హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

రేపటి నుంచే పెన్షన్ల పంపిణీ... మంత్రి పెద్దిరెడ్డి వెల్లడి

రేపటి నుంచే పెన్షన్ల పంపిణీ... మంత్రి పెద్దిరెడ్డి వెల్లడి

ఫ్రతీకాత్మక చిత్రం

ఫ్రతీకాత్మక చిత్రం

పెన్షన్ లబ్దిదారులకు బయోమెట్రిక్‌కు బదులు పెన్షనర్ల ఫోటోల జియో ట్యాగింగ్‌ను అమలు చేయనున్నట్టు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.

రాష్ట్రంలో వైస్ఆర్ పెన్షన్ కానుకను మే నెల ఒకటో తేదీన లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. కరోనా నిబంధనలను పాటిస్తూనే లక్షలాది మంది పెన్షనర్ల చేతికే ఒకటో తేదీన పెన్షన్ సొమ్మును అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రంలోని మొత్తం 2,37,615 మంది వాలంటీర్లతో పెన్షన్ సొమ్మును పంపిణీ చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 58.22 లక్షల మందికి పెన్షన్లు అందించనున్నట్టు పేర్కొన్నారు. వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ పంపిణీ కోసం ఇప్పటికే ప్రభుత్వం రూ.1421.20 కోట్లను విడుదల చేసింది.

లబ్దిదారులకు బయోమెట్రిక్‌కు బదులు పెన్షనర్ల ఫోటోల జియో ట్యాగింగ్‌ను అమలు చేయనున్నట్టు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. లాక్‌డౌన్‌తో ఇతర ప్రాంతాల్లో ఉన్న వారికి పోర్టబిలిటీ ద్వారా పెన్షన్లు అందజేయనున్నట్టు మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులతో పాటు గుర్తింపు పొందిన వ్యాధులతో బాధపడుతున్న వారికి కూడా నెల ఒకటో తేదీనే పెన్షన్ సొమ్ము అందిస్తామని... ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న హెచ్ఐవి, డయాలసిస్ పెషంట్లకు డిబిటి విధానంలో పెన్షన్ సొమ్మును జమ చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

First published:

Tags: Andhra Pradesh, Peddireddy Ramachandra Reddy, Ysr pension scheme

ఉత్తమ కథలు