అందుకే జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్... ఏపీ మంత్రి వివరణ

అందుకే జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్... ఏపీ మంత్రి వివరణ

జేసీ ప్రభాకర్ రెడ్డి(ఫైల్ ఫోటో)

కాసుల కోసం జేసీ ప్రభాకర్ రెడ్డి కక్కుర్తి పడ్డారని... ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారని మంత్రి పేర్ని నాని ఆరోపించారు.

 • Share this:
  జేసీ ట్రావెల్స్ అక్రమాలపై అన్ని సాక్ష్యాలు ఉన్నాయని ఏపీ రవాణాశాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. మీడియా సమక్షంలో ఆధారాలతో సహా చర్చకు సిద్ధమని ఆయన ప్రకటించారు. కాసుల కోసం జేసీ ప్రభాకర్ రెడ్డి కక్కుర్తి పడ్డారని... ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారని పేర్ని నాని ఆరోపించారు. అశోక్ లేలాండ్ దగ్గర మిగిలిపోయిన బీఎస్ 3 లారీ ఛాసిస్‌లను జేసీ ప్రభాకర్ రెడ్డి కొన్నారని... బీఎస్ 3 వాహనాలను బీఎస్ 4 వాహనాలుగా రిజిస్ట్రేషన్ చేయించారని అన్నారు. నాగాలాండ్ కోహిమాలో చాలా వాహనాలను రిజిష్ట్రేషన్ చేయించారని... ఎన్ఓసీ ద్వారా ఆ వాహనాలను ఏపీకి తెచ్చారని వివరించారు.

  లారీలను బస్సులుగా మార్చి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారని మంత్రి పేర్ని నాని అన్నారు. బోగస్ ఎన్‌ఓసీలను సృష్టించడంపైనా కేసు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు నిబంధనలను జేసీ ఉల్లంఘించారని తెలిపారు. టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నామని చంద్రబాబు ఆరోపిస్తున్నారని... అక్రమాలపై ఆధారాలున్నా చంద్రబాబుకు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. అంతకుముందు శంషాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డితో పాటు అతని తనయుడు జేసీ అస్మిత్ ‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌ నుంచి తాడిపత్రికి వారిని తరలించారు. నేడు జేసీ ప్రభాకర్‌రెడ్డితో పాటు జేసీ అస్మిత్‌రెడ్డిని కోర్టులో హాజరుపర్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
  Published by:Kishore Akkaladevi
  First published:

  అగ్ర కథనాలు