Home /News /andhra-pradesh /

MINISTER GUDIVADA AMARNATH STRONG COUNTER TO NARA LOKESH ON NEW INDUSTRIAL PROJECTS UMG

ఏపీలో కొత్త కంపెనీల గోల.. ఆ క్రెడిట్ మాదంటే మాదీ.. వైసీపీ-టీడీపీ మధ్య మాటల యుద్ధం

ఏపీలో కంపెనీలు తెచ్చింది మేము.. కాదు మేమంటున్న నేతలు

ఏపీలో కంపెనీలు తెచ్చింది మేము.. కాదు మేమంటున్న నేతలు

ఆంధ్రప్రదేశ్‌ (లూ)లో అధికార, ప్రతిపక్షాల మధ్య నిత్యం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. ఇప్పుడు ఆ అగ్నికి ఏటీసీ టైర్స్ (లొడ ొోిాత) కంపెనీ కాస్తంత ఆజ్యం పోసినట్లయింది. రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న కొత్త కంపెనీ క్రెడిట్ తమదంటే తమదంటూ అధికార వైసీపీ (YSRCP), ప్రతిపక్ష టీడీపీ (TDP) మధ్య ఇప్పుడు మాటల యుద్ధం కొనసాగుతోంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) నిన్న సీఎం జగన్‌ (YS Jagan)ను టార్గెట్ చేస్తే.. ఇవాళ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ లోకేశ్‌‌కి కౌంటర్ ఇచ్చారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Tadepalle, India
  ఆంధ్రప్రదేశ్‌ (AP)లో అధికార, ప్రతిపక్షాల మధ్య నిత్యం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. ఇప్పుడు ఆ అగ్నికి ఏటీసీ టైర్స్ (ATC TYRES) కంపెనీ కాస్తంత ఆజ్యం పోసినట్లయింది. రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న కొత్త కంపెనీ క్రెడిట్ తమదంటే తమదంటూ అధికార వైసీపీ (YSRCP), ప్రతిపక్ష టీడీపీ (TDP) మధ్య ఇప్పుడు మాటల యుద్ధం కొనసాగుతోంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) నిన్న సీఎం జగన్‌ (YS Jagan)ను టార్గెట్ చేస్తే.. ఇవాళ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ లోకేశ్‌‌కి కౌంటర్ ఇచ్చారు. మొత్తానికి ఇరు పార్టీలు నూతన కంపెనీల క్రెడింట్ మాదంటే మాదంటూ మైక్‌ల ముందు ప్రసంగాలకు దిగాయి.

  అనకాపల్లిజిల్లా అచ్యుతాపురంలో ఏపీ ఎస్‌ఈజెడ్‌లో ఏటీసీ టైర్స్‌ ఏపీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఫస్ట్‌ ఫేజ్‌ను మంగళవారం ప్రారంభించారు. అనంతరం మరో 8 కంపెనీలకు భూమి పూజ నిర్వహించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మాట్లాడుతూ... కంపెనీ ప్రతినిధులు 2020 సెప్టెంబరులో ప్రభుత్వం దగ్గరకు వచ్చారని.. అక్కడ నుంచి చకచకా అన్ని రకాలుగా మద్దతు ఇచ్చే కార్యక్రమం చేశామని తెలిపారు. అదేవిధంగా ఫిబ్రవరి 2021లో పనులు ప్రారంభించి కేవలం 15 నెలల కాలంలోనే ఫ్యాక్టరీ ఉత్పత్తిలోకి వచ్చిందని వివరించారు. మొదటి దశ, రెండో దశ కలిపి మొత్తం 3200 మందికి ఉపాధి కల్పిస్తున్నారని సీఎం తెలిపారు.

   ఇదీ చదవండి: అతి త్వరలోనే జగన్ పెద్ద కుంభకోణం వెలుగులోకి.. పొలిటికల్ బాంబ్ పేల్చిన లోకేశ్


  అయితే, వైఎస్ జగన్ ప్రసంగంపై నారా లోకేశ్ కామెంట్స్ చేశారు. జగన్‌మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు ఏమీ లేవని.. అన్నీ రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన పరిశ్రమలేనంటూ లోకేశ్ వ్యంగ్యంగా విమర్శించారు. జగన్‌మోహన్ రెడ్డికి టైం అయిపోయిందని.. ఇంటికెళ్లే సమయం అతి దగ్గర్లోనే ఉందన్నారు. పెట్టుబడులు పెట్టాలంటే సీఎంఓలో వాటా ఎంత ఇవ్వాలనే చర్చ జరుగుతోందని.. గత మూడేళ్లలో రాష్ట్రానికి తెచ్చిన పరిశ్రమలపై శ్వేతపత్రం విడుదల చేస్తే చర్చకు సిద్ధంగా ఉన్నానంటూ ఆయన సవాల్ విసిరారు. జగన్‌మోహన్ రెడ్డి రిబ్బన్ కటింగ్ చేస్తున్న ప్రతీ పరిశ్రమా తెలుగుదేశం ప్రభుత్వం కృషేనంటూ లోకేష్ చెప్పుకొచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 5లక్షల ఉద్యోగుల కల్పన జరిగిందని జగన్ ప్రభుత్వమే ఒప్పుకుందన్నారు.

  లోకేశ్ కామెంట్లపై ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ స్పందిస్తూ.. ఆంధ్రప్రదేశ్‌లో వస్తున్న పారిశ్రామిక విప్లవాన్ని, వస్తున్న పెట్టుబడులు చూడలేకే లోకేశ్, అచ్చెన్నాయుడు ఆవేదన చెందుతున్నారని విమర్శించారు. కంపెనీ ప్రతినిధులు నిన్న చెప్పిన మాటలను టీడీపీ వాళ్లు వినాలని.. 2020 సెప్టెంబర్, అక్టోబర్‌లో రాష్ట్రానికి వచ్చామని వాళ్లు స్పష్టంగా చెబుతున్నారని మంత్రి తెలిపారు. కేవలం 15 నెలల్లోనే ప్రొడక్షన్ స్టార్ట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ సహకారమే అని వాళ్లు చెబుతుంటే ప్రతిపక్షాలు అర్థం లేని ఆరోపణలు చేస్తున్నాయంటూ విమర్శించారు.

  "కంపెనీలు ప్రారంభించడానికి మా నాన్నకు సమయమే ఉండటం లేదని లోకేష్ అంటాడు. అసలు మీరు తెచ్చిన సంస్థలేవో ఓసారి ప్రజలకు రిలీజ్ చేయండి. ఈ రాష్ట్రానికి మంచి జరగకూడదని తండ్రీ కొడుకులు కోరిక. నువ్వు చదివింది ఇంగ్లిష్ మీడియమే కదా.. ఒక్కసారి జపాన్ కాన్సులేట్ జనరల్ మాట్లాడిన మాటలు విను" అంటూ మంత్రి అమర్‌నాథ్ లోకేశ్‌కి కౌంటర్ ఇచ్చారు.

  "జగన్‌మోహన్ రెడ్డి పెళ్లి కోరితే.. చంద్రబాబు చావు కోరే రకం. భారతి గురించి మాట్లాడటానికి నీకు ఏం సంబంధం. నీకు బ్రహ్మణికి ఏమన్నా తగువులుంటే ఇంట్లో కూర్చొని తీర్చుకోండి. నువ్వు బ్రహ్మణిని తిట్టలేక మాతో తిట్టించాలని అనుకుంటున్నావు. మేం ఏదన్నా అంటే తండ్రీ కొడుకులు బోరున ఏడుస్తారు" అంటూ మంత్రి చురకలు అంటించారు.
  Published by:Mahesh
  First published:

  Tags: AP Politics, Nara Lokesh, Pawan kalyan, Ys jagan

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు