోంది.

ప్రత్యర్థుల దాడిలో ధ్వంసమైన కారు
First published: February 21, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading