హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Sun Rays in Temple: సైన్స్ కు అందని అద్భుతం.. ఉగాది రోజు సంధ్య వేళ స్వామివారికి సూర్యకిరణాలతో అభిషేకం

Sun Rays in Temple: సైన్స్ కు అందని అద్భుతం.. ఉగాది రోజు సంధ్య వేళ స్వామివారికి సూర్యకిరణాలతో అభిషేకం

రాముల వారికి సూర్య కిరణాలతో అభిషేకం

రాముల వారికి సూర్య కిరణాలతో అభిషేకం

Sun Rays in Temple: మన దేశంలోని హిదూ దేవాలయాల నిర్మాణాలు.. సైన్స్ కు కూడా అందని అద్బుతాలుగా నిలుస్తాయి. ఇప్పటికీ వాటి వెనుక ఉన్న రహస్యం ఏంటో అర్థంకాని దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. ఇంజనీర్ ప్రతిభ అనాలో.. దేవుడి మహిమ అనాలో తెలియని విధంగా ఉంటాయి ఆలయాలు.

ఇంకా చదవండి ...

  Sun Rays in Temple: భారత దేశం (India)లో  చాలా హిందూ దేవలయాలు (Hindu Temples) చాలా పురాతనమైనవే.. కానీ అప్పటి నిర్మాణాలు ఇప్పటి సైన్స్ కూడా అందండం లేదు.. ఎందుకంటే ఎవరూ ఊహించని అద్భుతాలు (Miracles) జరుగుతుంటాయి ఆలయాల్లో.. ఇది ఎలా సాధ్యమవుతోంది అన్నది ఇప్పటి ఇంజనీర్లకు.. శాస్త్రవేత్తలకు కూడా అంతు చిక్కడం లేదు. అలాంటి దేవాలయాలు ఎన్నో ఉన్నాయని మన దేశంలో.. వాటి నిర్మాణాలు అలనాటి వైభవానికి, ఇంజనీరింగ్ (Engineering) ప్రతిభకు తార్కాణాలుగా నిలుస్తూనే ఉన్నాయి. సహజంగానే పలు దేవాలయాలలో దేవతమూర్తులను భానుడు తెల్లవారుజామున లేలేత కిరణాలతో అభిషేకించడం సాధారణంగా చూస్తూ ఉంటాం. ఇలాంటి ఆలయాలు కొన్ని ఉన్నాయి. ఇక ప్రత్యేకమైన రోజుల్లో మూల విరాట్ ను సూర్యకిరణాలు తాకే ఆలయాలు కూడా ఉన్నాయి. వాటికి భిన్నంగా ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లోని ఓ సీతారాముల వారి దేవస్థానంలో మాత్రం భానుడు అస్తమించే సమయంలో సీతారాముల వారిని అభిషేకించడం గురించి ఎప్పుడైనా విన్నారా..? అది కూడా ఉగాది రోజు నుంచి మూడు రోజుల పాటు ఈ అద్భుతం ఆవిష్కృతమవుతుంది. దీంతో సీతారాముల దేవస్థానానికి భారీ సంఖ్యలో భక్తులు చేరుకుంటారు. స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహిస్తారు.

  ఈ ఆలయం ఎక్కడ ఉందంటే.. ప్రకాశం జిల్లా.. చీరాల మండల పరిధిలోని దేవాంగపురి గ్రామంలోని శ్రీ సీతారాములవారి దేవస్థానం.. ఈ ఆలయంలో.. శ్రీ సీతారాములవారిని కొన్ని నిముషాల పాటు సూర్యభగవానుడు అస్తమించే సమయంలో.. తన కిరణాలతో స్వామివారిని అభిషేకించడం ఆనవాయితీడా వస్తోంది. మరోసారి అలాంటి అద్భుతమే జరిగింది. ఈ అద్భుత దృశ్యాన్ని తిలకించిన భక్తులు పరవశించిపోయారు. ఈ సీతారాములవారి దేవస్థానం సుమారు150 సంవత్సరాల చరిత్ర కలిగి ఉందని స్థానికులు చెబుతూ ఉంటారు. ఏడాది తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ ముందు రోజు నుంచి వరుసగా మూడు రోజుల పాటుగా సూర్యభగవానుడు సీతారాములవారిని ఆస్తమించే వేళలో సూర్యకిరణాలతో అభిషేకించడం ఆనవాయితీగా వస్తోంది.

  కేవలం ఉగాది పండుగ మూడు రోజుల పాటు మాత్రమై ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంటుంది. అయితే ఇది నేటికీ ఖగోళ శాస్త్ర వేత్తలకు సైతం ఈ అద్భుతం ఏంటన్నది అంతు చిక్కడం లేదు. సీతారాములవారిని కొన్ని నిముషాలు పాటుగా సూర్యభగవానునుడు సూర్య కిరణతలో అభిషేకించాడు.

  ఇదీ చదవండి : శత్రువులు కూడా మనల్ని వాడుకోగలిగేంత మూర్ఖత్వం మనది.. పవన్ మరో ఆసక్తికర ట్వీట్..? ఎవరిని ఉద్దేశించి

  ఈ అరుదైన అద్భుతాన్ని తిలకించేందుకు.. చీరాల పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు అక్కడికి తరలి వచ్చారు. సూర్యభగవానునుడు సీతారాముల వారిని అభిషేకించే దృశ్యాన్ని తిలకించిన భక్తులు దేవతామూర్తుల సేవలో పులకరించిపోయాయారు .ఈ సందర్భంగా దేవతమూర్తులకు భక్తులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు ,విశేష అభిషేకాలు నిర్వహించారు.

  Published by:Nagabushan Paina
  First published:

  ఉత్తమ కథలు