MINSTERS COMMITTEE WARNING TO AP GOVERNMENT EMPLOYEES UNIONS NO MORE WAITING NGS GNT
AP PRC Fight: ఇక ఎదురుచూపులు లేవు.. ఉద్యోగ సంఘాల తీరుపై మంత్రుల ఫైర్
మంత్రి బొత్స సత్యనారాయణ (ఫైల్)
AP PRC Fight: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం - ఉద్యోగ సంఘాల మధ్య మరింత దుమారం పెరిగింది. మాట్లాడుకునే పరిస్థితి దాటి.. వార్నింగ్ లు ఇచ్చుకుంటున్నారు. వరుసగా నాలుగు రోజులు మంత్రుల కమిటీ ఎదురు చూసినా.. ఉద్యోగ సంఘాలు ముందుకు రాకపోవడంతో.. మంత్రులు సీరియస్ అయ్యారు. ఇకపై మీ కోసం ఎదురు చూపులు ఉండవని స్పష్టం చేశారు.
AP Employees Strike : ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో పీఆర్సీ ఇష్యూ రోజు రోజుకూ మరింత ముదురుతోంది. కొత్త పీఆర్సీ (PRC) జీవోలు రద్దు చేయలేని.. లేదా జనవరి నెల జీతలు పాత పద్ధతిలోనే ఉద్యోగుల ఖాతాలో వేసి.. ఆ తరువాతే చర్చలకు పిలుస్తే వస్తామంటున్నాయి ఉద్యోగ సంఘాలు (Employees Union). అప్పటి వరకు చర్చలు లేవని చెబుతోంది. అయితే ప్రభుత్వం అలా కుదరదని తెగేసి చెప్పింది. కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలు పడతాయని.. తేల్చి చెప్పేసింది. అయితే మంత్రుల కమిటీలో ఒకరైన సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం ఉద్యోగులు ఎప్పుడు వచ్చిన చర్చలకు సిద్ధమే అని.. 12 గంటల పాటు సచివాలయంలోనే ఎదురుచూస్తుంటామన్నారు.. సరిగా ఆయన ఆ ప్రకటన చేసి 24 గంటలు కూడా గడవక ముందే.. మంత్రుల కమిటీ మాట మార్చింది. ముఖ్యంగా మంత్రి బొత్స ఉద్యోగ సంఘాల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు.. ఇకపై ఉద్యోగ సంఘాల కోసం ఎదురు చూపులు ఉండవు అన్నారు.
ఉద్యోగ సంఘాల తీరు చూస్తుంటే.. వారి వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని అనుమానాలు పెరుగుతున్నాయి అన్నారు. నిజంగా వారికి ఉద్యోగుల సంక్షేమమే ముఖ్యమంటే ఇప్పటికే చర్చలకు వచ్చేవారని అభిప్రాయపడ్డారు. ఉద్యోగులు అంటే ప్రభుత్వం అంతర్భాగమన్నారు. అందుకే వారి అపోహలు తొలగించే పరయత్నం చేస్తున్నామన్నారు. ఉద్యోగుల గురించి ప్రభుత్వం ఆలోచిస్తుంటే.. వారు చర్చలకు రాకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్ర పరిస్థితిని వారు అర్థం చేసుకోవాలని కోరారు. ఇకపై వారి కోసం ఎదరు చూడమని.. వారంత వారు వస్తేనే చర్చిస్తాం లేదంటే ఇక చర్చలు ఉండవని తేల్చి చెప్పేశారు బొత్స..
ఇటు మంత్రి సజ్జల కూడా మరోసారి ఉద్యోగ సంఘాల తీరుపై మండిపడ్డారు. సందేహాలు ఉంటే.. వచ్చి మాట్లాడాలి కానీ.. చర్చలకు రామంటే ఎలా అన్నారు. పీఆర్సీ సాధన కమిటీ మాత్రమే కాదు.. ఉద్యోగుల నుంచి ఎవరు వచ్చినా.. తాము చర్చిండానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఇందులో భాగంగా కొందరు సర్వీసు ఉద్యోగు వచ్చారని.. వారు కూడా తమ సమస్యలు చెప్పారని.. వాటన్నింటినీ సానుకూలంగా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.
ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. ఉద్యోగుల్లో విభజన తెచ్చే విధంగా ప్రభుత్వం ప్రయత్నాలు చేయడం దారుణమన్నారు. ఎవరికైనా ప్రభుత్వంతో చర్చించే అధికారం ఉంటుందని.. కానీ ఉద్యోగులను విడదీసే ప్రయత్నం చేస్తే.. మరింత తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నారు.. జనవరి ఒక్క నెల జీతలు పాత పద్దతిలో ఇస్తే ప్రభుత్వానికి నష్టం ఏంటని ప్రశ్నించారు.. అలా చేస్తే తాము చర్చలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని మరోసారి స్పష్టం చేశారు. ప్రభుత్వం తీరు ఇలాగే ఉంటే.. సమ్మె తప్ప తమకు వేరే మార్గం లేదని ఉద్యోగ సంఘాలు మరోసారి హెచ్చరించాయి.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.