Home /News /andhra-pradesh /

MINSTER BOTSA KEY COMMENTS ON CM JAGAN CABINET EXPAND AND HE SLAMS TDP CHIEF CHANDRABABU NGS

Botsa: మంత్రి వర్గ విస్తరణపై మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు.. టీడీపీ అధికారంలోకి రాదన్న బొత్స

మంత్రి బొత్స సత్యనారాయణ (ఫైల్)

మంత్రి బొత్స సత్యనారాయణ (ఫైల్)

Minster Botsa on Cabinet Expansion: మంత్రి వర్గ విస్తరణలో బొత్సాను తొలిగిస్తారని.. ఆయనకు పార్టీ రీజనల్ ఇంఛార్జ్ పదవి ఇస్తారని ప్రచారం ఉంది. ఆ వార్తలపై మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారంటే..?

    Botsa On Cabinet Expansion:  ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కేబినెట్ విస్తరణ హాట్ టాపిక్ అవుతోంది. ఏపీలో కేబినెట్ (AP Cabinet) విస్తరణ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కేబినెట్ విస్తరణకు సీఎం జగన్ (CM Jagan) అంతా సిద్ధం చేశారు. ముహూర్తం కూడా ఫిక్స్ చేసేశారు. దీంతో మంత్రివర్గంలో ఉండేది ఎవరు? ఊడేది ఎవరు? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో కేబినెట్ పున‌ర్వ‌వ‌స్థీక‌ర‌ణ‌పై మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ (Minster Botsa Satyanarayna) స్పందించారు. కేబినెట్ పున‌ర్వ‌వ‌స్థీక‌ర‌ణ అంశం పూర్తిగా సీఎం జ‌గ‌న్ ఇష్ట‌మ‌ని ఆయన చెప్పారు. జ‌గ‌న్ ఏ నిర్ణ‌యం తీసుకున్నా గౌరవిస్తామని, అందుకు అనుగుణంగానే సాగుతామ‌ని చెప్పారు. కేబినెట్‌పై నాయ‌కుడికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. కూర్పు అంటే ఎన్నో స‌మీక‌ర‌ణాలు ఉంటాయన్నారు. పార్టీ బ‌లోపేతం కోసం క‌లిసికట్టుగా ప‌నిచేస్తాం. సీఎం జ‌గ‌న్ ఎలా చెబితే అలా ముందుకు సాగుతాం అని బొత్స అన్నారు. కేబినెట్ విస్తరణపై జగన్ ఎలాంటి నిర్ణయం అయినా తీసుకోవచ్చు. అది ఆయన ఇష్టం. పార్టీని బలోపేతం చెయ్యడం, అధికారంలోకి తేవడం తమ అందరి బాధ్యత అన్నారు. 90 శాతం మంది మంత్రులను మారుస్తానని సీఎం జగన్ ముందే చెప్పారు. సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మేము గౌరవిస్తాం అని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.

    ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఏపీ కేబినెట్‌ పునర్‌ వ్యవస్థీకరణకు డేట్‌ ఫిక్స్‌ కావడంతో అటు మంత్రుల్లో.. ఆశావహుల్లో టెన్షన్ పెరగుతోంది. ఏప్రిల్ 7న కేబినెట్‌ భేటీ కానుంది. అదే రోజు మంత్రులకు సీఎం జగన్ క్లారిటీ ఇవ్వనున్నారు. ఆ తరువాత 8వ తేదీన గవర్నర్ అపాయింట్ మెంట్ తీసుకోనున్నారు సీఎం జగన్. గవర్నర్ ను కలిసి ఆయనకు మంత్రి వర్గ విస్తరణపై సీఎం క్లారిటీ ఇవ్వనున్నారు. ఆ తరువాత 11వ తేదీన కొత్త మంత్రి వర్గం ఏర్పాటు చేస్తారు. అయితే కొత్త కేబినెట్‌లో ఎవరు ఉంటారు.. ఎవరు బయటకు వెళ్తారనే దానిపై ఒక రోజు ముందే ఎమ్మెల్యేలకు ఆయన క్లారిటీ ఇవ్వనున్నారు. కొత్త మంత్రివర్గంలో కేవలం ఇద్దరు లేదా.. ముగ్గురు పాత మంత్రలు మాత్రమే ఉంటారని ఇప్పటికే సీఎం జగన్‌ క్లారిటీ ఇచ్చారు. 95 శాతం కొత్త కేబినెట్‌ కొలువుదీరనుంది.

    ఇదీ చదవండి : మరి ఇంత దారుణమా..? మూడేఏళ్లలో ఏడు సార్లు బాదుడు.. టీడీపీ దశల వారీ పోరాటం

    చంద్రబాబుని రాముడి పేరుతో పోల్చడం చాలా అతిగా ఉందన్నారు. చంద్రబాబు ఏ విధంగా రాముడితో సరిపోతాడు..? సొంత మామకి వెన్నుపోటు పొడిచినందుకా..? అని బొత్స ప్రశ్నించారు. హైదరాబాద్ రింగ్ రోడ్డు నిర్మాణం చేసింది వైఎస్ఆర్ అని, చంద్రబాబు కాదని మంత్రి బొత్స అన్నారు. అలాగే రాష్ట్రంలో జరుగుతున్న ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ వైఎస్ఆర్ ప్రారంభించినవే అని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబే అన్ని చేసేస్తే మరి, సొంత కొడుకు నారా లోకేష్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయాడు అని ప్రశ్నించారు. వైసీపీలో 60 శాతం కంటే ఎక్కువమందే ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు బొత్స సత్యనారాయణ.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP cabinet, AP News, Botsa satyanarayana, Chandrababu Naidu, TDP

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు