news18-telugu
Updated: May 29, 2020, 2:06 PM IST
సీఎం కేసీఆర్, కేటీఆర్ (ఫైల్ ఫోటో)
తన తండ్రి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరుకు కొత్త నిర్వచనం చెప్పారు ఆయన తనయుడు, తెలంగాణ మంత్రి కేటీఆర్. కేసీఆర్.. తన పేరును K-కాల్వలు, C-చెరువులు, R-రిజర్వాయర్లు సార్థకం చేసుకున్నారని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. తెలంగాణలో కాల్వలు, చెరువులు, రిజర్వాయర్లు జలకళను సంతరించుకున్నాయనే ఉద్దేశంతో కేటీఆర్ ఈ విధంగా స్పందించారు. నేడు కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజక్ట్‌లో భాగమైన కొండపోచమ్మ రిజర్వాయర్ పంప్‌హౌస్‌ను కేసీఆర్ ప్రారంభించారు. దీనిపై స్పందించిన కేటీఆర్.. ప్రపంచంలోనే అతిపెద్ద బహుళార్ధ సాధక ఎత్తిపోతల పథకం కాళేశ్వరాన్ని దేశంలోనే యువ రాష్ట్రమైన తెలంగాణ కేవలం మూడేళ్లలోనే పూర్తి చేసిందని తెలిపారు.
మేడిగడ్డ నుంచి కొండపోచమ్మ వరకు, సముద్ర మట్టానికి 82 మీటర్ల ఎత్తు నుంచి 618 మీటర్ల ఎత్తు వరకు నీటిని చేరవేశామని కేటీఆర్ వివరించారు. కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ ద్వారా 2.8 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే కాకుండా.. త్వరలోనే కేశవపురం రిజర్వాయర్ ద్వారా హైదరాబాద్ తాగునీటి అవసరాలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని అన్నారు. దూరదృష్టితో భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టులు నిర్మిస్తున్న కేసీఆర్‌కు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
Published by:
Kishore Akkaladevi
First published:
May 29, 2020, 1:59 PM IST