Minister Roja Vs Lokesh: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో మంత్రి రోజా (Minister Roja) Vs టీడీపీ నేత నారా లోకేష్ (Nara Lokesh) వార్ మరింత ముందిరింది. ఇద్దరూ తగ్గేదే లే అంటూ పంచ్ డైలాగ్ లు పేలుస్తున్నారు. పదునైన మాటలతోనే రాజకీయ యుద్ధం చేస్తున్నారు.. హైవోల్టేజ్ డైలాగ్స్‌తో ఓ రేంజ్‌లో హీటెక్కిస్తున్నారు. యువగళం (Yuva Galam ) పేరుతో నారా లోకేష్ రోజాపై విమర్శలు చేస్తుంటే..? అదే స్థాయిలో రోజా కౌంటర్లు వేస్తున్నారు. దీంతో వీరిద్దరి డైలాగ్ వార్ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. సినిమాలకు సీక్వెల్ లా.. వీరిద్దరి మధ్య మాటల యుద్ధం కూడా పార్టులు పార్డులుగా కొనసాగుతున్నాయి. తాజాగా మరోసారి లోకేష్‌పై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు మంత్రి రోజా.. తనదైన శైలిలో
పంచ్ లు వేశారు.
లోకేష్‌కు ఏ రకం చీర కావాలో చెబితే పంపిస్తానంటూ రోజా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆస్తుల విషయంలోనూ లోకేష్.. రోజా మధ్య డైలాగ్ వార్ నడిచింది. CBI ఎంక్వైరీకి సిద్ధమా అంటూ సవాల్ విసిరారు రోజా.. నువ్వొకటంటే, నేను అంతకుమించి అంటానంటూ కౌంటర్లు, రీకౌంటర్లతో రాజకీయాలు మరింత రక్తికట్టిస్తున్నాయి.
ఇదీ చదవండి : సీఎం నివాసంలో గోశాలను చూసి మైమరచిన చాగంటి.. సీఎం పై ప్రశంసల వర్షం
గురువారం నగరికి వచ్చిన రోజా.. లోకేష్ తాజాగా వ్యాఖ్యలపై మరోసారి మండిడపడ్డారు. తన ఇంటి ముందు గాజులు పగలగొట్టించడానికి
లోకేష్‌కి ఎంత ధైర్యమంటూ నిప్పులు చెరిగారు. చీర చీర అంటోన్న లోకేష్.. ఏ కలర్ చీర కావాలో చెబితే పంపిస్తానంటూ సెటైర్లు వేశారు.
బెనారస్ కావాలో, ఉప్పాడ కావాలో లోకేష్ తేల్చుకోవాలి అన్నారు. లోకేష్ ఓ రాజకీయ అజ్ఞాని, ఓ శుంఠ.. నక్క వాతలు పెట్టుకున్నట్టు
జగన్‌ను చూసి పాదయాత్రచేస్తే సీఎం అయిపోతారా అని రోజా ఎద్దేవ చేశారు.
ఇదీ చదవండి : టీడీపీలో చేరుతున్న కన్నా..! చంద్రబాబు ఇచ్చిన హామీ ఏంటంటే..?
లోకేష్ గురించి ఏపీలో అందరికీ తెలియడంతో ఎవరూ పాదయాత్రకు రావడం లేదన్నారు. అందుకే ఈ పాద యాత్రకు కర్నాటక, తమిళనాడు
నుంచి అద్దె మనుషుల్ని తెచ్చుకుంటున్నారని ఆరోపించారు. అలాగే అవును తాను తన కుటుంబానికి డైమండ్ పాపనే అన్నారు. అలాగే
లోకేష్ తాజా విమర్శలు కూడా నిజమే అన్నారు. ఎందుకంటే..? తాను జబర్దస్త్ ఆంటీనే అన్నారు. దానికి అంతగా నవ్వుతూ జబర్దస్త్ ఆంటీ
అని పిలవాలా? అంత వ్యంగ్యం ప్రదర్శించాల్సిన అవసరం ఏముందన్నారు. తనకు ఇద్దరు పిల్లలున్నారు.. తన వయసుకు తాను ఆంటీనే.
అందులో ఆశ్చర్యం ఏముంది? అని రోజా ప్రశ్నించారు. లోకేశ్ వేసే జోకులకు జనాలు నవ్వడంలేదని, దాంతో తన జోకులకు తానే
నవ్వుకుంటున్నాడని ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి : డ్రైవర్ గా మారిన మాజీ మంత్రి కొడాలి నాని .. ఆర్టీసీ బస్సు ఎలా నడిపారో చూడండి..
జగన్ మోహన్ రెడ్డిని చూసి తాను కూడా సీఎం అవ్వాలని లోకేష్ పాదయాత్ర చేస్తున్నాడని, పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా
ఉందని రోజా విమర్శించారు. లోకేశ్ ఒక పొలిటికల్ జీరో అని ప్రజలే అంటున్నారని, పాదయాత్ర మొదటి నుంచి ఇప్పటివరకు గమనిస్తే ఆ
విషయం లోకేష్ కే అర్థమవుతుందని అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Minister Roja, Nara Lokesh