హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Mekapati Goutham Reddy: నెల్లూరుకు చేరిన గౌతమ్ రెడ్డి భౌతికకాయం.. రేపటి అంత్యక్రియల బాధ్యత ఆ ఇద్దరి మంత్రులదే..

Mekapati Goutham Reddy: నెల్లూరుకు చేరిన గౌతమ్ రెడ్డి భౌతికకాయం.. రేపటి అంత్యక్రియల బాధ్యత ఆ ఇద్దరి మంత్రులదే..

మేకపాటి గౌతమ్ రెడ్డి (ఫైల్)

మేకపాటి గౌతమ్ రెడ్డి (ఫైల్)

Mekapati Goutham Reddy: నెల్లూరు కన్నీరు మున్నీరు అవుతోంది. అభిమాన నేత.. వివాదారహితుడు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హ‌ఠాన్మర‌ణం శోకాని నిప్పింది. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన పార్థివ దేహం నెల్లూరుకు చేరుకుంది. దీంతో అభిమానులు, కార్యకర్తలు, సాధరణ ప్రజలు అంతా శోకసంద్రంలో ఉన్నారు.. మరోవైపు రేపు జరగనున్న అంత్యక్రియల బాధ్యతలను ఆ ఇద్దరు మంత్రులకు అప్పగించారు సీఎం జగన్.

ఇంకా చదవండి ...

Mekapati Goutham Reddy: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి (Mekapati Goutham Reddy) పార్థివ దేహం.. నెల్లూరుకు చేరుకుంది హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో సోమారం ఉదయాన్ని ఆయన తుదిశ్వాస విడిచారు. తీవ్రమైన గుండెపోటుకు గురైన గౌతమ్.. కాసేపటికే ప్రాణం విడిచారు. ఆ వెంటనే ఆయన్న భౌతికకాయన్ని జూబ్లిహిల్స్ లోని ఇంటికి తరలించారు.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy). ఇతర ఏపీ మంత్రులు, తెలంగాణ మంత్రి కేటీఆర్ తో సహా ఇతర మంత్రులు, చంద్రబాబు సహా విపక్షనేతలు, వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నేతలు, సినిమా ప్రముఖులు అంతా ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. ప్రస్తుతం ఆయన భౌతికకాయాన్ని ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి నెల్లూరు (Nellore)కు తరలించారు. రేపు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. గుండెపోటుతో హ‌ఠాన్మర‌ణం చెందిన   గౌత‌మ్ రెడ్డి అంత్యక్రియ‌లు రేపు అంటే 23 ఫిబ్రవరి 2022) నెల్లూరు జిల్లాలోని ఉద‌య‌గిరిలో నిర్వహించాల‌ని నిర్ణయించారు మేకపాటి కుటుంబ సభ్యులు. ఉద‌య‌గిరిలోని మెరిట్స్ ఇంజినీరింగ్ క‌ళాశాల ప్రాంగ‌ణంలో గౌత‌మ్ రెడ్డి అంత్యక్రియ‌లు నిర్వహించనున్నారు. అభిమానుల సందర్శనార్థం ఏర్పాట్లు చేశారు.

హైదరాబాద్‌ (Hyderabad) బేగంపేట ఎయిర్‌ పోర్ట్ నుంచి ప్రత్యేక నేవీ హెలీకాఫ్టర్‌లో గౌతమ్‌ రెడ్డి భౌతికకాయాన్ని నెల్లూరుకు తీసుకువచ్చారు. నెల్లూరు పోలీస్ పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు తరలించారు. పరేడ్‌ గ్రౌండ్‌ నుంచి గౌతమ్‌రెడ్డి నివాసానికి ఆయన భౌతికకాయాన్ని మంత్రి అనిల్ కుమర్ (Minster anil kumar) తదితరులు దగ్గరుండి తరలించారు. ఇప్పటికే గౌతమ్‌ రెడ్డి ఇంటి దగ్గర విషాదఛాయలు అలుకుకున్నాయి. గౌతమ్ అభిమానులు, వైసీపీ కార్యకర్తలు, బంధువులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. అభిమాన నాయకుడికి కడసారి వీడ్కోలు పలికేందుకు భారీగా తరలివస్తున్నారు మేకపాటి అభిమానులు.

ఇదీ చదవండి : ఏపీ కేబినెట్ లో కొత్త మంత్రులు ఎవరంటే..? జిల్లాలవారీగా ఫైనల్ లిస్ట్ ఇదే..

రాత్రికి గౌతమ్‌రెడ్డి కుమారుడు నెల్లూరు చేరుకుంటారు. రేపు ఉదయగిరిలో అధికార లాంఛనాలతో నిర్వహించే అంత్యక్రియలకు సీఎం జగన్‌, మంత్రులు, ప్రముఖులు హాజరవుతారు. అధికార లాంఛనాలతో నిర్వహించాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశిచింది. అయితే గౌతమ్ రెడ్డి అంత్యక్రియ‌ల నిర్వహ‌ణ స‌మ‌న్వయ‌క‌ర్తగా విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేశ్‌ను సీఎం జ‌గ‌న్ లనియ‌మించారు. అదేవిధంగా జిల్లా మంత్రి, జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌ను లోకల్‌గా ఏర్పాట్లు చూడవల్సిందిగా ఆదేశించారు.


ఇదీ చదవండి : గొప్పమనసు చాటుకున్న రోజా.. వరల్డ్ రికార్డు సాధించిన చిన్నారికి సొంత డబ్బులతో ఆర్థిక ప్రోత్సాహకం

గౌతంరెడ్డి మృతితో రెండు రోజులు సంతాప దినాలు ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. ప్రభుత్వ కార్యక్రమాల‌ను కూడా వాయిదా వేశారు. నెల్లూరు వాసులు మంత్రి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అంతా గుండె పగిలేలా రోదిస్తున్నారు. అభిమాన నేత హఠాన్మరాణాన్ని జీర్ణించుకోలేకపోతుంది నెల్లూరు. మరోవైపు ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికేందుకు భారీగా కార్యకర్తలకు ఇంటికి చేరుకుంటున్నారు.

First published:

Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Mekapati Goutam Reddy, Nellore

ఉత్తమ కథలు