MINSTER BOTSA SATYANARAYANA DIFFERENT COMMENTS ON 10TH EXAM PAPERS WHY HIS COMMENTS GOES CONTROVERSY NGS
Minster Botsa: మాస్ కాపీయింగ్ జరగలేదు.. పేపర్ లీక్ అవ్వలేదు.. 60 మందిపై చర్యలు తీసుకున్నాం.. మంత్రి మాటలకు అర్థం ఏంటో?
మంత్రి బొత్స సత్యనారాయణ (ఫైల్)
Minster Botsa: మంత్రి బొత్స సత్యానారాయణ ప్రస్టేషన్ లో ఉన్నారా..? మంత్రి వర్గ విస్తరణలో సీఎం జగన్ కేటాయించిన శాఖ పై ఇష్టం లేకపోయినా మంత్రిగా కొనసాగుతున్నారు. ఇదే సమయంలో పదో తరగతి పరీక్షల లీకేజ్ ఆరోపణలు ఆయనకు చిరాకు తెప్పిస్తున్నాయా..? ఆయన వ్యాఖ్యలు అందుకే గంరగోళంగా మారాయా..?
Minster Botsa: ఆంద్రప్రదేశ్ (Andhra Pradesh) లో పదో తరగతి పరీక్ష (!0 th Exams) నిర్వహణపై రాజకీయం రచ్చ అవుతోంది. ముఖ్యంగా పేపర్ లీకులు (Paper Leakage), మాస్ కాపీయింగ్ (Mass copying) పై పెను దుమారం రేగుతోంది. ప్రభుత్వ నిర్వహణలోపం కారణంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) సీఎం జగన్ (CM Jagan) కు బహిరంగ లేఖ కూడా రాశారు. రాష్ట్రాంలో అన్ని విపక్ష పార్టీలు.. పది పరీక్షల నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తోందని.. విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకోవద్దంటూ మండిపడుతున్నాయి. అయితే ఆ ఆరోపణలపై స్పందించిన మంత్రి బొత్స సత్యానారాయణ (Minster Botsa Satyanarayana) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ, రేపు జరిగే పరీక్షలు మంచిగా జరగాలని భగవంతుడిని కోరుకుంటున్నానని వ్యాఖ్యానించారు.
సరైన ఫలితాలు, ఉత్తీర్ణత నమోదు కాకపోతే ఉద్యోగంలో నుంచి తీసేస్తామని ప్రభుత్వం ఎవరినీ హెచ్చరించలేదన్నారు. చదువురాని పిల్లలూ పాస్ అవ్వాలని, మాస్ కాపీయింగ్ చేయించాలని ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఎందుకు చెబుతుందని మండిపడ్డారు. తాను మంత్రిగా రాజీనామా చేయాలని కొందరు నాయకులు అంటున్నారన్న బొత్స.. మంత్రిగా 13 ఏళ్లు పూర్తి చేసుకున్నానని, ఇదేం మహాభాగ్యం కాదన్నారు. పదో తరగతి పరీక్షల్లో ఇప్పటి వరకు 60 మందిపై కేసులు నమోదు చేశామని వెల్లడించారు. ఉపాధ్యాయులను తప్పుగా అరెస్టు చేస్తే సంఘాలు ఊరుకుంటాయా అని ప్రశ్నించారు. ఆ మాట అంటూనే.. పదో తరగతి పరీక్షల్లో అసలు పేపర్ లీక్ కాలేదని.. మాస్ కాపియింగ్ జరగలేదని వ్యాఖ్యనించారు..
ఓ వైపు మాస్ కాపీయింగ్ జరగలేదంటున్నారు..? పేపర్లు లీక్ అవ్వలేదంటున్నారు.. మరి 60 మందిపై చర్యలు ఎందుకు తీసుకున్నారు మంత్రే సమాధానం చెప్పాలంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఎవరి ఆరోపణలు ఎలా ఉన్నా.. ప్రభుత్వం మాత్రం పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తుంటే.. ప్రతిపక్షాలు బురదజల్లాలని చూస్తున్నాయని బొత్స ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు సరైన విద్య, క్రమశిక్షణ, మంచి భవిష్యత్ అందించడమే గురువులకు పరీక్ష అన్నారు. ఇప్పటి వరకు జరిగిన 5 పరీక్షల్లో ఎక్కడా మాస్ కాపీయింగ్ జరగలేదు. ప్రశ్నపత్రం లీక్ కాలేదు. శ్రీసత్యసాయి జిల్లాలో 10 గంటలకు ప్రశ్నపత్రం బయటకు వచ్చింది. పరీక్షల కేంద్రాలకు సిబ్బంది సెల్ఫోన్లు తీసుకెళ్లకుండా చూసేందుకు స్కానింగ్ యంత్రాలు పెడదామని అనుకుంటున్నామన్నారు.
అయితే బొత్స వ్యాఖ్యలకు వేరే కారణం ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గతంలో సీఎం జగన్ తన తొలి కేబినెట్ లో బొత్సకు కీలకమైన మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ కేటాయించారు. దీంతో మున్సిపల్ ఎన్నికలతోపాటు మూడు రాజధానులు, పట్టణాల్లో సౌకర్యాల వంటి కీలక అంశాల్లో బొత్స తన మార్క్ చూపించే అవకాశం దక్కింది. ఇప్పుడు కేబినెట్ విస్తరణలో భాగంగా.. బొత్సను పదవి నుంచి తప్పించాలని సీఎం మొదట అనుకున్నా.. వివిధ కారణాలతో కొనసాగించక తప్పలేదనే ప్రచారం ఉందన్నారు. కానీ బొత్సకు మంత్రి పదవి ఇచ్చి అసలు ప్రాధాన్యత లేని విద్యాశాఖ ఇచ్చారు. దీంతో ఆయన అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం ఉంది.
అందుకే శాఖను కేటాయించి ఇన్ని రోజులు అయినా ఇప్పటిదాకా విద్యాశాఖ మంత్రిగా బొత్స అసలు బాధ్యతలు చేపట్టలేదు. శాఖపరమైన సమీక్ష ఇప్పటివరకూ నిర్వహించలేదు. ఇలా ఆయన పూర్తి నిరాశలో ఉన్న సమయంలో ఇప్పుడు పదో తరగతి పరీక్షల నిర్వహణపై ఆరోపణలు రావడం..తో ఆయన ఫస్టేషన్ కు గురవుతున్నారని.. అందుకు ఇలాంటి గందరగోళ వ్యాఖ్యలు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.