హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Minister Roja: ఆమె చేతిలో రోజాకు ఓటమి తప్పదా ? అంత సీనుందా ?

Minister Roja: ఆమె చేతిలో రోజాకు ఓటమి తప్పదా ? అంత సీనుందా ?

మంత్రి రోజా (ఫైల్)

మంత్రి రోజా (ఫైల్)

రోజాపై గట్టి అభ్యర్థిని పోటీలోకి దించాలని చంద్రబాబు ఆలోచించుకుంటున్నారు. రోజాకు గట్టి పోటీ ఇచ్చి బంపర్ మెజార్టీని ఇచ్చే వాారికి టికెట్ ఇవ్వాలని చంద్రబాబు రెడీ అవుతున్నారు.

రోజా.. అంటే ఫైర్ బ్రాండ్. ఎక్కడైనా ఆమె టాలెంట్ వేరు. వెండితెర అయినా.. రాజకీయం అయినా ఒంటి చెత్తే గడగడలాడిస్తోంది. ఓ వైపు సినిమాలు చేస్తూనే... ఇన్నాళ్లు పాలిటిక్స్‌ను కూడా రన్ చేసింది. రోజా రాజ‌కీయంగా స‌క్సెస్‌ఫుల్ పొలిటీషియ‌న్‌గా గుర్తింపు పొందింది. అయితే తాజాగా మంత్రి పదవి రావడంతో.. సినిమాలకు దూరం అవుతున్నానని రోజా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో రోజాకు ఏపీ పర్యాటక శాఖ అభివృద్ధి మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. అయితే ఇప్పుడు రోజాకు సొంత నియోజకవర్గంలో ఈసారి గట్టి పోటీ తప్పదన్న వార్తలు వినిపిస్తున్నాయి. రోజా నియోజకవర్గం నగరి. ఇప్పుడు నగరి నియోజకవర్గ రాజకీయాలు వేడెక్కాయి. అక్కడ రోజాపై పోటీ చేసుందుకు ఓ సెలబ్రిటీ.. మరో పొలిటికల్ ఫ్యామిలీ పోటీ పడుతున్నాయి. దీంతో ఇప్పుడు టికెట్ ఎవరికి ఇవ్వాలనేది చంద్రబాబుకు తలనొప్పిగా మారింది.

రోజా నగరి నియోజకవర్గంలో తనదైన ముద్ర వేసుకున్నారు. గత రెండు ఎన్నికల్లో కూడా ఆమె అక్కడ గెలుస్తూ వచ్చింది. ఇప్పుడు మంత్రిగా కూడా అయ్యారు. దీంతో నగరిలో రోజాకు చెక్ పెట్టేందుకు చంద్రబాబు పావులు కదుపుతున్నారు. అయితే అది సినీ గ్లామర్‌? లేక సీనియారిటీ అన్న విషయమే తేల్చుకోలేకపోతున్నారు. నగరి నియోజకవర్గంలో మొదట్నుంచి బలమైన నాయకుడు ఉన్నారు. దీంతో అప్పట్లో రోజాను పక్కన పెట్టి నమ్మకమైన నాయకుడికి చంద్రబాబు సీటు ఇచ్చారు. దీంతో రోజా నగరి టికెట్ తనకు రాదని ..టీడీపి నుంచి బయటపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ తర్వాత వైసీపీ గూటికి చేరారు రోజా. ఇప్పుడు సినీ గ్లామర్ ఉన్న మహిళా నేత తెరపైకి వచ్చింది. మరొవైపు సీనియారిటీ కూడా టికెట్ కోసం వేచి చూస్తుంది. దీంతో ఇప్పుడు ఎవరికి టికెట్ ఇవ్వాలని ఆలోచనలో పడ్డారు చంద్రబాబు.

సినీ గ్లామరా ? సీనియారిటీనా? ఇద్దరిలో ఎవరికి టికెట్ ఇవ్వాలి? ఎవరు అయితే రోజాను ఢీకొట్టి బంపర్ మేజార్టీతో గెలుస్తారు ప్రస్తతుం ఈ సవాళ్లు చంద్రబాబు ముందు ఉన్నాయి. అయితే నగరి నియోజకవర్గం రోజా అడ్డా అయినా.. అక్కడ ఇప్పుడు సినీ గ్లామర్ ఉన్న మహిళ ఇప్పుడు తెరపైకి వచ్చింది.ఆమె ఎవరో కాదు.. ప్రముఖ నటి వాణి విశ్వనాథ్. వాని విశ్వనాథ్... 2019 ఎన్నికలకు ముందే టీడీపీలో చేరారు. అయితే ఆమె పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నా.. అప్పుడప్పుడు హల్ చల్ చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా వాణి విశ్వనాథ్.. రోజాపై పోటీకి సై అంటోంది. వచ్చే ఎన్నికల్లో రోజాపై పోటీ చేసి తప్పకుండా గెలుస్తానంటోంది. నగరి నియోజకవర్గంలో ఆమె పర్యటించింది. నగరిలో తన అమ్మమ్మ నర్సుగా పనిచేసిందన్న విషయం గుర్తు చేసింది. నగరిలో తమిళ సంస్కృతి ఉందని అందుకే ఇక్కడ పోటీ చేస్తానని చెప్పుకొచ్చింది.

మరోవైపు నగరి టికెట్ మాదే అని గాలి ముద్దు కృష్ణమ నాయుడు కుటుంబం కూడా పోటీ పడుతుంది. గాలి భార్యతో పాటు.. ఇద్దరు కుమారుల మధ్య నగరి టికెట్ కోసం భారీగా పోటీ నెలకొంది. దీంతో ఈ ముగ్గురు టికెట్ కొసం తన్నుకుంటుంటే.. అటు వాణి విశ్వనాథ్ కూడా టికెట్ ఎగరేసుకుపోయే అవకాశం కూడా లేకపోలేదు. అప్పట్లో టీడీపీలో తెలుగు మహిళా అధ్యక్ష పదవిలో ఉన్న రోజానే చంద్రబాబు పట్టించుకోకుండా నగరి టికెట్‌ను గాలి కుటుంబానికి ప్రయారిటీ ఇచ్చారు. మరి ఇప్పుడు గాలి ముద్దు కృష్ణమ నాయుడు లేరు. మరి వారి కుమారులకు పార్టీని గెలిపించే సత్తా ఉందా లేదా? అన్న విషయాలు కూడా లెక్కలేసుకుంటున్నారు చంద్రబాబు. మొత్తం మీద చంద్రబాబు.. నగరిలో రోజాపై పోటీకి ఎవరిని దింపుతారన్న ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.

First published:

Tags: Minister Roja, Vani Viswanath

ఉత్తమ కథలు