AP Minster: మంత్రి పేర్ని నాని (Minster Perni Nani) అంటే.. ఎప్పుడు నవ్వుతూ.. చాలా కూల్ గా కనిపిస్తుంటారు.. విపక్షాలు విమర్శలు చేస్తే.. అదే స్థాయిలో కౌంటర్ ఇవ్వడం తప్పా.. ఎప్పుడు సీరియస్ అయిన సందర్భాలు లేవు.. చిన్ని చిన్న సమస్యలు వచ్చినా.. సౌమ్యంగానే డీల్ చేస్తారు.. అలాంటి మంత్రి ఒక్కసారిగా తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.. తమాషాలు చేస్తున్నారా అంటూ.. పోలీసులపై మండిపడ్డారు. పోలవరం పర్యటనలో భాగంగా ఈ ఘటన జరిగింది. పోలీసు అధికారులపై పేర్ని నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ (Gajendra Singh Sekhawat), సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) పోలవరం పర్యటనలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా (West Godavari District) ఇన్ఛార్జ్ మంత్రి హోదాలో పేర్ని నాని అక్కడికి వెళ్లారు. అక్కడ మంత్రి కారు అడ్డుగా ఉందని.. దాన్ని పక్కకు తీయాలని ప్రోటోకాల్ సిబ్బంది చెప్పడంపై మంత్రి ఒక్కసారిగా ఆవేశానికి గురయ్యారు. తన కారే తీయమంటారా.. నేను ఎవరు అనుకుంటున్నారో తెలుసా..? మీ తమాషాలు ఆపండి అంటూ గట్టిగానే మందలించారు.
ఇంతకీ ఆయన ఎందుకు అంతలా సీరియస్ అయ్యారంటే..? కేంద్రమంత్రి, సీఎం పర్యటన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు పరిసరాల్లో భారీస్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రాజెక్టు సమీపంలోకి ఎవరికీ అనుమతించ లేదు. స్థానిక ప్రజాప్రతినిధులు, పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్యేలను కూడా అనుమతించకపోవడంతో వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న పేర్ని నాని పోలవరం ప్రాజెక్టు దగ్గరకు చేరుకున్నారు. మంత్రి వాహనం అడ్డుగా ఉందని.. దాన్ని తీయాలని పోలీసులు సూచించారు. ఆ విషయం మంత్రికి తెలియడంతో.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడున్న పోలీసు అధికారిని ఉద్దేశిస్తూ ఈ కార్లన్నీ ఎవరివి? తమాషాలు చేస్తున్నారా? కారు తీయమన్నది ఎవరు? ఎస్పీ, డీఐజీ కార్లు ఇక్కడెందుకు ఉంటాయి? నాకంటే వాళ్లు ఎన్ని డిసిగ్నేషన్లు తక్కువ? మర్యాదగా ఉండదు’’ అంటూ ఓ రేంజ్ లో మండిపడ్డారు..
Minster Perni Nani Serious || పేర్ని నాని అంటే ఫ్లవర్ అనుకుంటున్నారా.? ఫ... https://t.co/zLrFQZ4uz4 via @YouTube #PerniNani #Polavaram @YSRCPDMO @NriTDPCanada @tdptrending
— nagesh paina (@PainaNagesh) March 4, 2022
అయితే కేవలం ఆయన కారు తీయమన్నారు అనే కాదు.. స్థానికంగా ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలను కూడా అనుమతించపోవడం మంత్రి ఆగ్రహానం అంటున్నారు. విషయం ఉన్నతాధికారులకు వెళ్లడంతో.. వారు వచ్చి సర్ది చెప్పి.. పోలీసుల నుంచి ఆ మేరకు అనుమతి లభించడంతో ఆయన శాంతించారు. అయితే ఇలా మంత్రులు పోలీసులపై ఫైర్ అవ్వడం ఇదే తొలిసారి కాదు.. ముఖ్యంగా సీఎం జగన్ పర్యటనలో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి.. ఇటీవల విశాఖపట్నం పర్యటనకు వెళ్లారు సీఎం జగన్.. ఆ సమయంలో మంత్రి సీదిరి అప్పలరాజు అనుచరులను.. శారాదా పీఠం బయటే ఆపేశారు పోలీసులు.. దీంతో పోలీసుల తీరుకు నిరసనగా దండం పెట్టి మరీ మంత్రి వెను దిరిగారు..
ఇదీ చదవండి : వికేంద్రీకరణే మా విధానం.. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్తామన్న ప్రభుత్వం
ఇప్పుడు మంత్రి పేర్ని నాని వంతు వచ్చింది.. ఇలాంటి ఘటనలతో పోలీసులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. సీఎం పర్యటన సమయంలో తాము కఠినంగా వ్యవహరించకుండా ఉండగలమా అని ప్రశ్నిస్తున్నారు. సాధారణంగా ప్రజా ప్రతినిధులో.. కార్యకర్తలో ఇలా గొడవ పడితే పర్వాలేదని.. మంత్రులు కూడా పోలీసులపై ఉండే ఒత్తిడి అర్థం చేసుకోకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.. మరి భవిష్యత్తులో ఇలాంటి గొడవలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap minister perni nani, AP News, Polavaram