హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Minister Roja: ఫ్లూటు బాబు ముందు ఊదు.. జగన్ ముందు కాదు.. అక్కడ ఉన్నది జ"గన్".. రోజా సంచలన వ్యాఖ్యలు

Minister Roja: ఫ్లూటు బాబు ముందు ఊదు.. జగన్ ముందు కాదు.. అక్కడ ఉన్నది జ"గన్".. రోజా సంచలన వ్యాఖ్యలు

బాలయ్యకు రోజా సినిమా స్టైల్ వార్నింగ్

బాలయ్యకు రోజా సినిమా స్టైల్ వార్నింగ్

Minister Roja: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు అంశంపై నటుడు, ఎమ్మెల్యే బాలయ్య చేసిన ట్వీట్ దుమారం ఆగడం లేదు. మంత్రులంతా ఎదురుదాడికి దిగారు. తాజాగా మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Nagari, India

  Minster Roja on Balayya: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు అంశం కుదిపేస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఆ పేరును డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్శిటీగా మారుస్తూ సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ బిల్లును కూడా అసెంబ్లీ ఆమోదించింది. అప్పుడు మొదలైన  వివాదం ఇప్పుడు మరింత ముదిరింది.  ముఖ్యంగా నటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎంట్రీ ఇచ్చారు. చాలా ఘాటుగా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. మార్చెయ్యటానికీ తీసెయ్యటానికి NTR అన్నది పేరుకాదు.. ఓ సంస్కృతి.. ఓ నాగరికత.. తెలుగుజాతి వెన్నెముక.. తండ్రి గద్దెనెక్కి ఎయిర్ పోర్ట్ పేరు మార్చాడు.. కొడుకు గద్దెనెక్కి యూనివర్సిటీ పేరు మారుస్తున్నాడు.. మిమ్మల్ని మార్చటానికి ప్రజలున్నారు.. పంచభూతాలున్నాయ్ తస్మాత్ జాగ్రత్త… అక్కడ ఆ మహనీయుడు పెట్టిన భిక్షతో బతుకుతున్న నేతలున్నారు.. పీతలున్నారు.. విశ్వాసంలేని వాళ్లని చూసి కుక్కలు వెక్కిరిస్తున్నాయ్.. శునకాలముందు తలవంచుకు బతికే సిగ్గులేని బతుకులు అంటూ ఓ రేంజ్ లో వార్నింగ్ ఇచ్చారు.

  అయితే బాలయ్య చేసిన విమర్శలు చూస్తే.. అందులో మంత్రి రోజా కూడా ఉంటారు. ఎందుకంటే.. టీడీపీ నుంచి వెళ్లినవాళ్లు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. దీంతో ఆ విమర్శలపై మంత్రి రోజా ఘాటుగా స్పందించారు. బాలయ్య ప్లూటు బాబు ముందు ఊదు... జ‌గ‌న్ అన్న ముందు కాదు, అక్కడ ఉంది రీల్ సింహం కాదు, జ"గన్" అనే రియల్ సింహం అంటూ బాలయ్యకు కౌంటర్ ఇచ్చారు.

  ఇక దబిడిదిబిడే అంటూ మంత్రి రోజా బాలయ్యకు సంచలన కౌంటర్ ఇచ్చారు. అయితే పంచ్ డైలాగ్ లు పేల్చడంలో రోజా ఎప్పుడు ముందే ఉంటారు. అందుకే ఆమెకు ఫైర్ బ్రాండ్ అనే ఇమేజ్ ఉంది. సాధారణంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు , నారా లోకేష్ లపైనే ఆమె ఎక్కువగా పంచ్ లు వేస్తుంటారు. అప్పుడప్పుడు పవన్ పైనా సెటైర్లు వేస్తారు. ఇప్పుడు బాలయ్యను సైతం టార్గెట్ చేశారు..

  ఇదీ చదవండి : తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం.. డాక్టర్ సజీవదహనం.. ఇద్దరు పిల్లలు మృతి.. కారణం ఏంటంటే?

  ఇప్పటికే బాలయ్య చేసిన ట్వీట్ పై మంత్రులు అంతా ఎదురు దాడికి దిగారు. మరి వీటిపై బాలయ్య ఎలాంటి కౌంటర్ ఇస్తారో చూడాలి.. ఒక్క ట్వీట్ తో వివాదానికి ఎండ్ కార్డ్ వేస్తారో.. లేదా మరోసారి రీసౌండ్ వచ్చేలా సమాధానాలు చెబుతారో చూడాలి..

  Published by:Nagabushan Paina
  First published:

  ఉత్తమ కథలు