తూర్పుగోదావరి జిల్లా జాలిమూడిలో ఇద్దరు మైనర్ల ప్రేమ వ్యవహారం పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది.పోలీసుల కథనం ప్రకారం.. జాలిమూడి గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలిక,ఓ మైనర్ బాలుడు ప్రేమించుకున్నారు.ఇద్దరిది ఒకే సామాజికవర్గం కావడంతో పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. అయితే పెద్దలు మాత్రం వీరి పెళ్లికి అడ్డు చెప్పారు. మైనర్లకు పెళ్లి కుదరదంటూ ఎంత సర్దిచెప్పినా వారు వినలేదు.
అమ్మాయి ప్రస్తుతం ఆమె మేనమామ ఇంటి వద్ద ఉంటోంది. ప్రేమ పెళ్లికి మేనమామ ఒప్పుకోకపోవడంతో ఏకంగా అబ్బాయి ఇంటికి వెళ్లిపోయింది. దీంతో గొడవ జరుగుతుందేమోనని భయపడ్డ అబ్బాయి తల్లిదండ్రులు 100కి డయల్ చేసి పోలీసులను పిలిపించారు. పోలీసులు వచ్చి అమ్మాయి,అబ్బాయి బర్త్ సర్టిఫికెట్లు పరిశీలించారు. మరికొద్ది నెలల్లో ఇద్దరి మైనారిటీ తీరిపోతుండటంతో.. అప్పటిదాకా ఆగాలని సూచించారు. పోలీసుల సూచనను అమ్మాయి,అబ్బాయి ఒప్పుకోవడంతో గొడవ సద్దుమణిగింది.
Published by:Srinivas Mittapalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.