హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Minister Roja: వారాహి కాదు.. నారాహి.. పవన్ శ్వాస గురించి కేసీఆర్, కేటీఆర్ చెప్పాలి.. మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు

Minister Roja: వారాహి కాదు.. నారాహి.. పవన్ శ్వాస గురించి కేసీఆర్, కేటీఆర్ చెప్పాలి.. మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు

మంత్రి రోజా (ఫైల్)

మంత్రి రోజా (ఫైల్)

Minister Roja: పవన్ కళ్యాణ్ ప్రచారం రథంపై మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. జనసేనాని పవన్ కళ్యాణ్ ఘాటుగా ట్విట్టర్ వేదికగా రిప్లై ఇస్తున్నా.. మంత్రులు ఎదురుదాడి ఆగడం లేదు. తాజాగా మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు.. అది వారాహినా.. నారాహినా అంటూ ప్రశ్నించారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Nagari, India

Minister Roja: ఆంధ్రప్రదేశ్ (Andhra Prades) రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అన్ని పార్టీలు ఎన్నికల మూడ్ లో ఉన్నాయి. దీంతో పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా జనసేన (Janasena) అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) టార్గెట్ గా వైసీపీ మంత్రులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో ప్రచారం కోసం.. ప్రత్యేక వాహనాన్ని కూడా రూపొందించారు. దీనికి ఈ వాహనానికి వారాహిగా పేరు పెట్టారు. ఈ వాహనం రంగుపై ఇప్పటికే పొలిటికల్‌ హీట్‌ నెలకొంది. ఆలివ్‌ గ్రీన్‌ రంగు ఎలా వినియోగిస్తారంటూ ఏపీ అధికార పార్టీ వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. దానికి కౌంటర్ గా పవన్ కూడా ఘాటుగా సమాధానం చెప్పారు. ఏ రంగు వేసుకోవాలి అన్నది కూడా వైసీపీనే చెబుతుందా..? ఆఖరి శ్వాస తీరుకోవాలి అన్నా వైసీపీ అనుమతి కావాలంటూ అంటూ తీవ్రంగా మండిపడ్డారు. ట్విట్టర్ (Twitter) వేదికగా వరుస ప్రశ్నలు సధించారు. దీంతో పవన్‌ కల్యాణ్‌ ఎన్నికల రథం వారాహిపై తాజాగా.. ఏపీ మంత్రి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు.

పవ‌న్ కళ్యాణ్ వాహ‌నం వారాహియా.. నారాహియా అన్న విషయం ప్రజలందరికీ తెలుసంటూ తనదైన స్టైల్లో సెటైర్లు వేశారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ వాహ‌నం చూసి బ‌య‌ప‌డుతున్నామ‌ని నాదెండ్ల మ‌నోహ‌ర్ చెప్పడం హాస్యా్స్పదమన్నారు. 151 సీట్లు గెలుచుకున్న సీఎం జ‌గ‌న్.. రెండు చోట్ల ఓడిన ప‌వ‌న్‌ కల్యాణ్‌ను చూసి ఎందుకు భ‌య‌ప‌డ‌తారంటూ రోజా పేర్కొన్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎవ‌రి మీద యుద్ధం చేస్తున్నాడో ఆయ‌న‌కే క్లారిటీ లేదంటూ పేర్కొన్నారు. హైద‌రాబాద్ లో ఉంటున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ శ్వాస పీల్చుకోవాలా వ‌ద్దా అని కేసీఆర్‌, కేటీఆర్‌ల‌ను అడగాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

పవ‌న్ క‌ల్యాన్‌కు ఏపీ మీద కాదు.. చంద్రబాబు మీదే ప్రేమ‌ అంటూ ఫైర్ అయ్యారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో 175 సీట్లు గెలిచి చిల్లర రాజ‌కీయాలు చేసే వాళ్లను హైద‌ర‌బాద్ కు త‌రిమేస్తారంటూ పేర్కొన్నారు. అమ‌ర‌రాజ కంపెనీ వ్యాపార వృద్ధికే హైద‌రాబాద్‌లో ఇన్వెస్ట్మెంట్ పెట్టిందన్నారు. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు హెరిటేజ్ కంపెనీ 15 వేల కోట్లు హైద‌రాబాద్‌లో పెట్టుబ‌డి పెట్టిందని గుర్తుచేశారు. అంటే చంద్రబాబు భార్యకి, కోడ‌లికి ఆయ‌న‌పై నమ్మకం లేన‌ట్టా అని ప్రశ్నించారు.

ఇదీ చదవండి : జీవీఎల్ నరసింహారావుకు తృటిలో తప్పిన ప్రమాదం.. ఏం జరిగిందంటే..? వీడియో వైరల్..!

అమ‌ర‌రాజ ఫ్యాక్టరీ విష‌యంలో బోడిగుండుకు, మోకాలికి లింకు పెడితే మ‌ర్యాద ఉండ‌దంటూ మంత్రి రోజా టీడీపీ , జనసేన నేతలకు వార్నింగ్ చేశారు.. మంత్రులందరూ పవన్ పై అదే స్టైల్లో విమర్శలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఆరాటం అంతా ఎన్నికల్లో గెలవడం కోసం కాదు.. చంద్రబాబును గెలిపించడానికే అని విమర్శలు సెటైర్లు వేస్తున్నారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Minister Roja, Rk roja

ఉత్తమ కథలు