హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Botsa on Capital: ప్రస్తుతం ఏపీ రాజధాని హైదరాబాదే.. కొత్త చర్చకు తెరలేపిన మంత్రి బొత్స

Botsa on Capital: ప్రస్తుతం ఏపీ రాజధాని హైదరాబాదే.. కొత్త చర్చకు తెరలేపిన మంత్రి బొత్స

అమరావతి, బొత్స సత్యానారాయణ

అమరావతి, బొత్స సత్యానారాయణ

Botsa on Capital: ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదీ.. వైసీపీ అధికారంలో వచ్చినప్పటి నుంచి ఏపీ ప్రజలను వేధిస్తున్న ప్రశ్న ఇది.. విపక్షాలన్నీ అమరావతే రాజధాని అంటోంది. కేంద్రం కూడా అదే చెబుతోంది. నిధులు కూడా విడుదల చేసింది. తాజాగా హైకోర్టు సైతం ఏపీ రాజధాని అమరావతే అని క్లారిటీ ఇచ్చింది. కానీ ప్రభుత్వం మాత్రం మూడు రాజధానులు ఉంటాయని చెబుతూ వస్తోంది. తాజాగా మంత్రి బొత్స మరో చర్చకు తెరలేపారు.

ఇంకా చదవండి ...

Botsa on Capital: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు తొలి రోజే రచ్చ రచ్చగా మారాయి. ఓ వైపు గవర్నర్ బిశ్వభూషణ్

హరిచందన్ ప్రసంగిస్తుండగానే.. తెలుగు దేశం పార్టీ సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. గవర్నర్ ప్రసంగం మధ్యలోనే టీడీపీ వాకౌట్ చేసి

వెళ్లిపోయింది. తరువాత అసెంబ్లీలో టీడీపీ వ్యవహారంపై సీఎం జగన్ సైతం సీరియస్ అయ్యారు. అచ్చెన్నాయుడిపైన నేరుగా ఆయన

సీరియస్ అయ్యారు. తరువాత మీడియా పాయింట్ లో మాట్లాడిన మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ, ఢిల్లీలో

సైతం కొత్త చర్చకు దారి తీశాలా చేశాయి. 2024 వరకు మన రాజధాని హైదరాబాదే అన్నారు ఆయన. దాన్ని ఆధారంగా చేసుకునే

బహుశా కోర్టులు మాట్లాడి ఉంటాయి అన్నారు. ఎందుకంటే.. రాజధానిని మేం గుర్తించిన తర్వాత.. చట్టం చేసి.. పార్లమెంట్‌కు పంపి.. అక్కడ

ఆమోదం పొందిన తర్వాత తెలుస్తుంది అన్నారు. అక్కడితోనే ఆయన ఆగలేదు. అమరావతి, హైదరాబాద్ అని రెండు రాజధానులు

లేవన్నారు. తమ ప్రభుత్వం ప్రకారం అమరావతి అనేది శాసన రాజధాని మాత్రమే అన్నారు. అయితే బొత్స చేసిన ఈ వ్యాఖ్యలు కొత్త

చర్చకు దారితీశాయి.

బొత్స వ్యాఖ్యలు ఎలాంటి రచ్చకు దారి తీస్తుందో చూడాలి.. తెలంగాణ నుంచి కూడా అభ్యంతరాలు ఎదురయ్యే అవకాశం లేకపోలేదు. మరోవైపు ఇప్పటికే అమరావతే రాజధాని అని అక్కడ్నుంచే అన్ని కార్యకలపాలు సాగించాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం  కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో బొత్స చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. శివరామకృష్ణ కమిటీని వేసి రాజధాని నిర్ణయం తీసుకోవాలన్నారు. కానీ చంద్రబాబు నాయుడు, నారాయణ కమిటీ వేసి నిర్ణయం తీసుకున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ ప్రకటన ఏదైనా పార్లమెంట్‌కు పంపలేదని.. కాబట్టి హైదరాబాదే 2024 వరకు రాజధాని అంటూ బాంబ్ పేల్చారు.

ఇదీ చదవండి : అచ్చెన్నాయుడిపై సీఎం సీరియస్.. పెద్దాయనకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్న

శాసనసభ చట్టాలను చేయవద్దంటే ఎలా కుదురుతుందని.. రాజ్యాంగానికి లోబడే వ్యవస్థ అయినా పని చేయాలని ఆయన వ్యాఖ్యానించారు.

ఇది చర్చనీయాంశమని.. దీనిపై చర్చ జరగాలని అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం రాజధాని వ్యవహారం లో చట్టబద్ధంగా

వ్యవహరించలేదన్నారు. మూడు రాజధానులపై మీడియా ప్రశ్నించగా మంత్రి బొత్స ఇలా స్పందించారు.

ఇదీ చదవండి : ఒక్కసారి డాక్టర్ దగ్గరికెళ్తే సరిపోయేది.. చిన్నపాటి నిర్లక్ష్యం ఎంతపని చేసిందో చూడండి..!

అసెంబ్లీ సమావేశాలు ఇప్పుడే ప్రారంభమయ్యాయని.. ఈ నెల 31లోపు అన్ని విషయాలు తెలుస్తాయన్నారు. రాజధానులు కట్టకూడదని

హైకోర్టు ఎక్కడ చెప్పింది..? అని ప్రశ్నించారు. చట్టాలు చేయడానికి శాసనసభ, పార్లమెంట్‌లు ఉన్నాయన్నారు. ఇక్కడ చట్టాలు చేస్తే

రాజ్యాంగ స్పూర్తికి, రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి అనేది తాను ఇదివరకే చెప్పానని గుర్తు చేశారు.టీడీపీ వారికి ఆవేశం ఎక్కువని, క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుంటారన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. టీడీపీ నేతలు ఎప్పుడు ప్రజల కోసం, దీర్ఘకాల నిర్ణయాలు తీసుకోరని విమర్శించారు. చంద్రబాబు తన స్వార్ధం కోసం నిర్ణయాలు తీసుకుంటారని.. ప్రజల కోసం, దీర్ఘకాల నిర్ణయాలు వారు తీసుకోరన్నారు. టీడీపీకి విధి విధానాలు అనేవి లేవని.. రాజకీయ సానుభూతితో అసెంబ్లీకి వచ్చారని మండిపడ్డారు.

First published:

Tags: Amaravati, Andhra Pradesh, AP Assembly, AP News, Botsa satyanarayana, Greater hyderabad, TDP

ఉత్తమ కథలు