మాజీ మంత్రి నారాయణ (Narayana)కు ఏపీ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. చిత్తూరు కోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు తీర్పును సవాల్ చేస్తూ నారాయణ (Narayana) హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై నేడు విచారణ చేపట్టిన కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. తీర్పు వెల్లడించే వరకు తదుపరి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. అలాగే ఆ తీర్పుపై చిత్తూరు కోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు ఉత్తర్వులు పక్కనబెట్టాలని ఆదేశించింది. దీనితో నారాయణ బెయిల్ కొనసాగనుంది.
కాగా ఈ ఏడాది పదో తరగతి పరీక్షల నిర్వహణ సమయంలో పలు చోట్ల ప్రశ్నాపత్రాలు లీక్ కావడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రశ్నా పత్రాల లీక్ పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ఆ సమయంలో ప్రశ్నాపత్రాలను నారాయణ (Narayana) విద్యాసంస్థల్లో పని చేసే ఓ ఉపాధ్యాయుడే లీక్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఎగ్జామ్ మొదలైన గంట సేపు అయిన తరువాత నిందితుడు ప్రశ్న పత్రాన్ని సెల్ ఫోన్ తో ఫోటో తీసి సోషల్ మీడియా (Sociaal media)లో పోస్ట్ చేశాడని పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి నారాయణ విద్యాసంస్ధలకు వ్యవస్థాపకులు నారాయణ (Narayana)ను, అలాగే కొంతమంది సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఆ తరువాత పోలీసులు నారాయణ (Narayana)ను చిత్తూరు కోర్టులో హాజరుపరిచారు. అనంతరం కోర్టు విచారణ చేసి నారాయణ (Narayana)కు బెయిల్ ఇచ్చింది. దీనిని సవాల్ చేస్తూ చిత్తూరు వన్ టౌన్ పోలీసులు కోర్టు (Court) లో పిటీషన్ దాఖలు చేశారు. నారాయణ (Narayana)కు బెయిల్ ఇవ్వడంపై పోలీసుల పిటీషన్ ను సోమవారం చిత్తూరు జిల్లా తొమ్మిదో అదనపు కోర్టు విచారణ చేపట్టింది. ఈ మేరకు అయన బెయిల్ ను రద్దు చేసింది. నవంబర్30వ తేదీలోపు కోర్టుకు హాజరుకావాలని నారాయణ (Narayana)ను కోర్టు (Court) ఆదేశించింది.
10వ తరగతి ప్రశ్నా పత్రాల లీక్ కు నారాయణ (Narayana)కు సంబంధం లేదని అతని తరపున న్యాయవాదులు కోర్టు (Court) లో వాదనలు వినిపించారు. 2011లోనే నారాయణ (Narayana) ట్రస్ట్ కు నారాయణ రాజీనామా చేశారని, మేనేజ్ మెంట్ కి నారాయణ (Narayana)కు సంబంధం లేదని గతంలో లాయర్లు వాదనలు వినిపించగా చిత్తూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.. ఇద్దరి పూచ్చికత్తుపై రూ.లక్ష చొప్పున ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కానీ దీనిపై పోలిసులు పిటీషన్ వేయగా బెయిల్ ను రద్దు చేస్తూ చిత్తూరు జిల్లా తొమ్మిదో అదనపు కోర్టు (Court) ఆదేశాలు ఇచ్చింది. దీనిని సవాల్ చేస్తూ నారాయణ హైకోర్టును ఆశ్రయించారు. చిత్తూరు జిల్లా కోర్టు ఆదేశాలు పక్కకు పెట్టి తదుపరి తీర్పు వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ap, Ap minister narayana, AP News