టెన్షన్.. టెన్షన్.. ఒంగోలులో భూప్రకంపనలు..

ప్రతీకాత్మక చిత్రం

ఈరోజు ఒంగోలుతో పాటు జార్ఖండ్, కర్ణాటక ప్రాంతాల్లో భూమి కంపించింది. ఉదయం 6.55 గంటల సమయంలో జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో భూమి కంపించగా, రిక్టర్ స్కేలుపై 4.7గా తీవ్రత నమోదయ్యింది.

  • Share this:
    ఒంగోలులో భూమి స్వల్పంగా కంపించడంతో ప్రజల్లో టెన్షన్ మొదలయ్యింది. ఉదయం 10.15 గంటలకు ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని శర్మ కాలేజీ, అంబేద్కర్ భవన్, ఎన్జీఓ కాలనీ, సుందరయ్య భవన్ రోడ్డు తదితర ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా భూమి కంపించడంతో ఏం జరుగుతుందో తెలియక ఇళ్లలో నుంచి బయటకు పరుగులు పెట్టారు. అయితే భూమి కొద్ది సెకన్ల పాటు కంపించిందని స్థానికులు చెబుతున్నారు. అయితే ఈరోజు ఒంగోలుతో పాటు జార్ఖండ్, కర్ణాటక ప్రాంతాల్లో భూమి కంపించింది. ఉదయం 6.55 గంటల సమయంలో జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో భూమి కంపించగా, రిక్టర్ స్కేలుపై 4.7గా తీవ్రత నమోదయ్యింది. కర్ణాటకలోని హంపిలో రిక్టర్ స్కేలుపై 4 తీవ్రతతో భూమి కంపించిందని అధికారులు తెలిపారు. అయితే ఎక్కడా ఏలాంటి నష్టం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలావుంటే.. నెల రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో భూప్రకంపనలు వస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు ఎక్కడా పెద్దగా నష్టం సంభవించలేదు.
    Published by:Narsimha Badhini
    First published: