ఈ సమాజంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. పోలీసులు చర్యలు తీసుకుంటున్నా.. కఠిన చట్టాలు ఉన్నా.. కోర్టులు శిక్షలు వేస్తున్నా.. కామాంధుల్లో మార్పు రావడం లేదు. ఒంటరిగా కనిపించే మైనర్ బాలికల నుంచి ముసలమ్మల వరకు.. ఆడవారిపై అత్యాచారాలు కొనసాగుతున్నాయి. విద్యాలయాలు, ఆసుపత్రులు, ప్రయాణించే వాహనాలు, కొలువు చేసే చోటు అనే భేదం లేకుండా కామాంధులు చెలరేగిపోతున్నారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడి కామవాంఛ తీర్చుకుంటున్నారు. చివరకు దైవ కార్యక్రమాల్లోనూ ఆడవారిని వదిలిపెట్టడం లేదు. తాజాగా తిరుపతి (Tirupati) జిల్లాలో ఘోరం జరిగింది. వినాయక నిమజ్జనంలో పాల్గొనేందుకు వచ్చిన ఓ మైనర్ బాలికపై కొందరు దుండగులు అత్యాచారానికి (Gang Rape on Minor Girl) పాల్పడ్డారు. ఆమెకు మత్తు మందు ఇచ్చి.. అఘాయిత్యానికి ఒడిగట్టారు.
తిరుపతి జిల్లాలోని ఎంఆర్ రాజుల కంట్రిగ గ్రామంలో గురువారం వినాయక నిమజ్జనం సదర్భంగా ఊరేగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు గ్రామస్థులు. ఆ ఊరేగింపును చూసేందుకు గ్రామ ప్రజలంతా ఇంటి నుంచి బయటకు వచ్చారు. స్వామి వారి అలంకరణ, సాంస్కృతిక కార్యక్రమాలను తిలకిస్తున్నారు. అందరిలాగే ఓ మైనర్ బాలిక కూడా బయటకు వచ్చింది. ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఆ బాలికపై కొందరు యువకులు కన్నేశారు. జనం మధ్యలో దూరి.. ఎవరి కంటా పడకుడా.. ఆమెకు మత్తు ఇంజక్షన్ ఇచ్చాడు. చీమ కుట్టినట్లు ఉండటంతో ఆ బాలిక పెద్దగా పట్టించుకోలేదు. కొన్ని నిమిషాల తర్వాత ఆమె మత్తులోకి వెళ్లింది. అనంతరం కామోన్మాదులు ఆమెను పక్కనే ఉన్న చెట్టు పొదల్లోకి తీసుకెళ్లారు. ఒకరి తరువాత మరొకరుగా అత్యాచారం చేసినట్లు సమాచారం.
కొన్ని గంట తర్వాత స్పృహ నుంచి కోలుకున్న బాలికకు.. తాను ఎక్కడ ఉందో అర్థం కాలేదు. అక్కడున్న పరిస్థితులు చూసి ఘోరం జరిగిందని తెలుసుకుంది. ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి..బోరున విలపించింది. తమ కూతురికి జరిగిన అన్యాయాన్ని చూసి పేరెంట్స్ కంటతడి పెట్టుకున్నారు. బాలిక తల్లి, అమ్మమ్మ కేవీపురం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. బాలికపై ముగ్గురు యువకులు అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ప్రస్తుతం ఆ నిందితులు పరారీలో ఉన్నట్లు సమాచారం . నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. బాలిక ఆరోగ్య పరిస్థతి మెరుగ్గానే ఉన్నట్లు తెలుస్తోంది. ఆమెకు స్వల్పగాయాలు కావడంతో బాధితురాలిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందజేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. అమ్మాయి జీవితాన్ని నాశనం చేసిన ఆ రాక్షసులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Minor rape, Rape case, Tirupati