అన్నాచెల్లెళ్ల ప్రేమ...బాలికను చితకబాదిన ఊరి పెద్దలు

అక్కడ అంతమంది ఊరి జనాలున్నా ఏ ఒక్కరూ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. మైనర్ బాలికను అంతలా కొడుతుంటే సినిమా చూసినట్లు చూశారు.

news18-telugu
Updated: August 16, 2019, 10:49 PM IST
అన్నాచెల్లెళ్ల  ప్రేమ...బాలికను చితకబాదిన ఊరి పెద్దలు
మైనర్ బాలికపై దాడి
  • Share this:
అబ్బాయి మేజర్..అమ్మాయి మైనర్..! ఇద్దరూ దళితులే..! వరసకు అన్నాచెల్లెల్లు..! కానీ వరసను పక్కనబెట్టి ప్రేమలో పడ్డారు. కొంతకాలంగా వీరి ప్రేమ వ్యవహారం సాగుతోంది. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఐనా వీరిలో మార్పు రాలేదు. ఇటీవలే ఇంటి నుంచి పారిపోయి పెళ్లిచేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఎలాగోలా వారి ఆచూకీ తెలుసుకున్న గ్రామస్తులు ఇద్దరినీ ఊరికి పిలిపించి పంచాయితీ పెట్టారు. ఈ క్రమంలో మైనర్ బాలికపై పంచాయతీ పెద్దలు తన ప్రతాపం చూపారు. గ్రామస్తులంతా చూస్తుండగానే గొడ్డును బాదినట్లు చావగొట్టారు. అనంతపురం జిల్లా గుమ్మఘట్ట మండలం కేపీదొడ్డి గ్రామంలో ఈ ఘటన జరిగింది.

పంచాయితీ పెద్ద, గ్రామ మాజీ ఎంపీటీసీ మైనర్ బాలికను టార్గెట్ చేసి రెచ్చిపోయాడు. చెంప చెల్లుమనిపించి..అనంతరం కర్రలతో వీపులపై వాతలొచ్చేలా కొట్టాడు. అంతటితో ఆగకుండా బాలిక ముఖంపై కాలితో తన్ని అమానుషంగా ప్రవర్తించాడు. ఆ యువకుడిపైనా కర్రలతో దాడి చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అక్కడ అంతమంది ఊరి జనాలున్నా ఏ ఒక్కరూ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. మైనర్ బాలికను అంతలా కొడుతుంటే సినిమా చూసినట్లు చూశారు. వాళ్లు చేసింది ఒకవేళ తప్పే అయినా..కూర్చొని మాట్లాడాలి. పోలీసులతో కౌన్సెలింగ్ ఇప్పించాలి. కానీ ఇవన్నీ పక్కనబెట్టి..చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని రెచ్చిపోయి ప్రవర్తించారు. ఈ ఘటనపై ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి.


First published: August 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...