Minster Roja: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని సినిమా షూటింగ్ (Movie Shooting) లో ఎక్కువ శాతం జరగాలని ఏపీ ప్రభుత్వం (AP Government) కోరుతోంది. ఇటీవల తనను కలిసిన సినిమా పెద్దలకు కూడా సీఎం జగన్ (CM Jagan) అదే మాట చెప్పారు. ఏపీలో 20 శాతానికి పైగా షూటింగ్ లు జరుపకున్న పెద్ద సినిమాలకు మాత్రమే టికెట్ల రేట్లు పెంచుకునే అవకాశం ఇస్తామని స్పష్టం చేశారు. ఇది కేవలం టాలీవుడ్ కు మాత్రమే వర్తిస్తుంది. అయితే ఇతర భాషల సినిమా షూటింగ్ లు సైతం ఏపీలో జరిగితే.. గుర్తింపుతో పాటు ఆదాయం వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. అందులోనూ ఏపీ ప్రభుత్వం (AP Government).. విశాఖ (Visakha)ను ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా చెబుతోంది. అలాంటి చోట వివిధ భాషల సినిమా షూటింగ్ లు జరిగితే.. ఆ ప్రాంతానికి ఉండే ఇమేజ్ మరింత పెరుగుతుంది. ఇక పర్యాటక మంత్రిగా విశాఖను మరింత ప్రమోట్ చేయాల్సిన బాధ్యత కూడా రోజా (Roja)పై ఉంటుంది. ఇలాంటి సమయంలో రోజా భర్త.. ఆర్ కె సెల్వమణి (RK Selvamani) సంచలన వ్యాఖ్యలు చేశారు.. వైజాగ్ లో తమిళ షూటింగ్ లు జరపొద్దని సూచించారు.. దీంతో ఆయన వ్యాఖ్యలపై విపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి.
మంత్రి రోజా భర్త సెల్వమణి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రాన్ని కించపరిచేలా, నష్టం చేకూర్చేలా ఉన్నాయని తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఏపీలో తమిళ సినిమా హీరోల సినిమా షూటింగులు వద్దని చెప్పడానికి సెల్వమణి ఎవరని ప్రశ్నించారు. ఒక వైపు రాష్ట్రంలో టూరిజాన్ని అభివృద్ధి చేస్తానని మంత్రి రోజా చెబుతుంటే.. ఆమె భర్త సెల్వమణి మాత్రం అందుకు విరుద్ధంగా మాట్లాడుతున్నారని సత్యనారాయణరాజు మండిపడ్డారు.
ఇదీ చదవండి : విజయసాయి రెడ్డి న్యూ లుక్ చూశారా..? సజ్జలతో ఏం చెప్పారంటే..?
సెల్వమణి వ్యాఖ్యలపై రోజా నోరు విప్పాలనే డిమాండ్లు వినిపిస్తుండడంతో రోజా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. వైజాగ్ వచ్చిన మంత్రి రోజా దీనిపై స్పందించారు. తన భర్త సెల్వమణి ఏ రాష్ట్రంలో షూటింగ్లో ఆ రాష్ట్రంలో జరిగితే బాగుంటుందని మాత్రమే చెప్పారని మంత్రి రోజా అన్నారు. కానీ విపక్ష టీడీపీ నేతలు మాత్రం ఈ వ్యాఖ్యల్ని వక్రీకరించారని ఆరోపించారు.
ఇదీ చదవండి : : అమ్మ మనసు ఎంత క్షోభించిందో? పాపం చిన్నారులు ఎలా ఉన్నారో? విషాదం నింపిన వివాదం
ఏ రాష్ట్రంలో షూటింగ్ లు జరిగితే ఆ రాష్ట్రానికి డబ్బులు వస్తాయని తన భర్త చెప్పడం తప్పా అని రోజా ప్రశ్నించారు. మరోవైపు విజయమ్మ, షర్మిలపై విమర్శలు చేసే వారిని రోజా టార్గెట్ చేయడంపై టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపైనా రోజా స్పందించారు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుకు అక్క అమ్మ, చెల్లి ఎవరూ లేరా అని సూటిగా ప్రశ్నించారు. మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్లపై మాట్లాడితే నీకు బాధగా ఉండదా అని ప్రశ్నించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.